🌹 15 NOVEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹

🍀🌹 15 NOVEMBER 2024 FRIDAY ALL MESSAGES శుక్రవారం, బృగు వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం - త్రితయభోక్తా విరేషః - మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని అస్వాదించే వాడు శివుడు. - 1 to 4 షార్ట్‌ వీడియోలు 🌹
2) 🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra: Tritayabhokta Viresha - The One Who Enjoys the Bliss of the Three States is Shiva. 1 to 4 Short Videos 🌹
3) 🌹 शिव सूत्र, भाग 1 - शंभवोपाय - 11वां सूत्र: तृतयभोक्ता वीरेशः - तीनों चेतनाओं के आनंद को अनुभव करने वाले शिव - 1 से 4 शॉर्ट वीडियो 🌹
4) 🌹 కార్తీక పౌర్ణమి, దేవదీపావళి, త్రిపుర పౌర్ణమి శుభాకాంక్షలు Kartik Purnima, Dev Deepavali, Tripura Pournami, Good Wishes to All. 🌹
🌻 కార్తీక పౌర్ణమి విశిష్ట‌త 🌻
5) 🌹 కార్తిక పురాణం - 14 🌹
🌻. 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీకమాసములో విసర్జింప వలసినవి, కార్తీక మాస శివపూజా కల్పము. 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 574 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 574 - 2 🌹 
🌻 574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ' - 2 / 574. 'Pragynana Ghanarupini' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం - త్రితయభోక్తా విరేషః - మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని అస్వాదించే వాడు శివుడు. - 1 to 5 షార్ట్‌ వీడియోలు 🌹*
*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.*
*ప్రసాద్‌ భరధ్వాజ*

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 1. మెలకువ, కలలు, గాఢనిద్రా స్థితులు 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 2. ఏకాగ్రత - అనుభూతి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 3. జ్ఞానోదయం పొందిన యోగి 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

🌹 శివ సూత్రాలు 1వ భాగం - 11వ సూత్రం త్రితయభోక్తా విరేషః - 4. కర్తృత్వ భావన 🌹
ప్రసాద్‌ భరధ్వాజ

*సబ్ స్క్రయిబ్ చైతన్య విజ్ఞానం చానల్‌. లైక్ చేయండి, షేర్‌ చేయండి.*
*ప్రసాద్‌ భరధ్వాజ.*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra: Tritayabhokta Viresha - The One Who Enjoys the Bliss of the Three States is Shiva. 1 to 4 Short Videos 🌹*
*Subscribe to Chaitanya Vijnaanam channel. Like and share.*
*Prasad Bharadwaj*

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 1. Awareness, Dreaming, and Deep Sleep States. 🌹
Prasad Bharadwaj

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 2. Focused Awareness. 🌹
Prasad Bharadwaj

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 3. Enlightened Yogi. 🌹
Prasad Bharadwaj

🌹 Shiva Sutras, Part 1 - 11th Sutra - Tritayabhokta Viresha. - 4. The Absence of Doership. 🌹
Prasad Bharadwaj

*Subscribe to Chaitanya Vijnaanam channel. Like and share.*
Prasad Bharadwaj
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 शिव सूत्र, भाग 1 - शंभवोपाय - 11वां सूत्र: तृतयभोक्ता वीरेशः - तीनों चेतनाओं के आनंद को अनुभव करने वाले शिव - 1 से 4 शॉर्ट वीडियो 🌹*
*चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें ।*
*प्रसाद भरद्वाज*

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 1. जाग्रत, स्वप्न, और गहरी निद्रा अवस्थाएँ 🌹
प्रसाद भरद्वाज

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 2. एकाग्रता - अनुभूति 🌹
प्रसाद भरद्वाज

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 3. ज्ञानोदय प्राप्त योगी 🌹
प्रसाद भरद्वाज

🌹 शिव सूत्र, भाग 1 - 11वां सूत्र तृतयभोक्ता वीरेशः - 4. कर्तृत्व भाव 🌹
प्रसाद भरद्वाज

चैतन्य विज्ञानम चैनल को सब्सक्राइब करें। लाइक करें, शेयर करें ।  
प्रसाद भारद्वाज.
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 కార్తీక పౌర్ణమి, దేవదీపావళి, త్రిపుర పౌర్ణమి శుభాకాంక్షలు Kartik Purnima, Dev Deepavali, Tripura Pournami, Good Wishes to All. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 కార్తీక పౌర్ణమి విశిష్ట‌త 🌻*

*పూర్వం వేదాల‌ను అపహరించి సముద్రంలో దాక్కున్న సోమకుడనే రాక్షసుడిని సంహరించేందుకు శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించినది కార్తీక పౌర్ణమినాడే. కార్తీక మాసం పౌర్ణమి రోజున ప్రదోష కాలంలో కూడా దేవతలు దీపావళి పండుగ జరుపుకుంటారు. 

కార్తీక పూర్ణిమను త్రిపుర పూర్ణిమ అని ఎందుకు అంటారంటే.. పురాణాల ప్రకారం కార్తికేయుడు తారకాసురుడు అనే రాక్షసుడిని సంహరించాడు. అనంతరం తారకాసురుడు ముగ్గురు కుమారులు తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి లను త్రిపురాసురులు అంటారు. వీరు బ్రహ్మ దేవుడుకోసం తపస్సు చేసి ఒక నగరం నిర్మించి ఇవ్వమని వరం కోరారు. అంతరిక్షంలో తిరుగుతూ వేయి సంవత్సరాలకొకసారి కలుసుకుంటూ ఉండేటట్లు.. అలా కలుసుకున్న సమయంలో ఒకే బాణంతో ఎవరు మూడింటిని ధ్వంసం చేయగలరో వారివల్ల మాత్రమే మరణం కలిగేటట్లు వరం పొందారు. ఈ వరం పొందిన తరువాత త్రిపురాసులు మూడు లోకాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్తీక పున్నమి రోజున శివుడు ఒకే బాణంతో ముగ్గురు రాక్షసులను సంహరించాడు. అందుకే దేవతలు స్వర్గంలో దీపాలు వెలిగించారు. ఈ రోజున దేవతలు భూమిపైకి వస్తారని నమ్ముతారు. వారికి స్వాగతం పలికేందుకు నేలపై దీపాలు వెలిగిస్తారు. పవిత్ర నదుల తీరాలు దీపాలతో ప్రకాశిస్తాయి. వారణాసిలో దేవతల దీపావళికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.*

*ఈ పౌర్ణమిని కైశిక పౌర్ణమి, జీటికంటి పున్నమి, కుమార దర్శనం అనే పేర్లతో కూడా పిలుస్తారు. కార్తీక పౌర్ణమి రోజు కొన్నిచోట్ల వృషోత్సర్జనం అనే ఉత్సవం జరుపుకుంటారు. ఒక కోడెదూడను ఆబోతుగా స్వేచ్చగా కీర్తిశేషులైన పితృదేవతల ప్రీత్యర్థం వదులుతారు.*
*తమిళనాడు తిరువణ్ణామలైలో జ్యోతి స్వరూపుడై వెలిసిన శివుడి అగ్నిలింగాన్ని దర్శించుకోవడానికి వేలమంది భక్తులు తరలివెళతారు.*
*కార్తీక పౌర్ణమిరోజు వెన్నెలలో పాలు కాస్తే ఆ పాలు అమృతతుల్యం అవుతాయని విశ్వాసం. అందుకే పూర్వకాలంలో కార్తీక పౌర్ణిమ వెలుగులో పొయ్యి వెలిగించి పాలను మిరియాలతో పాటు కాచి తాగేవారు.*
*కార్తీక పౌర్ణమి రోజు ఆకాశంలో చంద్రుడి నిండైన రూపంతో పాటు దానికి అతిచేరువలోనే దేవతల గురువైన బృహస్పతి (గురుగ్రహం) కూడా ఈ రోజున సాక్షాత్కరిస్తుందని, ఆ గురుశిష్యులకి భక్తితో నమస్కరిస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.*

*శాస్త్రాల ప్రకారం, కార్తీక మాసంలో గంగానదిలో పవిత్ర స్నానం చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని చాలా మంది నమ్ముతారు. కార్తీక మాసంలో పవిత్ర నదీ స్నానం, దీపారాధాన, దీప దానాలకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ మాసంలో చెరువులు, బావులు, కాలువల్లో భానుడి కిరణాల ప్రభావంతో నీటిని మరింత బలం పెరుగుతుందని పురాణాల్లో ప్రస్తావించబడింది. అంతేకాదు దేవుని పూజకు అవసరమైన పుష్పాలను అందిస్తుంది. అందుకే కార్తీక మాసంలో పవిత్ర జలాన్ని ‘హంసోదకం’ అని అంటారు. కార్తీక పౌర్ణమి రోజున గంగా స్నానం మాత్రమే కాదు.. దీప దానం, శివలింగ, సాలగ్రామములను దానము చేయుట, ఇతర దానాలు చేయడానికి ఎంతో పవిత్రమైనది. పురాణాల ప్రకారం, ఈ రోజున క్షీర సాగర దానానికి అనంతమైన ప్రాముఖ్యత ఉంది. కార్తీక పౌర్ణమి రోజునే కేదారేశ్వర, గౌరీ నోములు నోచుకుంటారు. కొందరు టపాసులు కాల్చి వేడుకలు జరుపుకుంటారు. కార్తీక పౌర్ణమి రోజున పరమేశ్వరుడికి నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించాలి. ఇలా చేయడం వల్ల ఈశ్వరుడు సంతోషిస్తాడని, తన అనుగ్రహం కచ్చితంగా లభిస్తుందని పురాణాల్లో పేర్కొనబడింది.*

*కార్తీక పౌర్ణమి రోజున ఉసిరికాయలను దానం చేస్తే దారిద్య్రం తొలగిపోతుంది. అలాగే లలితా సహస్రనామాలను చేస్తే సిరి సంపదలు కలుగుతాయి. విష్ణు సహస్రనామ పారాయణం, లలిత పారాయణం, లక్ష్మీ అష్టోత్తరం, శివ పంచాక్షరీ స్తోత్రం, శివ సహస్రనామం, శివ పురాణాల పారాయణం చేసినా కూడా డబ్బుకు కొరత అనేదే ఉండదట. అదే విధంగా ఏదైనా పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటే గొప్ప ఫలితాలు వస్తాయని పండితులు చెబుతున్నారు. కార్తీక పౌర్ణమి రోజున దీప దానం, ఉసిరి కాయల దానంతో పాటు పేదలకు అన్నదానం, వస్త్ర దానం చేయాలి. అనారోగ్యంతో ఉన్న వారికి పండ్లు, పాలు వంటివి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల మీ కుటుంబ జీవితంలో మంచి ఫలితాలొస్తాయి అని అంటారు.*

*పురాణాల ప్రకారం చంద్రుడు తమో గుణాన్ని హరిస్తాడు. అందుకే తనను పరమేశ్వరుడు తన తలపై ధరించాడు. పూర్ణిమ నాడు వచ్చే వెన్నెల ఎంతో ఆరోగ్యకరమైనది. ముఖ్యంగా రాత్రి చంద్రోదయం తర్వాత పచ్చి పాలను నీటిలో కలిపి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించాలి. కార్తీక పూర్ణిమ నాడు వెన్నెల్లో పరమాన్నం సిద్ధం చేసుకుని.. పూజలు పూర్తయిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. పగలంతా ఉపవాసం ఉండాలి. ఇలా చేయడం వల్ల జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోయి సుఖసంతోషాలతో జీవిస్తారు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తిక పురాణం - 14🌹*
*🌻. 14 వ అధ్యాయము : ఆబోతునకు అచ్చుబోసి వదులుట (వృషోసర్గము), కార్తీక మాసములో విసర్జింప వలసినవి, కార్తీక మాస శివపూజా కల్పము. 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

మరల వశిష్ఠులవారు, జనకుని దగ్గరగా కూర్చుండ బెట్టుకొని కార్తీకమాస మహాత్మ్యమును గురించి తనకు తెలిసిన సర్వవిషయములు చెప్పవలెనను కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి.

ఓ రాజా! కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానముచేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములను నశింపజేసుకొందురు.

వారికి కోటియాగములు చేసిన ఫలము దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలును తమ వంశమందెవ్వరు ఆబోతునకు అచ్చువేసి వదలునో అని ఎదురుజూచుచుందురు. ఎవడు ధనవంతుడై యుండి పుణ్యకార్యములు చేయక, దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లియైననూ చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయేగాక వాని బంధువులను కూడా నరకమున గురుచేయును. కాన ప్రతి సంవత్సరం కార్తీకమాసమున తన శక్తికొలది దానము చేసి నిష్టతో వ్రతమాచరించి సాయంసమయమున శివకేశవులకు ఆలయమునందు దీపారాధనచేసి ఆ రాత్రియంతయు జాగరముండి మరునాడు తమ శక్తికొలది బ్రాహ్మణులకు, సన్యాసులకు భోజనమిడినవారు ఇహపరములందు సర్వసుఖములను అనుభవింతురు.

🌻. కార్తీకమాసములో విసర్జింపవలసినవి 🌻

ఈ మాసమందు పరాన్నభక్షణ చేయరాదు. ఇతరుల యెంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. తిలాదానము పట్టరాదు. శివార్చన, సంధ్యావందనము చేయనివారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారములనాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయరాదు. కార్తీకమాసమున నెలరోజులూ కూడా రాత్రులు భుజించరాదు, విధవ వండినది తినరాదు. ఏకాదశీ, ద్వాదశీ వ్రతములు చేయువారలు ఆ రెండు రాత్రులు తప్పనిసరిగా జాగరము ఉండవలెను. ఒక్కపూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీకమాసములో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీకమాసమున వేడినీటితో స్నానము కూడదు చేసిన కల్లుతో సమానము బ్రహ్మదేవుడు చెప్పెను. కావున, వేడినీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యము వుండి యెలాగైనా విడువకుండా కార్తీకమాసవ్రతం చేయవలెనన్న కుతూహలం గలవాడు మాత్రమే వేడినీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారలు గంగ, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను.

ఏ నది తనకు దగ్గరలో వుంటే ఆ నదిలో ప్రాతఃకాలమున స్నానము చేయవలయును. అటుల చేయనియెడల మహాపాపియై జన్మజన్మములు నరకకూపమున బడి కృశింతురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గరగాని, చెరువునందుగాని స్నానము చేయవచ్చును. అప్పుడు యీ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానమాచరించవలెను.

గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతీ |
నర్మదా సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు ||

అని పఠించుచు స్నానము చేయవలయును. కార్తీకమాస వ్రతము చేయువారు పగలు పురాణపఠన శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడుఓవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరముననున్న సివుని కల్పోక్తముగా ఈ క్రింది విధమున పూజించవలెను.

🌻. కార్తీకమాస శివపూజాకల్పము 🌻

1. ఓం శివాయ నమః - ధ్యానం సమర్పయామి
2. ఓం పరమేశ్వరాయ నమః - ఆవాహనం సమర్పయామి
3. ఓం కైలాసవాసాయ నమః - నవరత్న సింహాసనం సమర్పయామి
4. ఓం గౌరీనాథాయ నమః - పాద్యం సమర్పయామి
5. ఓం లోకేశ్వరాయ నమః - అర్ఘ్యం సమర్పయామి
6. ఓం వృషభవాహనాయ నమః - స్నానం సమర్పయామి
7. ఓం దిగంబరాయ నమః - వస్త్రం సమర్పయామి
8. ఓం జగనాథాయ నమః - యజ్ఞోపవీతం సమర్పయామి
9. ఓం కపాలధారిణే నమః - గంధం సమర్పయామి
10. ఓం సంపూర్ణ గుణాయ నమః - పుష్పం సమర్పయామి
11. ఓం మహేశ్వరాయ నమః - అక్షతాన్ సమర్పయామి
12. ఓం పార్వతీనాథాయ నమః - ధూపం సమర్పయామి
13. ఓం తేజోరూపాయ నమః - దీపం సమర్పయామి
14. ఓం లోకరక్షాయ నమః - నైవేద్యం సమర్పయామి
15. ఓం త్రిలోచనాయ నమః - కర్పూర నీరాజనం సమర్పయామి
16. ఓం శంకరాయ నమః - సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి
17. ఓం భవాయ నమః - ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయామి

ఈ ప్రకారముగా కార్తీకమాసమంతయు పూజించవలెను శివసన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసినయెడల ధన్యుడగును. పూజానంతరము తన శక్తినిబట్టి బ్రాహమణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తిపరచవలెను. ఇటుల చేసిన నూరు అశ్వమేధ యాగములు చేసిన ఫలము, వెయ్యి వాజిపేయి యాగములు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీకమాసము నెల రోజులు బ్రాహ్మణ సమారాధన శివకేశవుల సన్నిధిని నిత్యదీపారాధన, తులసీకోటను కర్పూర హారతులతో దీపారాధన చేసిన యెడల, వారికీ, వారివంశీయులకు, పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగియుండి కూడా యీ వ్రతము నాచరించనివారును వంద జన్మలు నానాయోనులందునా జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, యెలుక మొదలగు జన్మలెత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన యెడల పదిహేను జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టివారలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి చతుర్దశాధ్యాయము - పద్నాలుగవరోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 574 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ' - 2 🌻*

*శ్రీమాత ప్రకటింపబడిన జ్ఞానరూపిణి. లవలేశమైననూ అజ్ఞాన ముచే తాక బడనది. లోపల వెలుపల ఒకే విధమగు ప్రజ్ఞతో కూడి యుండునది. ఈ కారణము చేత కూడ ఆమెను 'ప్రజ్ఞాన ఘనరూపిణి' అని కీర్తింతురు. శ్రీమాత ఘనరూపము దాల్చును అనుటలో విశేషార్థ మున్నది. ఘనమునకు ఆరు ముఖము లుండును. ఒక్కొక్క ముఖము ఒక్కొక్క చతురస్రముగ నేర్పడును. ఒక చతురస్రమున నాలుగు లంబకోణము లుండును. ఆరు చతురస్రములందు ఇరువది నాలుగు లంబకోణము లుండును. మొత్తము ఇరువది నాలుగు (24) లంబకోణములుగ ఘనము వున్నది. ఈ ఇరువది నాలుగు తత్త్వములుగనే సృష్టి ఏర్పడును. ఇట్లు తాను ఘనరూపమై తత్వార్థ వర్ణాత్మికయై సృష్టిగ యేర్పడును. *

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 574. 'Pragynana Ghanarupini' - 2 🌻*

*Sri Mata is the expressed form of wisdom, untouched by even the slightest trace of ignorance. She is integrated within and without by the same wisdom. For this reason, she is praised as "the Embodiment of Dense Wisdom." The idea of her as a solid form holds specific significance. A solid form (cube) has six faces, each face a square. Each square has four right angles, and thus, in six squares, there are a total of twenty-four right angles. These twenty-four right angles correspond to the twenty-four fundamental principles of creation, implying that she embodies herself in this solid form and manifests as the essential elements of creation.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment