🌹 16 NOVEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 16 NOVEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹 శివ సూత్రాలు, 1వ భాగం - శంభవోపాయ - 11వ సూత్రం: త్రితయ భోక్తా విరేషః - మనస్సు మరియు ఇంద్రియాలకు అధిపతిగా, శివుడు మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. 🌹  
2) 🌹 Shiva Sutras, Part 1 - Shambhavopaya - 11th Sutra: Tritaya Bhokta Vireshah - As the master of the mind and senses, Shiva enjoys the bliss of the three states of consciousness. 🌹
3) 🌹 కార్తిక పురాణం - 15 🌹
🌻 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట 🌻
5) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 574 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 574 - 31 🌹 
🌻 574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ' - 3 / 574. 'Pragynana Ghanarupini' - 3 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 శివ సూత్రాలు, 1వ భాగం - శంభవోపాయ - 11వ సూత్రం: త్రితయ భోక్తా విరేషః - మనస్సు మరియు ఇంద్రియాలకు అధిపతిగా, శివుడు మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదిస్తాడు. 🌹*  
*ప్రసాద్ భరద్వాజ*

*ఈ వీడియోలో, మనం శివ సూత్రాల 11వ సూత్రాన్ని, "త్రితయ భోక్తా విరేషః," విశ్లేషిస్తాము. ఇందులో, శివుడిని మెలకువ, కలలు, మరియు గాఢ నిద్ర అనే మూడు స్పృహ స్థితుల ఆనందాన్ని ఆస్వాదించే వాడిగా వివరించారు. ఈ సూత్రం ద్వారా, మనస్సు మరియు ఇంద్రియాల పరిపూర్ణ నియంత్రణ ద్వారా యోగి ఈ స్థితులలో ఎలా ఉండగలడో తెలుసుకుంటాము. ఈ సూత్రం మన ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎంత ముఖ్యమో, అది మనకు ఏ లోతైన అర్ధాలను నేర్పుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Shiva Sutras, Part 1 - Shambhavopaya - 11th Sutra: Tritaya Bhokta Vireshah - As the master of the mind and senses, Shiva enjoys the bliss of the three states of consciousness. 🌹*
*Prasad Bharadwaj*

*In this video, we explore the 11th Shiva Sutra from the first part of Shambhavopaya, "Tritaya Bhokta Vireshah," where Lord Shiva is described as the one who experiences the bliss of the three states of consciousness: wakefulness, dream, and deep sleep. Discover the spiritual significance and profound meaning behind this sutra and how a Yogi, as the master of mind and senses, transcends these states. Stay tuned for more insights into the Shiva Sutras.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. కార్తిక పురాణం - 15 🌹*
*🌻 15వ అధ్యాయము - దీప ప్రజ్వలనముచే ఎలుక పూర్వజన్మ స్మృతితో నర రూపమందుట 🌻*
*ప్రసాద్ భరద్వాజ*

అంతట జనకమహారాజుతో వశిష్ఠమహాముని - జనకా! కార్తీకమహాత్మ్యము గురించి యెంత వివరించిననూ పూర్తికానేరదు. కాని, మరియొక యితిహాసము తెలియ చెప్పెదను సావధానుడవై ఆలకింపుమని ఇట్లు చెప్పెను.

ఈ మాసమున హరినామ సంకీర్తనలు వినుట, చేయుట, శివకేశవులవద్ద దీపారాధనను చేయుట, పురాణమును చదువుట, లేక, వినుట, సాయంత్రము దేవతాదర్శనము చేయలేనివారు కాలసూత్రమనెడి నరకమునబడి కొట్టుమిట్టాడుదురు. కార్తీకశుద్ద ద్వాదశీ దినమున మనసారా శ్రీహరిని పూజించిన వారికి అక్షయ పుణ్యము కలుగును.

శ్రీమన్నారాయణుని గంధపుష్ప అక్షతలతో పూజించి ధూపదీప నైవేద్యములు యిచ్చిన యెడల, విశేషఫలము పొందగలరు. ఈ విధముగా నెలరోజులు విదువక చేసిన యెడల అట్టివారు దేవదుందుభులు మ్రోగుచుండగా విమానమెక్కి వైకుంఠమునకు పోవుదురు. నెలరోజులు చేయలేనివారు కార్తీకశుద్ద త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి రోజులందైనా నిష్ఠతో పూజలు చేసి ఆవునేతితో దీపము నుంచ వలెను.

ఈ మహాకార్తీకములో ఆవుపాలు పితికినంతసేపు మాత్రము దీపముంచిన యెడల మరుజన్మలో బ్రాహ్మణుడుగా జన్మించును. ఇతరులు వుంచిన దీపము యెగద్రోసి వృద్ధి చేసినయెడలను, లేక, ఆరిపోయిన దీపమును వెలిగించినను అట్టివారల సమస్త పాపములు హరించును. అందులకు ఒక కథ కలదు, వినుమని వశిష్ఠులవారు యిట్లు చెప్పుచున్నారు.

సరస్వతీ నదీతీరమున శిధిలమైన దేవాలయ మొకటి కలదు. కర్మ నిష్ఠుడనే దయార్ద్ర హృదయుడగు ఒక యోగిపుంగవుడు ఆ దేవాలయము వద్దకు వచ్చి కార్తీక మాసమంతయు అచటనే గడిపి పురాణ పఠనము జేయు తలంపురాగా ఆ పాడుబడియున్న దేవాలయమును శుభ్రముగా వూడ్చి, నీళ్లతో కడిగి, బొట్లుపెట్టి, ప్రక్క గ్రామమునకు వెళ్లి ప్రమిదలు తెచ్చి, దూదితో వత్తులుజేసి, పండ్రెండు దీపములుంచి, స్వామిని పూజించుచు, నిష్ఠతో పురాణము చదువుచుండెను. ఈ విధముగా కార్తీకమాసము ప్రారంభము నుండి చేయుచుండెను. ఒకరోజున ఒక మూషికము ఆ దేవాలయములో ప్రవేశించి, నలుమూలలు వెదకి, తినడానికి ఏమీ దొరకనందున అక్కడ ఆరిపోయియున్న వత్తిని తినవలసినదేనని అనుకొని నొట కరచుకొని ప్రక్కనున్న దీపము వద్ద ఆగెను. నోటకరచియున్న వత్తి చివరకు అగ్ని అంటుకొని ఆరిపోయిన వత్తికూడా వెలిగి వెలుతురు వచ్చెను. అది కార్తీకమాస మగుటవలనను, శివాలయములో ఆరిపోయిన వత్తి యీ యెలుక వల్ల వెలుగుటచే దాని పాపములు హరించుకుపోయి పుణ్యము కలిగినందున వెంటనే దాని రూపము మారి మానవ రూపములో నిలబడెను.

ధ్యాన నిష్ఠలో వున్న యోగిపుంగవుడు తన కన్నులను తెరచి చూడగా, ప్రక్కనొక మానవుదు నిలబడి యుండుటను గమనించి "ఓయీ! నీవెవ్వడవు? ఎందుకిట్లు నిలబడి యుంటివి?" అని ప్రశ్నించగా, "ఆర్యా! నేను మూషికమును, రాత్రి నేను ఆహారమును వెదుకుకొంటూ ఈ దేవాలయములోనికి ప్రవేశించి యిక్కడ కూడా ఏమీ దొరకనందున నెయ్యివాసనలతో నుంది ఆరిపోయిన వత్తిని తినవలెనని దానిని నొటకరచి ప్రక్కనున్న దీపంచెంత నిలబడి వుండగ, నా అదృష్టము కొలదీ ఆ వత్తి వెలుగుటచే నా పాపములు పోయినందున కాబోలు వెంటనే పూర్వజన్మ మెత్తితిని. కాని, ఓ మహానుభావా! నేను యెందుకీ మూషికజన్మ మెత్తవలసివచ్చెనో దానికి గల కారణమేమిటో విశదీకరింపు"మని కోరెను.

అంత యోగీశ్వరుడు ఆశ్చర్యపడి తన దివ్యదృష్టిచే సర్వము తెలుసుకొని, "ఓయీ! క్రిందటి జన్మలో నీవు బ్రాహ్మణుడవు. నిన్ను బాహ్లికుడని పిలిచెడివారు. నీవు జైనమత వంశానికి చెందిన వాడవు. నీ కుటుంబాన్ని పోషించుటకు వ్యవసాయము చేస్తూ, ధనాశపరుడై దేవపూజలు, నిత్యకర్మలు మరచి, నీచుల సహవాసము వలన నిషిద్ధాన్నము తినుచు, మంచివారలను, యోగ్యులను నిందించుచు పరులచెంత స్వార్థచింత గలవాడై ఆడపిల్లలను అమ్మువృత్తిచేస్తూ, దానివల్ల సంపాదించిన ధనాన్ని కూడబెట్టుచు, సమస్త తిను బండారములను కడుచౌకగా కొని, తిరిగి వాతిని యెక్కువ ధరకు అమ్మి, అటుల సంపాదించిన ధనము నీవు అనుభవించక యితరులకు యివ్వక ఆ ధనము భూస్థాపితం చేసి పిసినారివై జీవించినావు. మరణించిన తరువాత యెలుక జన్మమెత్తి వెనుకటి జన్మ పాపమును అనుభవించు చుంటివి. నేడు భగవంతుని దగ్గర ఆరిపోయిన దీపాన్ని వెలిగించినందున పుణ్యాత్ముడవైతివి. దానివలననే నీకు తిరిగి పూర్వజన్మ ప్రాప్తించినది. కాన, నీవు నీ గ్రామమునకు పోయి నీ పెరటియందు పాతిపెట్తిన ధనమును త్రవ్వి, ఆ ధనముతో దానధర్మాలు చేసి భగవంతుని ప్రార్థించుకొని మోక్షముపొందు"మని అతనికి నీతులు చెప్పి పంపించెను.

ఇట్లు స్కాందపురాణాంతర్గత వశిష్ఠప్రోక్త కార్తీకమహాత్మ్యమందలి పంచదశాధ్యాయము - పదిహేనోరోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 574 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 116. పరాశక్తిః, పరానిష్ఠా, ప్రజ్ఞాన ఘనరూపిణీ ।*
*మాధ్వీపానాలసా, మత్తా, మాతృకా వర్ణ రూపిణీ ॥ 116 ॥ 🍀*

*🌻 574. 'ప్రజ్ఞాన ఘనరూపిణీ' - 3 🌻*

*సృష్టి యందు ఇరువది నాలుగు తత్త్వములు, ఇరువది నాలుగు అర్థములు, వర్ణములు (అనగా అక్షరములు, శబ్దములు, రంగులు) గుర్తించిన ఋషులు శ్రీమాతను గాయత్రిగా, తత్వార్థ వర్ణాత్మికగ కీర్తించిరి. "చతుర్ వింశతి అక్షర, త్రిపథ, షట్కుక్షి" అని కూడ ప్రశంసించిరి. శ్రీమాతయే చతుర్ వింశతి (24) అక్షరములుగ యేర్పడినది. త్రిపథగ ప్రవహించును. అవియే మూడు శక్తులు, మూడు గుణములు. ఆమె షట్కుక్షి అనగా ఆరు. ఆరు కేంద్రముల నేర్పరచి, ఉత్పత్తి గావించును. ఘనమును గూర్చి విశిష్టమగు జ్ఞానమును ఋషులు దర్శించి అందించిరి. కాలమును కూడ ఘనముతో పోల్చి చెప్పిరి. 24 గంటల కాలము, ఇరువది నాలుగు పక్షములతో కూడిన సంవత్సర కాలము. ఇట్లు ఇరువది నాలుగు సంఖ్యతో సృష్టి నెఱుగు విధానమును ఋషులు యేర్పరచిరి.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 574 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 116. Parashaktih paranishta pragynana ghanarupini*
*madhvipanalasa matta matrukavarna rupini  ॥116 ॥ 🌻*

*🌻 574. 'Pragynana Ghanarupini' - 3 🌻*

*In creation, there are twenty-four principles, twenty-four meanings, and twenty-four types of letters (sounds, colors) recognized by sages. Therefore, the sages revered Sri Mata as Gayatri, representing these twenty-four elements. They also praised her as "Chaturvimshati Akshara" (the one with twenty-four letters), "Tripatha" (flowing in three streams), and "Shatkukshi" (having six centers). Sri Mata herself embodies the twenty-four letters and flows through three paths, representing the three energies or three qualities. She is Shatkukshi, meaning she creates through six centers. The sages realized profound wisdom about the cube, equating it to time, symbolizing the 24-hour day and the 24-part lunar year. Thus, they structured creation knowledge around the number 24.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment