శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 578 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁


🍀 117. మహాకైలాస నిలయా, మృణాల మృదుదోర్లతా ।
మహనీయా, దయామూర్తీ, ర్మహాసామ్రాజ్యశాలినీ ॥ 117 ॥ 🍀

🌻 578. 'మహాకైలాస నిలయా' - 3 🌻


కైలాసమున శివశక్తులు నిత్యమూ నృత్యము సలుపుచు నుందురు. లాస్యము నందుందురు. శివ శక్తుల లాస్యస్థానమే కైలాసము. ప్రతి జీవుని యందు కైలాస స్థాన మున్నది. అట్లే భూమికిని కైలాస స్థానము కలదు. అది ఉత్తర ధృవమునకు పైన యున్నది. అట్లే సూర్యునికి కూడ నున్నది. మొత్తము సృష్టికి కూడ కైలాస స్థాన మున్నది. దానినే మహా కైలాస మందురు. అట్టి మహా కైలాసమున వసించునది శ్రీమాత అని అర్ధము. ఉత్తరమునగల కైలాసమును కుబేర స్థానమని కూడ పలుకుదురు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 578 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 117. Mahakailasa nilaya mrunala mrududorlata
mahaniya dayamurti rmahasamrajya shalini ॥117 ॥ 🌻

🌻 578. 'Mahakailasa Nilaya' - 3 🌻


On Kailasa, Shiva and Shakti perpetually perform their cosmic dance, immersed in Lasya (the graceful dance of creation). Kailasa is the site of this dance of Shiva and Shakti. Every living being has its own Kailasa within. Similarly, the Earth has its Kailasa, located above the North Pole. The Sun, too, has its Kailasa. In essence, the entire creation has its Kailasa, referred to as Maha Kailasa. The meaning is that Sri Mata resides in this Maha Kailasa. The northern Kailasa is also called the abode of Kubera, the deity of wealth.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment