🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 585 - 6 / Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 6 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 118. ఆత్మవిద్యా, మహావిద్యా, శ్రీవిద్యా, కామసేవితా ।
శ్రీషోడశాక్షరీ విద్యా, త్రికూటా, కామకోటికా ॥ 118 ॥ 🍀
🌻 585. 'శ్రీవిద్యా’ - 6 🌻
అటుపైన సూక్ష్మతమమైన వాగ్భవ కూటము వ్యాప్తి చెందును. అపుడు శ్రీమాత ప్రజ్ఞా స్వరూపము ఆవిష్కరింప బడి పరమానందము పొందును. ఇట్లు ప్రజ్ఞ శక్తి, సూక్ష్మ పదార్థముగ తన స్వరూపము వ్యాప్తి చెందుచూ, శ్రీమాత అద్భుత దర్శనమును పొంది అమితానందముతో సాయుజ్యమును పొందును. శ్రీమాత వాగ్భవకూటమే పంచాక్షరి. క, ఎ, ఐ, ల, హ్రీం. ఇట్లు పంచాక్షరి, షడాక్షరి, చతురాక్షరిగా వ్యాప్తి చెందిన తత్త్వము అనుభూతి యగును. తత్వ స్వరూపిణిగా ఆమె ఈ మూడు కూటములను మించి యుండును. అట్టి తత్త్వమే మూడు కూటములుగ దిగి వచ్చును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 585 - 6 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 118. Aatmavidya mahavidya shreevidya kamasevita
shree shodashaksharividya trikuta kamakotika ॥118 ॥ 🌻
🌻 585. 'Shree Vidya' - 6 🌻
Following this, the "Vagbhava Kuta", the subtlest of all clusters, unfolds. At this stage, Sri Mata, in her form as Pragya Swaroopa (embodiment of supreme wisdom), is revealed, and the seeker attains supreme bliss. As the power of wisdom spreads, merging with the essence of subtle elements, the seeker beholds the wondrous vision of Sri Mata and experiences boundless joy, ultimately achieving "Sayujya" (oneness with the divine). The Vagbhava Kuta, which is also the Panchakshari mantra, consists of the syllables "ka, e, ai, la, hreem". In this way, the divine principle is experienced as the "Panchakshari (five syllables)", "Shadakshari (six syllables)", and "Chaturakshari (four syllables)" mantras. As the embodiment of the ultimate principle, Sri Mata transcends these three clusters, while simultaneously descending into them to manifest her divine essence.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment