🌹 ఈ మకర సంక్రమణంతో ఆ సూర్యుని వెచ్చని కిరణాలు మీ జీవితాన్ని సరికొత్త ఉత్సాహం, ప్రేమ మరియు ఆనందాలతో నింపాలని ఆశిస్తూ మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరికి Happy Makara Sankranthi to All. 🌹
ప్రసాద్ భరద్వాజ
🍀 సంక్రాంతి పండుగ విశిష్టత 🍀
సంక్రాంతిలో ‘క్రాంతి’ అంటే వెలుగు, ‘సం’ అంటే చేరుట. వెలుగును ఆహ్వానించే పండుగే సంక్రాంతి. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే శుభ దినాన్ని మకర సంక్రాంతిగా భావిస్తారు. ఈ రోజు అత్యంత పవిత్రమైన పుణ్యకాలంగా గుర్తించ బడుతుంది.
సంక్రాంతి రోజున కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, బెల్లంతో పొంగలి వండటం ఆనవాయితీ. ఇదే రోజున హరిహరసుతుడు అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాలు చెబుతాయి.
మకర రాశికి అధిపతి శనిదేవుడు కావడంతో, ఈ రోజున నల్ల నువ్వులు, బెల్లం, గుమ్మడికాయలను దానం చేస్తారు. దీనివల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం పెరుగుతాయని విశ్వాసం. ఈ పుణ్యదినాన దైవపూజ, దానధర్మాలు, పితృ తర్పణాలు విశేష ఫలితాన్ని ఇస్తాయని భావిస్తారు.
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment