🌹. శివగీత - 2 / The Siva-Gita - 2 🌹


*🌹. శివగీత - 2 / The Siva-Gita - 2 🌹*
 *🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ

ప్రధమాధ్యాయము
*🌻. భక్తి నిరూపణ యోగము - 1 🌻*

సూత ఉవాచ :
01. అధాత స్సం ప్రవక్ష్యామి - శుద్ధ కైవల్య ముక్తిదమ్,
అనుగ్రహాన్మ హేశస్య- భవ దుఃఖ స్య భేషజమ్ 1

శ్రీ శౌనకాది మహర్షుల గూర్చి సూతుం డిట్లు వాక్రుచ్చెను:

ఓయీ ముని పుంగవులారా! శ్రీ పరమాత్మ పరశివ మూర్తి యొక్క అనుగ్రహము వలన, పరమ పునీతమగు, సంసార మనెడు ఔషధ ప్రాయమైన బ్రహ్మ స్వరూప కైవల్యమును మోక్ష ప్రదమగు జ్ఞానమును నేను మీకు బోధించు చున్నాను.

02. న కర్మణా మనుష్టానై - ర్న దానై స్వపపాసివా,
కైవల్యం లభతే మర్త్య ! - కింతు జ్ఞానేన కేవలమ్ .2

ఎటువంటి పుణ్య కర్మల ననుష్టిం చుట వలనను, ఎలాంటి తపో నుష్టాన ముల జేయుట వలనను కైవల్య పద ప్రాప్తిని పొందలేడు. ఐతే కేవల మొక దివ్య జ్ఞానము వలననే కైవల్య ప్రాప్తి కలుగును .

03. రామాయ దండకారణ్యే - పార్వతీ పతినా పురా ,
యాప్రోక్తా శివ గీతాఖ్యా - గుహ్యా ద్గుహ్యాత మాపిసా 3

04. యస్యా శ్శ్రవణ మాత్రేణ - నృణాం ముక్తి ర్ద్రువా భవేత్,
పురా సనత్కుమారాయి - స్కందే నాభి హిఆ హి సా 4 

పూర్వ కాలమున దండ కారణ్యములో శ్రీరామునకు శంకరుని చేత ఏదైతే ప్రధమమున బోధించ బడినదో, ఏదైతే పరమ గోప్యంబగు నదియు , దేనినీ ఆలించుట చేతనే మానవులకు నిత్య (శాశ్వత) కైవల్యము లభించునో అట్టి శివ గీతను సనత్కుమారునకు షణ్ముఖ స్వామి బోధించెను.

05. సనత్కుమార : ప్రోవాచ - వ్యాసాయ ఋషి సత్తమా ,
మహ్యం కృపాతి రేకేణ - ప్రదదౌ బాధ రాయణః 5

తరువాత నా సనత్కుమారుడు వ్యాసునకు బోధించిన వాడయ్యెను. అట్టి వ్యాస మహర్షి నా యందు అనుగ్రహము కలవాడై నాకు బోధించి యున్నాడు.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 The Siva-Gita - 2 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula. 
📚. Prasad Bharadwaj

Chapter 01: 
*🌻 Bhakti Niroopana Yoga - 1 🌻*
  
01. Suta muni addresses his disciples Saunakadi Munis and said: Hey Munis! By the grace of the Lord Sri Paramatma Parashivamurti, I'm going to impart a very sacred and divine knowledge which acts as a 
medicine on the samsaara and takes us to Brahma Swaroopa Kaivalya state known as Moksham
  
02. One cannot attain 'Kaivalya Padavi' by performing any kind of virtues or by performing any kind of penances and religious rites. But only through the divine knowledge (Divya Gyana) Salvation (Kaivalya 
Prapti) can be achieved. 
 
03, 04. In olden days in 'Dandaka' forest whatever was preached by Lord Shankara to Rama, which is a divine 
secret, which when implemented in life would give Salvation to human beings, that 'Shiva Gita' was 
preached to Sanatkumara by Shanmukha (Skanda). 
 
05. Subsequently, that Sanat Kumara preached the same to Vyasa। That sage Vyasa became graceful on me 
and transferred that knowledge to me. 

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment