శివగీత - 24 / The Siva-Gita - 24

Image may contain: 3 people, people standing
🌹. శివగీత - 24 / The Siva-Gita - 24 🌹

🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴
📚. ప్రసాద్ భరద్వాజ

తృతీయాధ్యాయము
🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 8 🌻

వేద సారా భిదం నిత్య - శివ ప్రత్యక్ష కారకమ్,
ఉక్తంచ తేన రామ ! త్వం - జప నిత్యం ది వానిశమ్ 33

తతః ప్రసన్నో భగవా - న్మహా పాశు పతాస్త్రకమ్,
తుభ్యం దాస్యతి తేన త్వం - శత్రూన్హ త్వాప్స్యసి ప్రియమ్ 34

తస్త్యై వాస్త్రస్య మాహాత్మ్యా - త్సముద్రం వో షయిష్యసి,
సంహార కాలే జగతా - మస్త్రం తత్పా ర్వతీ పతే: 35

తద లాభే దాన వానాం- జయస్తవ సుదుర్లభః,
తస్మా ల్లబ్దుం తదే వాస్త్రం - శరణం యాహి శంకరమ్, 36

ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం తృతీయో ధ్యాయః
మరియు నా ముని పుంగవుండిట్లు చెప్పు చుండెను.

ఓ రామా! నీవు నాచేత బోధింప బడిన వేద సార శివ సహస్ర నామంబులను అనన్య భక్తితో నిశ్చల మనస్సుతో రేయింబవళ్ళు పటింపుము.

దానితో ( తత్ఫలితముగ ) శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై నీకు పాశు పతాస్త్రమును ప్రసాదించును.

నీవా అస్త్రము వలన శత్రువులను హత మొనర్చి నీ ప్రీతికి పాత్రు రాలైన భార్యను పొందగలవు .

ఆ మహాస్త్రము బలము చేతనే విశాలము మరియు గంభీరమునైన సాగరమును కూడా శుష్కింప చేయగలవు. ప్రళయ కాలములోనే మహాస్త్రము పరమ శివునకు (పార్వతి పతికి ) ప్రధాన మైనదిగా నున్నదో అటువంటి మహాస్త్రము నీకు లభ్యము గానిచో నీవు రాక్షసులను జయింప లేవు.

ఆ కారణము చేత ఆ మహిమాన్విత అస్త్ర ప్రాప్తికై నీ వనన్య భక్తితో నీశ్వరుని శరణు బొందుము.

ఇది వ్యాసోక్త శ్రీ పద్మ పురాణాంతర్గతమైన శివ గీత యందలి మూడవ అధ్యాయము సమాప్తము .

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🌹 The Siva-Gita - 24 🌹
🌴. Dialogue between Rama and Lord Siva 🌴

✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj

Chapter 03 :
🌻 Viraja Deeksha Lakshana Yoga - 8 🌻

Moreover that sage spoke the following words:

O Rama! These thousand names of Shiva are summary of vedas (Veda saaransham) and can grant the devotee with the vision of Lord Shiva. You should chant these Vedasaara Shiva Sahasranama day and night with full devotion.

Consequently, Lord Shiva having become pleased with you. would gift you the Pashupatastra weapon.

By possessing that weapon you would become powerful enough for slaying your enemies and can gain your beloved wife back for yourself. With the power of that missile only you can even dry up the limitless ocean.

The weapon which acts as the primary cause behind the dissolution of universes during the end of time, unless that supreme weapon is possessed by you, victory over the demons is not possible.

For that reason in order to gain that supreme weapon, take the refuge of that Eswara.

Here ends the third chapter of Shiva Geeta present in Padma Purana Uttara Khanda.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment