2) 🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 239 / Sripada Srivallabha Charithamrutham - 239🌹
3) 🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 119🌹
4) 🌹 The Masters of Wisdom - The Journey Inside - 141🌹
5) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 55 / Sri Lalita Sahasranamavali - Meaning - 55 🌹
6) 🌹. నారద భక్తి సూత్రాలు - 58🌹
7) 🌹 Guru Geeta - Datta Vaakya - 26🌹
8) 🌹. శివగీత - 24 / The Shiva-Gita - 24🌹
9) 🌹. సౌందర్య లహరి - 66 / Soundarya Lahari - 66🌹
10) 🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365🌹
11) 🌹 . శ్రీ శివ మహా పురాణము - 191🌹
12) 🌹 AVATAR OF THE AGE MEHER BABA MANIFESTING - 67 🌹
13) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 63 🌹
15) 🌹. భారతీయ మహర్షుల - మార్గదర్శకుల జ్ఞానం - 78 🌹
15) 🌹 Seeds Of Consciousness - 143 🌹
16) 🌹. మనోశక్తి - Mind Power - 81🌹
17)🌹.శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి సంక్షిప్త జీవిత చరిత్ర - కాలజ్ఞానం - 27🌹
18) 🌹 Twelve Stanzas from the Book of Dzyan - 10🌹
18) 🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 21🌹
19) 🌹. భగవద్దర్శిని - అవతార్ మెహర్ - 6 🌹
20)
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 451 / Bhagavad-Gita - 451 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -08 🌴*
08. మయ్యేమ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ |
నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వం న సంశయ: ||
🌷. తాత్పర్యం :
దేవదేవుడైన నా యందే నీ మనస్సును స్థిరముగా నిలుపుము మరియు నీ బుద్ధినంతయు నా యందే నియుక్తము గావింపుము. ఈ విధముగా సదా నా యందే నీవు నిస్సంశయముగా నివసింతువు.
🌷. భాష్యము :
: శ్రీకృష్ణభగవానుని భక్తియుతసేవలో నియుక్తుడైనవాడు ఆ భగవానునితో ప్రత్యక్ష సంబధమున జీవించును.
తత్కారణముగా తొలినుండియే అతని స్థితి ఆధ్యాత్మికమై యుండుననుటలో ఎట్టి సందేహము లేదు. వాస్తవమునకు భక్తుడెన్నడును భౌతికపరధిలో జీవింపడు. అతడు సదా కృష్ణుని యందే నిలిచియుండును.
కృష్ణనామమునకు మరియు కృష్ణునకు భేదములేదు కనుక భక్తుడు కృష్ణుని నామమును ఉచ్చరించినంతనే కృష్ణుడు మరియు అతని అంతరంగశక్తి భక్తుని నాలుకపై నాట్యము చేయుదురు. భక్తుడు వివిధ పదార్థములను నైవేద్యముగా అర్పించినపుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షముగా వాటిని స్వీకరించును. పిదప భక్తుడు ఆ ప్రసాదమును గొని కృష్ణభావనలో తన్మయుడగును.
భగవద్గీత యందు మరియు ఇతర వేదవాజ్మయమునందు ఈ పద్ధతి వివరింపబడియున్నను ఇట్టి భక్తియుత సేవాకార్యమున నియుక్తుడు కానివాడు అదియెట్లు సంభవమనెడి విషయమును అవగతము చేసికొనజాలడు.
*🌹 Bhagavad-Gita as It is - 451 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
*🌴 Chapter 12 - Devotional Service - 08 🌴*
08. mayy eva mana ādhatsva
mayi buddhiṁ niveśaya
nivasiṣyasi mayy eva
ata ūrdhvaṁ na saṁśayaḥ
🌷 Translation :
Just fix your mind upon Me, the Supreme Personality of Godhead, and engage all your intelligence in Me. Thus you will live in Me always, without a doubt.
🌹 Purport :
One who is engaged in Lord Kṛṣṇa’s devotional service lives in a direct relationship with the Supreme Lord, so there is no doubt that his position is transcendental from the very beginning. A devotee does not live on the material plane – he lives in Kṛṣṇa.
The holy name of the Lord and the Lord are nondifferent; therefore when a devotee chants Hare Kṛṣṇa, Kṛṣṇa and His internal potency are dancing on the tongue of the devotee.
When he offers Kṛṣṇa food, Kṛṣṇa directly accepts these eatables, and the devotee becomes Kṛṣṇa-ized by eating the remnants.
One who does not engage in such service cannot understand how this is so, although this is a process recommended in the Bhagavad-gītā and in other Vedic literatures.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము - 239 / Sripada Srivallabha Charithamrutham - 239 🌹*
✍️. శ్రీ మల్లాది గోవింద దీక్షితులు
📚. ప్రసాద్ భరద్వాజ
అధ్యాయం 48
*🌹. శ్రీపాదుల ధర్మబోధలు 🌹*
శ్రీపాదులవారు సాధారణంగా గురువారంనాడు పంచదేవ్‌పహాడ్‌లో దర్బారు జరిపేవారు. వారు కృష్ణ మీదుగా నడిచి వచ్చేటప్పుడు కాలు పెట్టబోయే ప్రతిచోట ఒక పద్మం ఉదయించేది. వారు ఆ పద్మాల మీదుగా నడిచి వచ్చేవారు. ఆ కర్ర పాదుకలు ఎలా వాటిమీద నిలిచేవో ఊహకు అందని విషయం.
దర్బారు సాయంత్రం వరకు సాగేది. వారు మళ్ళీ ఇదే విధంగా నడుచుకుంటూ తిరిగి కురుంగడ్డ వెళ్ళేవారు. భక్తులు వారికి వచ్చేటప్పుడు స్వాగతం, వెళ్ళేటప్పుడు వీడ్కోలు ఇచ్చేవారు. ప్రతి శుక్రవారం స్త్రీలకు పసుపు కొమ్ములు పంచి ఇచ్చేవారు.
తమకంటె పెద్దవారయిన స్త్రీలను అమ్మా! సుమతీ! అనో, అమ్మా! అనసూయమ్మతల్లీ! అనో పిలిచేవారు. చిన్నవారిని అమ్మా! వాసవీ, అనికాని సురేఖా, రాధా, విద్యాధరీ! పేర్లతో కాని పిలిచేవారు. వృద్ధు లను ఆప్యాయంగా అమ్మమ్మా! అని, మగవారిని అయితే తాతా! అని పిలిచేవారు. ఇలా చిన్నవాళ్ళనైనా, పెద్దవాళ్ళ నైనా ఆపేక్షగా మర్యాదగా సంబోధించి మాట్లాడే వారు.
శుక్రవారం దర్బారు వీలునుబట్టి పంచదేవ్‌పహాడ్‌లోకాని, కురుం గడ్డలో కాని నిర్వహించేవారు.
ఆదివారం యోగవిద్య,
సోమవారం పురాణగాథలు
మంగళవారం ఉపనిషత్తులు
బుధవారం వేదాలు-వేదార్థాలు
గురువారం గురుతత్వం
శుక్రవారం శ్రీవిద్య
శనివారం శివారాధనమహత్యం
ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయం ప్రబోధించేవారు. ఏ రోజయినా సరే భక్తుల యోగక్షేమాలు మాత్రం తప్పక అడిగి తెలుసుకొనేవారు. ప్రతిరోజు అన్నసంతర్పణ ఉండేది. గురువారం మాత్రం ప్రత్యేకమైన వంటలు చేయించి, స్వయంగా వడ్డించేవారు. అదృష్టవంతులు కొంతమందికి స్వహస్తాలతో తినిపించేవారు కూడా.
ఏదో ఒక తీపి పదార్థం ప్రసాదంలా పంచేవారు. భక్తులు జొన్నలు, రాగులు, వరి, కాయగూరలు మొదలైనవి తెచ్చేవారు. ఎలాంటి బాధతో వచ్చిన భక్తులైనా, ఆబాధ నివారణ అయ్యే దర్బారునుండి తిరిగి వెళ్ళేవారు.
శ్రీదత్తపురాణం చదవమని, దత్తుల అనుగ్రహం తప్పక లభిస్తుందని శ్రీచరణులు బోధించే వారు. రాత్రివేళ ఎవ్వరిని కురుంగడ్డలో ఉండనిచ్చేవారు కాదు. నాతో వచ్చిన వృద్ధ సన్యాసిని మాత్రం కొన్ని రోజులు ఉండని చ్చారు. తరువాత వారిని కాశీకి వెళ్ళమని, అక్కడే దేహం చాలించమని చెప్పారు.
భోజనం తయారుచేయడం, వంటపాత్రలు తోమడం, వచ్చిన భక్తులకు అసౌకర్యం కలగకుండా చూడటం నా విధులు. ఏ వేళలో భక్తులు వచ్చినా వాళ్ళకు విధిగా భోజనం పెట్టాలని, వాళ్ళది ప్రసాద రూపంలో తప్పక తినాలని చెప్పేవారు.
ఎప్పుడయినా భోజన పదార్థాలు తక్కువగా ఉన్నాయని నేను చెప్తే, తమ కమండలంనుండి వాటిపైన కొద్దిగా నీళ్ళు చల్లేవారు. దానితో వంటకాలన్ని అక్షయంలా వస్తుండేవి. వారుమాత్రం ఏ అన్నమైనా సరే కేవలం గుప్పెడు మెతుకులు తినేవారు.
*🌻. దివ్య ఉపదేశాలు 🌻*
వారి దివ్య దర్శనం అయ్యాక కూడా తమ దుష్ట ప్రవృత్తు లను మార్చుకోనివారికి విచిత్రమైన కష్టాలు వచ్చేవి. తిరిగి వాటి నివారణ కోసం ప్రభువుల వద్దకు పరుగెత్తుకు వచ్చే వారు. చనిపోయిన పెద్దలకు శ్రద్ధతో తప్పక శ్రాద్ధకర్మలు చేయాలని బోధించేవారు.
ఎవరిపైన తమకు పక్షపాత ధోరణి లేదని, అష్టాదశ వర్ణాలవారు తమ దృష్టిలో సమానులే అని, వాళ్ళు అనుసరించే ధర్మకర్మలను బట్టి తాము ఫలితాలను ఇస్తామని చెప్పేవారు. నీవు నీ గురువుకి నమ స్కరిస్తే, అతడు తన గురువుకి నమస్కరిస్తాడని, ఆ శృంఖల చివరకు ఆదిగురువైన తమ వరకు వచ్చి తమకే చెందుతుందని అనేవారు.
దేవతలకు కోపం వస్తే గురువు రక్షిస్తారని, గురువునకే కోపం వచ్చినట్లయితే రక్షించేవారు ఎవ్వరూ ఉండరని హెచ్చరించేవారు. ఈ సృష్టిలో ఎవ్వరిని ద్వేషించ వద్దని, తిరిగి ఆ భావం కూడా తమకే వచ్చి చేరుతుందని ఉద్బోధించేవారు.
రాత్రివేళలలో దేవతలు విమానాలలో, హిమాలయాలలోని యోగులు దివ్యకాంతిమయ దేహాలతో గురుసార్వభౌముల దగ్గరకు కురుంగడ్డ వస్తుండేవారు.
కురుంగడ్డ విశేష మహిమాన్విత క్షేత్రమని, అక్కడ ఉన్న ఈశ్వరుడు జాగృత మూర్తి అని, అక్కడ దేవతలు, మహర్షులు, సిద్ధులు మారు వేషాలలో తిరుగుతుంటారని శ్రీవల్లభులు చెప్పేవారు. తమ దర్శనం సమస్త పాపాలను పోగొట్టి శుభఫలితాలను ఇస్తుందని చెప్పేవారు.
వ్యక్తులు చేసే కర్మలు అన్ని ధర్మ సమ్మతములై ఉండాలని, హృదయంలో నిరంతరం భగవన్నామాన్ని స్మరిస్తూ తమ తమ కర్మలను చేస్తుండాలని చెప్పుతుండేవారు. శ్రీపాదుల దివ్యవచనాలను అనుసరిస్తూ మన జీవితాలను తీర్చి దిద్దుకోవాలని ప్రార్థిస్తున్నాను.
శ్రీపాదరాజం శరణం ప్రపద్యే
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sripada Srivallabha Charithamrutham - 239 🌹*
✍️ Satya prasad
📚. Prasad Bharadwaj
Chapter 26
*🌻 Kanayaka Puranam 🌻*
Sri Kanyaka Puranam is there in the Sanat Sujatha Samhitha, in Skanda Brihit Puranam. Brihat Sila Nagaram is also called Jyestha Sailam.
There were 18 towns namely Brihat Sila Nagaram, Niravadyapuram, Veeranarayanam, Vishalapuram, Asantamu, Narasapuram, Dhanadapuram, Dharmapuram, Jagannadham, Kalingapuram, Panchalapuram, Palakolanu, Trigunapuram, Bhimapuram, Ghantasalam, Peethikapuram. Kusuma Shreshti was ruling these towns with Brihat Sila Nagaram as the capital. 18 is Jaya Sankhya (victory number).
In these eighteen towns, there were Vysya nagara Swamis belonging to 714 gothras. Only 102 were naturally formed gothras. There were strict rules made for these 102 gothras.
The people of other gothras said that they would also follow those strict rules. So they were also included in Vysya nagara Swamis and so the number of gothras went upto to 714.
The people belonging to 102 gothras who followed strict austerities, used to live in Brihat Sila Nagaram. They used to worship ‘Arya Maha Devi’ (Parvathi Devi).
They were called Arya Vysyas because they migrated from Aryavartham and they were revered, used to worship Arya Mahadevi and were following strict austerities different from other important vysyas. The people belonging to the remaining gothras requested to include them also in Arya Vysyas.
Bhaskaracharya used to be the Guru of Kusuma Shresti. My grandfather Bapannavadhani was the same Bhaskaracharya in his previous birth.
After hearing the petition of people of other gothras, Bhaskaracharya said, ‘My Dear people! It is not possible to decide the value without testing the eligibility. There is an ‘Agni Pareeksha’ (test of fire) before taking decisions confirming the eligibility.
People who pass the ‘Agni Pareeksha’ will certainly be given the title ‘Arya Vysya’. Otherwise, it is not possible. Is it acceptable to you all?” Everybody heard this and agreed.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 119 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ
*🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 4 🌻*
లోక కల్యాణమునకై పనిచేయుట సత్యమునందు జీవించుట అనియు, లోకోద్ధరణమునకై పనిచేయుట భ్రాంతిలో జీవించుట అనియు గ్రహించితిమి. అయినచో లోక కల్యాణమునకై పనిచేయుట వలన నాకేమి లభించును? అను ప్రశ్న కలి ప్రేరితుడై, జీవితమును వ్యాపారముగా మార్చుకొన్న వాని యందు ఉదయించును.
లోక కల్యాణమునకై ప్రకృతి, అందలి ఆకాశము, గాలి, నీరు, సూర్యచంద్రులు, నేల పని చేయుచుండుట మనకు కనపడుతున్న సత్యము. వీరికే పై ప్రశ్న పుట్టినచో ఈ జగత్తు యొక్క గమనము లేదు, మానవుని మనుగడ లేదు. ప్రకృతిని అనుసరించుటయే మానవుని కర్తవ్యము. దీనినే యజ్ఞార్థ కర్మ అందురు. ఇదియే నరజాతికి భద్రత చేకూర్చు భవ్యపథము.
జీవుడు లోకహితార్థమై పనిచేయుటకు ఇష్టపడకున్నను, తన అవసరములు తీరుటకై ఇతరులపై ఆధారపడునట్లు ప్రకృతి ఏర్పాటు చేసినది. ఈ ఏర్పాటు నుండి నరుడు లోకహిత కాంక్షయను గుణపాఠము నేర్చుటయే ప్రకృతి ఆశయము. అట్లు నేర్చుటకు కొంతకాలము పట్టును. ఈ లోపు జీవుల పరస్పరాశ్రయత్వము వ్యాపారముగ మార్చుకొని, డబ్బు జీవికగా జీవించుట వలన, ఆహార వస్ర్తాది ఆవశ్యకములు తీరుచున్నట్లే కనపడును. అనుక్షణము అసంతృప్తి మాత్రము తప్పదు.
బహుసంఖ్యాకులగు జనులు ఇట్లే జీవించినచో, పోటి పెరుగును. సమాజమున బలుపు ఏర్పడును. బలము కాదు. బలహీనులు అణచివేతకు గురియగుదురు. ఆపై వారు ప్రతిఘటనకు పూనుకొందురు. వర్గములు ఏర్పడి, పోరాటములతో సంఘము విచ్ఛిన్నమగును. సిద్ధాంతముల పేర ఎట్టి ఆర్థిక సాంఘిక వ్యవస్థ నిర్మించినను, సంక్షోభము, వినాశము తప్పవు..
.....✍ *మాస్టర్ ఇ.కె.*🌻
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 The Masters of Wisdom - The Journey Inside - 141 🌹*
*🌴 Dealing with Obstacles - 3 🌴*
✍️ Master E. Krishnamacharya
📚 . Prasad Bharadwaj
*🌻 Spiritual Instruments - 1 🌻*
In his yoga teachings Patanjali gives a number of obstacles, which obstruct the progress on the spiritual path:
Disease, rejection, doubt, mistake, laziness, indulgence, illusion and self-delusion, lack of determination, lack of continuity of purpose, and disappointment.
Many things have to be re-aligned, so that our personality can attune to the soul, and this has to be done slowly.
If we turn to one obstacle after the other, each for a year, we have overcome 12 obstacles in 12 years. If we want to overcome all 12 at a time, we cannot overcome even a single one. In this a certain occasional indiscipline is o.k.
Thus we can allow the personality from time to time to enjoy a little something; then it is more willing to place itself under the soul.
Otherwise it will spring up with a thirst for revenge after a while. It is said that even the masters tease each other just for sport.
What has been built up in the deeper psyche can be corrected with the help of spiritual instruments, and we obtain them from spiritual psychology.
Normal psychology helps to find out the problem, but in order to solve it we have to turn to the deeper psychology. There is a solution for every problem, and it can be found.
🌻 🌻 🌻 🌻 🌻
Sources : Master K.P. Kumar: Saturn / Jupiter / notes from seminars / Master E. Krishnamacharya: The Yoga of Patanjali.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 55 / Sri Lalita Sahasranamavali - Meaning - 55 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. శ్లోకం 103
499. రక్తవర్ణా -
ఎర్రని రక్త వర్ణంలో ఉండునది.
500. మాంసనిష్ఠా -
మాంస ధాతువును ఆశ్రయించి ఉండునది.
501. గుడాన్నప్రీతమానసా -
గుడాన్నములో ప్రీతి కలది.
502. సమస్త భక్త సుఖదా -
అన్ని రకముల భక్తులకు అవసరమైన సుఖసంతోషాలను ప్రసాదించునది.
503. లాకిన్యంబా స్వరూపిణీ - లాకినీ దేవతా స్వరూపముగా నున్నది.
🌻. శ్లోకం 104
504. స్వాధిష్ఠానాంబుజగతా -
స్వాధిష్ఠాన పద్మములో వసించునది.
505. చతుత్వక్త్ర మనోహరా -
నాలుగు వదనములతో అందముగా నుండునది.
506. శూలాధ్యాయుధ సంపన్నా -
శూలము మొదలైన ఆయుధములు ధరించి యుండునది.
507. పీతవర్ణా - పసుపు పచ్చని రంగులో ఉండునది.
508. అతిగర్వితా -
మిక్కిలి గర్వంతో నుండునది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 55 🌹*
📚. Prasad Bharadwaj
*🌻 Sahasra Namavali - 55 🌻*
499 ) Raktha varna -
She who is of the colour of blood
500 ) Mamsa nishta -
She who is in flesh
501 ) Gudanna preetha manasa -
She who likes rice mixed with jaggery
502 ) Samastha bhaktha sukhadha -
She who gives pleasure to all her devotees
503 ) Lakinyambha swaroopini -
She who is famous in the name of “Lakini”
504 ) Swadhishtanam bujagatha -
She who lives in the six petalled lotus
505 ) Chathur vakthra manohara -
She who has four beautiful faces
506 ) Sulayudha sampanna -
She who has weapons like Spear
507 ) Peetha varna -
She who is of golden colour
508 ) Adhi garvitha -
She who is very proud
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. నారద భక్తి సూత్రాలు - 58 🌹*
✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,
*🌻. చలాచలభోధ*
📚. ప్రసాద్ భరద్వాజ
ప్రథమాధ్యాయం - సూత్రము - 35
*🌻. 35. తత్తు విషయత్యాగాత్ సంగత్యాగాత్ చ ॥ - 1 🌻*
ఆ పరాభక్తి సిద్ధించాలంటె మన మనసులలో కదులుతున్న విషయాలను విషయ వాసనలతో సహా వదలి వెయాలి.
జీవితంలో ఎదురయ్యె సంఘటనల వలన ఆశ, మోహం, భయం, క్రోధం వంటివి కలుగరాదు. అనగా ఆ విషయాలతో సంగత్వం చెందరాదు. మేలు చేసిన వారిపై రాగంగాని, కీడుచేసిన వారిపై ద్వేషంగాని, ఊరకే వచ్చే దానిపై ఆశగాని, బాధపెట్టె వారిపై భయక్రోధాలు గాని మనలో కలుగరాదు.
ఇతరులు బాగుపడడం చూస్తే మత్సరం కలుగరాదు. ధనం, కులం, అందం, యౌవనం, తెలివి మొదలైన ప్రత్యేకమైనవి తనకున్నాయని గర్వపడరాదు. అలాగే అవి తనకు తక్కువని నిమ్న భావం కలుగరాదు. ఇట్లా చర్యలు, ప్రతిచర్యలు మనలో కలిగితే అది విషయ సంగత్వమవుతుంది. ఈ విధమైన విషయ సంగత్వాన్ని త్యజించాలి.
మనం వదలవలసినవేమంటే రాగ ద్వేషాలు, అరిషద్వర్దం, ఈర్ష్య అసూయలు, దంభం, దర్పం, అహంకారాలు. నేను, నాది అనే ప్రత్యేక భావం అగుపడరాదు.
స్వార్ధం పనికిరాదు. మనసు పూర్తిగా నిర్విషయం కావాలి. ఆ ఖాళీని
దైవంతో నింపాలి. అలా దైవాన్ని నింపడానికి విషయాలపై విరక్తి, వైరాగ్యాలు పుట్టాలి.
ద్రవ్యత్యాగం చేసేటప్పుడు భగవత్సేవగా శుభ కార్యానికి చేసే దాన
రూపంగా ఉండాలి. మనశ్చుద్ధి కావాలంటే ఇంద్రియ సుఖ భోగాలను త్యజించే వ్రతం వొటించాలి. శాస్త్రవిహిత బ్రహ్మచర్యం అవలంబించాలి. భోగాలను వదలటం వంటి వాటిని కర్మ ఫల త్యాగపద్ధతిగా సత్మర్మాచరణ చెయాలి.
ముందుగా మనసును శుద్ది చెయాలి. “చిత్తశుద్ధి లేని శివపూజ యేలయా?” అని వేమన అన్నాడు.
ఒక ప్రక్కభగవంతుడిని మనలోకి రానిచ్చి ప్రతిష్టించుకుంటూ బాహ్య భక్తి చెస్తూ, చిత్తాన్ని నిర్విషయం చేసే పని కూడా చేస్తూ ఉండాలి. భక్తి పెరుగుతున్న కొలది, తన ఇంద్రియాలను నిగ్రహించి, తిరిగి విషయాల మీదకు పోకుండా చూచుకోవాలి. చివరకు నాగ మహాశయుని మాదిరి కావాలి.
అంతేగాని
“విషయాలను మతికి తోచినట్లు, వెగటు కలిగేదాకా భోగిస్తె బుద్ధి మళ్ళుతుంది, మరలా విషయాల మిదికి మనసు పోదు” అని చెప్పబడే విధానం ప్రమాదకరం. కొందరు తత్త్వవేత్తలు ఈ మాదిరి వాటిని బోధిస్తూ ఆచరింప చేస్తూ వచ్చారు. వాటిని ఏనాడూ సమాజం మెచ్చలేదు. ఇటువంటి ప్రయోగాల జోలికి వెళ్ళరాదు.
అగ్నిలో నేయి వెస్తున్నంతసేపు అగ్ని చల్లారదు అని యయాతి గీత చెప్తున్నది. కోరిక అంకురించగానే దానిని విషతుల్యంగా తెలుసుకుని మొదలుతో సహా అనగా దాని జ్ఞాపకంతో సహా తుడిచి వెయాలి అని వశిష్ణులు శ్రీరామ చంద్రునికి ఉపదేశించారు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Guru Geeta - Datta Vaakya - 26 🌹*
✍️ Sri GS Swami ji Datta Vaakya
📚. Prasad Bharadwaj
*🌹 Guru creates many doubts and temptations in the mind of the disciple. One should withstand and conquer them all. Then Guru showers his boons upon a disciple who fully and firmly believes in him. 🌹*
Lord Siva, angry at Deepaka that he rejected his offer of a boon, vowing to continue to observe his attitude and to continue to subject him to tests, went to Lord Vishnu and remarked to him about the extraordinary and unique level of devotion Deepaka has for his Guru.
“I have been observing him for a while. It would be good if you also take a look at him,” persuaded Lord Siva. Vishnu’s interest was stimulated with these words of praise, and he also wished to see Deepaka.
At once he appeared at where Deepaka was located. He lovingly called out, “Deepaka!” Overwhelmed with joy at the sight of Lord Vishnu, Deepaka prostrated to him reverentially.
Lord Vishnu offered, “Deepaka, your devotion to Guru is indeed commendable. Name your wish. I will grant you the boon.” Deepaka repeated the same words to Lord Vishnu, as he had spoken with Lord Siva.
“O Lord, my Guru is sleeping. After he wakes up, I will consult with him and then only express my wish.” Lord Vishnu got very angry and left, unable to do anything else.
Veda Dharma called out, “Deepaka!” Deepaka went to his Guru. Guru asked him, “Who were you conversing with? I have been listening to the noise that was created. It has been disturbing my sleep. Who were you chitchatting with?”
Deepaka explained in detail the visits of Lord Siva and Lord Vishnu, and their offers of boons.
Guru asked, “What did you say to them?”
“I told them that until I consulted with you, I would not express any wish. “Why did you say that? Why did you not ask for any personal favor?”
Deepaka responded devoutly with closed eyes, “O Guru, you are my Siva. You are my Vishnu. I desire only the boons granted by you. Whatever you bless me with is the greatest boon for me.”
When he opened his eyes, Veda Dharma’s leprosy had completely vanished. His body glowed in perfect health.
He looked at Deepaka and exclaimed with compassion and showered his blessings, “Your faith in Guru is exemplary. That is why you were blessed with the darshan of Lord Siva and Lord Vishnu.
Whoever remembers you with reverence will be freed from difficulties. Their prosperity will increase.
Their faith in Guru will strengthen. You remain right here in Kasi. By my grace you will acquire all spiritual accomplishments (Siddhis) and you will become proficient in all branches of knowledge.
All the celestial energies (Siddha Ganas) will follow your command.” Deepaka received immeasurable grace. It is said that there is a temple built in Kasi in honor of Deepaka.
This shows how generously Guru showers his boons upon a disciple who fully and firmly believes in him. Guru administers many tests. He creates many doubts and temptations in the mind of the disciple. One should withstand and conquer them all.
Deepaka was intelligent. He could have asked Lord Siva for any boon or a boon such as, “Cure my Guru’s disease.” Or, he could have asked Lord Vishnu, “Free my Guru of his affliction.” He did neither of those. He was adamant that no one other than his Guru could grant him any boon.
Deepaka acknowledged the greatness of the two Lords and knew that they were gods of gods. Yet, he firmly believed that he would accept only the boons granted to him by his Guru and no one else.
He knew that even for his Guru they were gods. Still, they were not his gods. For Deepaka, his Guru alone was God. He would not receive any reward from any other god.
We have seen until now, how Deepaka declared his firm faith in Guru by rejecting boons from anyone else other than his Guru.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శివగీత - 24 / The Siva-Gita - 24 🌹*
*🌴. పరమేశ్వరుడు - శ్రీరాముడు మధ్య జరిగిన జ్ఞాన సంవాదము. 🌴*
📚. ప్రసాద్ భరద్వాజ
తృతీయాధ్యాయము
*🌻. విరజాదీక్షా లక్షణ యోగము - 8 🌻*
వేద సారా భిదం నిత్య - శివ ప్రత్యక్ష కారకమ్,
ఉక్తంచ తేన రామ ! త్వం - జప నిత్యం ది వానిశమ్ 33
తతః ప్రసన్నో భగవా - న్మహా పాశు పతాస్త్రకమ్,
తుభ్యం దాస్యతి తేన త్వం - శత్రూన్హ త్వాప్స్యసి ప్రియమ్ 34
తస్త్యై వాస్త్రస్య మాహాత్మ్యా - త్సముద్రం వో షయిష్యసి,
సంహార కాలే జగతా - మస్త్రం తత్పా ర్వతీ పతే: 35
తద లాభే దాన వానాం- జయస్తవ సుదుర్లభః,
తస్మా ల్లబ్దుం తదే వాస్త్రం - శరణం యాహి శంకరమ్, 36
ఇతి శ్రీ పద్మ పురాణే శివ గీతాయాం తృతీయో ధ్యాయః
మరియు నా ముని పుంగవుండిట్లు చెప్పు చుండెను.
ఓ రామా! నీవు నాచేత బోధింప బడిన వేద సార శివ సహస్ర నామంబులను అనన్య భక్తితో నిశ్చల మనస్సుతో రేయింబవళ్ళు పటింపుము.
దానితో ( తత్ఫలితముగ ) శివుడు ప్రసన్నుడై ప్రత్యక్షమై నీకు పాశు పతాస్త్రమును ప్రసాదించును.
నీవా అస్త్రము వలన శత్రువులను హత మొనర్చి నీ ప్రీతికి పాత్రు రాలైన భార్యను పొందగలవు .
ఆ మహాస్త్రము బలము చేతనే విశాలము మరియు గంభీరమునైన సాగరమును కూడా శుష్కింప చేయగలవు. ప్రళయ కాలములోనే మహాస్త్రము పరమ శివునకు (పార్వతి పతికి ) ప్రధాన మైనదిగా నున్నదో అటువంటి మహాస్త్రము నీకు లభ్యము గానిచో నీవు రాక్షసులను జయింప లేవు.
ఆ కారణము చేత ఆ మహిమాన్విత అస్త్ర ప్రాప్తికై నీ వనన్య భక్తితో నీశ్వరుని శరణు బొందుము.
ఇది వ్యాసోక్త శ్రీ పద్మ పురాణాంతర్గతమైన శివ గీత యందలి మూడవ అధ్యాయము సమాప్తము .
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 The Siva-Gita - 24 🌹*
*🌴. Dialogue between Rama and Lord Siva 🌴*
✍️ Ayalasomayajula.
📚. Prasad Bharadwaj
Chapter 03 :
*🌻 Viraja Deeksha Lakshana Yoga - 8 🌻*
Moreover that sage spoke the following words:
O Rama! These thousand names of Shiva are summary of vedas (Veda saaransham) and can grant the devotee with the vision of Lord Shiva. You should chant these Vedasaara Shiva Sahasranama day and night with full devotion.
Consequently, Lord Shiva having become pleased with you. would gift you the Pashupatastra weapon.
By possessing that weapon you would become powerful enough for slaying your enemies and can gain your beloved wife back for yourself. With the power of that missile only you can even dry up the limitless ocean.
The weapon which acts as the primary cause behind the dissolution of universes during the end of time, unless that supreme weapon is possessed by you, victory over the demons is not possible.
For that reason in order to gain that supreme weapon, take the refuge of that Eswara.
Here ends the third chapter of Shiva Geeta present in Padma Purana Uttara Khanda.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ గజానన్ మహరాజ్ జీవిత చరిత్ర - 16 / Sri Gajanan Maharaj Life History - 16 🌹*
✍️. దాసగణు స్వామి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌻. 4వ అధ్యాయము - 1 🌻*
శ్రీగణేశాయనమ ! ఓసర్వశక్తివంతా, అతిశక్తివంతమైన భగవంతుడా, నీలకంఠా, గంగాధరా, మహాకాళ, త్రయంబకేశ్వరా, శ్రీఓంకారా మీరు సాక్షాత్కారం ఇవ్వండి. మీరు, విష్ణువు జలము. జలచరము వంటివారు. ఎవరి ఇష్టప్రకారం వారు మిమ్మలను ఆరూపంలో పూజిస్తూ ఉంటారు. త్రికరణశుద్ధితో మిమ్మల్ని ప్రేమించినవారికి పిల్లలకు తల్లిప్రేమదొరికినట్టు మీఆప్యాయత పొందుతారు.
నేను కల్మషంలేని, తప్పులేని, మీప్రేమను యాచిస్తున్న పిల్లవాడిని. నీవు అతిశక్తి వంతుడివి, కల్పతరువువి. నాకోరికలను దయతోనెరవేర్చు. స్వామిగజానన్, బనకటలాల్ ఇంటిలో ఉంటున్నారు. వైశాఖ శుద్ధ తదియ నాడు కుండడు నీళ్ళతో పితృదేవతలకు తర్పణం అర్పిస్తారు. దీనిని అక్షయతిదియ అని విదర్భ ప్రదేశంలో పెద్దఎత్తున సంబరాలు చేసుకుంటారు.
తన ప్రాకృతికమయిన శక్తులను చూపించేందుకు ఆరోజు శ్రీమహారాజు కొంతమంది పిల్లవాళ్ళతో కూర్చుని ఉన్నారు. ఆ పిల్లలతో తన పొగత్రాగడానికి పొగాకు గొట్టంలోనింపి అంటించమని ఆయన చెప్పారు. పిల్లలు పొగగొట్టం తయారు చేసి నిప్పు కోసం వెతకడంమొదలు పెట్టారు. కానీవారికి అదిదొరకలేదు.
జానకిరాం అనే కంసాలి దగ్గరకు వెళ్ళవలసిందిగా బనకటలాల్ ఆపిల్లలకు సలహా ఇస్తాడు, ఎందుకంటే ఈకంసాలులు ఉదయాన్నే వేరేపని ప్రారంభించే ముందు నిప్పు అంటించుకున్న తరువాత మిగిలిన కార్యక్రమాలుచేస్తారు. ఆపిల్లలు వెళ్ళి జానకిరాంను చిన్ననిప్పు కణిక శ్రీమహారాజు చిలిం కోసం ఇవ్వవలసిందిగా అడుగుతారు.
జనాకిరాం కోపం తెచ్చుకొని, నేను ఎవరికీ అక్షయతిదియ రోజున నిప్పు ఇవ్వడానికి ఇష్టపడను అని నిరాకరిస్తాడు. ఈనిప్పు దేవాది దేవుడయిన శ్రీగజానన్ కు కావాలి. కనుక ఆవిధమయిన మూఢనమ్మకాలు వదలమని ఆపిల్లలు అంటారు.
అయినా వారి నివేదన తిరస్కరిస్తూ, శ్రీగజానన్ను నేను యోగిగా స్వీకరించను, అతనికి ఒక జాతిలేదు, ఎవరిచేతి తిండి అయినా తింటారు, పొగాకు / గంజాయి త్రాగుతారు, నగ్నంగా ఉంటారు, మురికినీళ్ళు తాగుతారు మరియు పిచ్చివాడిగా ప్రవర్తిస్తారు.
ఆయన వెనకపడడానికి బనకటలాల్ మూర్ఖుడు. ఆయన చిలిం కోసంనేను నిప్పు ఇవ్వను. నిజంగా యోగి అయితే, తనే స్వయంగా తన సహజ శత్తితో యోగి జలంధర్ లాగా నిప్పు పుట్టించాలి, కాబట్టి వెళ్ళిపొండి అని జానకిరాం అపిల్లలతో అంటాడు..
నిరాశ చెందిన పిల్లలు బనకటలాల్ ఇంటికి వచ్చి శ్రీమహారాజుకు అన్ని విషయాలు చెపుతారు. శ్రీగజానన్ మహారాజు దానికి మందహాసంచేసి, ఒక అగ్గిపుల్లను అంటించకుండా తన పొగగొట్టం దగ్గర పట్టుకు ఉండమని బనకటలాల్ను అంటారు.
బనాకటలాల్ అదేవిధంగా చేస్తాడు, ఆశ్చర్యకరంగా ఆ అగ్గిపుల్ల దానిఅంతట అదే ఆ పొగగొట్టంమీద అంటుకుంటుంది. శ్రీగజానన్ మహారాజు ప్రాకృతికశక్తి అటువంటిది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Gajanan Maharaj Life History - 16 🌹*
✍️. Swamy Dasaganu
📚. Prasad Bharadwaj
*🌻 Chapter 4 - part 1 🌻*
Shri Ganeshayanamah! O Almighty, All Powerful God! Nilkantha, Gangadhara, Mahakal Trimbakeshwara, Shri Omkara manifest Yourself to me. You and Vishnu are One and the same as water is to aqua.
People worship either of Your forms as per their liking. One who sincerely loves You, gets Your affection as a child gets from his mother. I am an innocent child craving for Your love; You are all powerful, a Kalpataru. Kindly fulfil all my desires.
Swami Gajanan was staying at the house of Bankatlal when the following incident occurred. On the third of Vaisakh Shudha day, people offer an earthen pitcher full of water to their dead forefathers.
In Vidarbha, this day is known as Akshaya Tritiya and is celebrated on a large scale. On this day, Shri Gajanan Maharaj was sitting with some boys, probably to reveal some of His super natural power.
He told the boys to fill up His pipe with tobacco and light it for smoking. The boys prepared the pipe and started searching for fire. They could not find it anywhere.
So Bankatlal adviced them to go to Jankiram, the Goldsmith, to ask him to ignite the pipe for Maharaj, as all goldsmiths first ignite fire in the morning to start off with their business and then attend to other works.
The children then went to Jankiram and asked him for an ignited piece of coal for the pipe of Shri Gajanan Maharaj. Jankiram got angry and refused to oblige to the children’s request saying that he did not like giving fire to any body on Akshaya Tritiya day.
The boys told him not to be superstitious as the fire was required for the pipe of Shri Gajanan Maharaj, the God of Gods. Jankiram turned down their request and said, I don't accept Shri Gajanan as a saint. He has no caste, eats from anybody's hand, smokes tobacco and Ganja, remains naked, drinks sewage water and behaves like a mad man.
Bankatlal is a fool to go after Him. I will not give fire for His pipe. If He is really a Saint, He should be able to create fire by His super natural powers as was done by Saint Jalander. So get out.
The boys, disappointed went back to Bankatlal's house and narrated everything to Shri Gajanan Maharaj . Shri Gajanan Maharaj smiled and took the pipe in His hand and asked Bankatlal to hold one matchstick, without igniting it, on the pipe.
Bankatlal did it and was surprised to see the match stick igniting itself on the pipe! Such was the supernatural power of Shri Gajanan Maharaj! Now listen to what happened to Jankiram by this incident.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. సౌందర్య లహరి - 66 / Soundarya Lahari - 66 🌹*
📚. ప్రసాద్ భరద్వాజ
66 వ శ్లోకము
*🌴. సంగీత వాయిద్యాల యందు ప్రావీణ్యత, గాత్ర మధురిమకు, రోగముల నివారణకు 🌴*
శ్లో: 66. విషఞ్చ్యా గాయన్తీ వివిధమపదానం పశుపతే స్త్వయారబ్ధే వక్తుం చలితశిరసా సాధువచనే
త్వదీయైర్మాధుర్యైరపలపిత తన్త్రీకలరవాం నిజాం వీణాం వాణీ నిచుళయతి చోళేన నిభృతమ్ ll
🌻. తాత్పర్యం :
అమ్మా! సరస్వతీదేవి నీ ఎదుట పరమ శివుని విజయగాధలు వీణతో పాడుచు ఉండగా, అప్పుడు నీవు నీ మనస్సునందు కలిగిన సంతోషమును తెలుపుచూ శిరస్సును కదుపుతూ ప్రశంసా వాక్యములు పలుకుట మొదలు పెట్టగానే, ఆ వాక్యములందలి మాధుర్యము నకు, తన యొక్క వీణా తంత్రము కలవరము చెందినదయి తన యొక్క వీణను చీర చెంగుతో కప్పివేసెను .కదా !
🌻. జప విధానం - నైవేద్యం:-
ఈ శ్లోకమును 1000 సార్లు ప్రతి రోజు 45 రోజులు జపం చేస్తూ, తేనె, క్షీరాన్నము నివేదించినచో సంగీత వాయిద్యాల యందు ప్రావీణ్యత, గాత్రము యందు మధురిమ, రోగముల నివారణ లభించును అని చెప్పబడింది.
*🌹 SOUNDARYA LAHARI - 66 🌹*
📚 Prasad Bharadwaj
Sloka - 66 🌹
*🌴 Sweet Words and Mastery in Music 🌴*
66. Vipanchya gayanthi vividham apadhanam Pasupathea Thvay'arabdhe vakthum chalita-sirasa sadhuvachane; Tadhiyair madhuryair apalapitha-tantri-kala-ravam Nijaam vinam vani nichulayati cholena nibhrutham.
🌻 Translation :
Oh mother of all, when you start nodding your head, muttering sweetly, good, good, to the goddess Saraswathi,when she sings the great stories to you, of Pasupathi our lord, with the accompaniment of her veena,she mutes the veena by the covering cloth, so that the strings throwing sweetest music, are not put to shame, by your voice full of sweetness.
🌻 Chanting procedure and Nivedyam (offerings to the Lord) :
If one chants this verse 1000 times a day for 45 days, offering as milk payasam, honey as prasadam, it is believed that they will be achieve mastery in music and musical instruments and free from diseases
🌻 BENEFICIAL RESULTS:
Cure of minor ailments, gets skill in vocal and instrumental music.
🌻 Literal Results:
The last two verses "Thadeeyairmaadhuryai.....Nibhrutham" are not suitable for veena aspirants. Excellent sloka for vocalists. Also induces sweet speech.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🌹. శ్రీమద్భగవద్గీత - 365 / Bhagavad-Gita - 365 🌹
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 10వ అధ్యాయము - భగవద్విభూతియోగం - 14 🌴
14. సర్వమేతదృతం మన్యే యన్మాం వదసి కేశవ |
న హి తే భగవన్ వ్యక్తిం విదుర్దేవా న దానవా: ||
🌷. తాత్పర్యం :
ఓ కృష్ణా! నీవు నాకు తెలిపినదంతయు సత్యమని సంపూర్ణముగా నేను ఆంగీకరించుచున్నాను. ఓ దేవదేవా! దేవతలుగాని, దానవులుగాని నీ స్వరూపమును ఎరుగజాలరు.
🌷. భాష్యము :
శ్రద్ధలేనివారు, దానవప్రవృత్తిగలవారు శ్రీకృష్ణభగవానుని ఎరుగజాలరని అర్జునుడు ఇచ్చట ధ్రువపరచుచున్నాడు.
అతడు దేవతలకే తెలియబడుటలేదన్నచో ఆధునికజగత్తుకు చెందిన నామమాత్ర పండితులను గూర్చి వేరుగా తెలుపనవసరము లేదు. కాని అర్జునుడు ఇచ్చట కృష్ణని కరుణ వలన అతనిని పరతత్త్వముగను, పరిపూర్ణునిగను తెలిసికొనగలిగెను.
భగవద్గీతకు ప్రామాణికుడైన అట్టి అర్జునుని మార్గమునే ప్రతియొక్కరు అనుసరింపవలెను. చతుర్ధాధ్యాయమున తెలుపబడినట్లు గీతాధ్యాయనము కొరకు వలసిన పరంపర నశించియుండుటచే ఆ పరంపరను శ్రీకృష్ణభగవానుడు తిరిగి అర్జునునితో ప్రారంభించెను.
అర్జునుని సన్నిహిత స్నేహితుడనియు మరియు భక్తుడనియు ఆ దేవదేవుడు భావించుటయే అందులకు కారణము. కనుక ఈ గీతోపనిషత్తు యొక్క ఉపోద్ఘాతమున తెలుపబడినట్లు భగవద్గీతను పరంపరారూపముననే అవగతము చేసికొనవలెను.
అట్టి పరంపర నశించియుండుట చేతనే దానిని పునరుద్ధరించుటకు అర్జునుడు ఎన్నుకోబడెను. శ్రీకృష్ణుడు పలికిన సర్వమును అర్జునుడు అంగీకరించిన విధమును తప్పక అనుసరింపవలెను.
అప్పుడే భగవద్గీత సారము మనకు అవగతము కాగలదు. ఆ పిదపనే శ్రీకృష్ణుడు దేవదేవుడని మనము సంపూర్ణముగా అవగాహనము చేసికొనగలము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 365 🌹
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj
🌴 Chapter 10 - Vibhuti Yoga - 14 🌴
14. sarvam etad ṛtaṁ manye
yan māṁ vadasi keśava
na hi te bhagavan vyaktiṁ
vidur devā na dānavāḥ
🌷 Translation :
O Kṛṣṇa, I totally accept as truth all that You have told me. Neither the demigods nor the demons, O Lord, can understand Your personality.
🌹 Purport :
Arjuna herein confirms that persons of faithless and demonic nature cannot understand Kṛṣṇa. He is not known even by the demigods, so what to speak of the so-called scholars of this modern world?
By the grace of the Supreme Lord, Arjuna has understood that the Supreme Truth is Kṛṣṇa and that He is the perfect one. One should therefore follow the path of Arjuna. He received the authority of Bhagavad-gītā.
As described in the Fourth Chapter, the paramparā system of disciplic succession for the understanding of Bhagavad-gītā was lost, and therefore Kṛṣṇa reestablished that disciplic succession with Arjuna because He considered Arjuna His intimate friend and a great devotee.
Therefore, as stated in our Introduction to Gītopaniṣad, Bhagavad-gītā should be understood in the paramparā system. When the paramparā system was lost, Arjuna was selected to rejuvenate it.
The acceptance by Arjuna of all that Kṛṣṇa says should be emulated; then we can understand the essence of Bhagavad-gītā, and then only can we understand that Kṛṣṇa is the Supreme Personality of Godhead.
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment