దేవాపి మహర్షి బోధనలు - 14


🌹. దేవాపి మహర్షి బోధనలు - 14 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 6. గోపాల మంత్రము - 1 🌻


సర్వతః సామరస్యము, వైభవము, విజయము కలిగించు తత్వమును గోపాలతత్వము అందురు. ఈ తత్వము యొక్క నివాస స్థానము బృందావన మందురు.

బృందావనమనగా అనేక విధములైన సూర్య చంద్రాత్మక వలయమలు పరిరక్షింపబడు దేశము. ఇందలి సూర్యాత్మక ప్రజ్ఞను బృహస్పతి తత్వము, చంద్రాత్మక ప్రజ్ఞను శుక్రతత్వము పరిరక్షించుచుండును.

'గో' అను శబ్దము విజయము చెందిన జీవాత్మ యొక్క స్థితి, జీవాత్మ విజయము చెందుటయనగా తాను అక్షరుడ ననియు, శాశ్వతుడుననియు తెలుసుకొనుట. గోశబ్దము నందు రెండు శబ్దములు ఇమిడి యున్నవి. అవి గ, ఓ. 'గ' శబ్దము బృహస్పతి తత్త్వమునకు సంబంధించినది.

'ఓ' శబ్దము సూర్యతత్త్వమునకు సంబంధించినది. సూర్యతత్త్వము ఆత్మతత్త్వమే. దానితో బృహస్పతి తత్త్వము చేరినప్పుడు ఆత్మతత్త్వము వికాసము చెంది అపరిమిత మొందును. ఇదియే జీవుని విజయము.

'పా' అను అక్షరము పానము చేయుట, పరిరక్షింపబడుట అను భావములకు సంకేతము. తాను పరిరక్షింపబడి అమృత తత్త్వమును పానము చేయుట 'పా' అనుశబ్దము సంకేతించుచున్నది.

'పా' శబ్దమునకు శుక్రతత్త్వము జ్యోతిషమున సంకేతింపబడినది. శుక్రుడు అమృతత్త్వ విద్యకు అధిపతి గదా!

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


27 Jan 2021

No comments:

Post a Comment