శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 191 / Sri Lalitha Chaitanya Vijnanam - 191


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 191 / Sri Lalitha Chaitanya Vijnanam - 191 🌹
సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము :

నిస్తులా, నీలచికురా, నిరపాయా, నిరత్యయా |
దుర్లభా, దుర్గమా, దుర్గా, దుఃఖహంత్రీ, సుఖప్రదా ‖ 50 ‖



🌻 191. 'దుఃఖహంత్రీ' 🌻

దుఃఖములను అంతము చేయునది శ్రీమాత అని అర్థము.

సర్వదుఃఖములకు కారణము అజ్ఞానమే. జీవులు దురహంకారు లగుటచే వారు సత్వగుణము నాశ్రయించి గుణాతీత స్థితితో అను సంధానము చెందువరకూ దుఃఖములు తప్పవు. రజోగుణ దోషము వలన, ఇచ్ఛ పరిమితి దాటుటచే రజస్సు, తమస్సులు విజృంభించును.

రజస్సునకు రావణుడు, తమస్సునకు కుంభకర్ణుడు ఉదాహరణములు. సత్వాధీనమున లేని రజస్సు, తమస్సులు, జీవులను అసుర (అజ్ఞాన) మార్గములందు చరింపజేయును. అట్టివారి చిత్తవృత్తులు వారి వశమున ఉండవు. అనియమిత చిత్తవృత్తి కారణముగ ఇంద్రియములు విజృంభించును.

మనోభావములు చెలరేగి అతిక్రమించి ప్రవర్తించుట జరుగును. ఇట్టి అజ్ఞానమున పడిన జీవులు తమ జీవితమును దుఃఖమయము గావించుకొందురు. వీరికి పరిష్కారమేమి? ఏ కొద్ది పుణ్యఫలముగనో శ్రీమాత ఆరాధనయందు రుచి కలిగినచో ఆమె దారి చూపును.

క్రమముగ ప్రాథమిక విద్యల నందించును. వాని నాచరించుచుండగ జ్ఞానపర విషయములు తెలిసినవారు పరిచయమగుదురు. వారిద్వారా విద్యలను విశదీకరించు కొని ఆచరించుటలో సద్గురువు తారసిల్లును.

ఆ మార్గమున నడచుటలో క్రమముగ దుఃఖకారణములు ఉపశమించును. ఈ లోపున జీవుడు సత్వగుణము నాశ్రయించును. తత్కారణముగ పరహిత కార్యము లొనర్చుటకు ఉత్సహించును. దానములు చేయుటకు స్ఫూర్తి కలుగును. పరహిత యజ్ఞము, దానము అను గుణములు దైవధ్యానమునకు మార్గము చూపి యజ్ఞ దాన తపస్సులతో కూడిన జీవిత మేర్పడును. అపుడు ఇహ పరములయందు శాంతి లభించును.

అట్టి జీవియందు దుఃఖకారణములు పరిపూర్ణముగ నశించును. ఈ విధముగ జీవులను శ్రీమాత దుఃఖములనుండి రక్షించును. తరింపునకు వలసిన తోడ్పాటు గావించును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 191 🌹
1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻 Duḥkhahantrī दुःखहन्त्री (191)🌻

She dispels sorrows of Her devotees. Saṃsāra is the cause for sorrows. Saṃsāa means getting affected by attachments and desires.

That is why Kṛṣṇa says “this is the actual freedom from all miseries arising from material contact” (Bhagavad Gīta VI.23). Saṃsāra is called ‘sāhara’ or ocean.

If one plunges into this ocean, it is difficult to swim across to reach the shore. Saṃsāra should not be confused with one’s family. She dispels the sorrows of those who do not get attached to material world.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹

27 Jan 2021

No comments:

Post a Comment