శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 238 / Sri Lalitha Chaitanya Vijnanam - 238


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 238 / Sri Lalitha Chaitanya Vijnanam - 238 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀. పూర్తి శ్లోకము 

🍀 59. మనువిద్యా, చంద్రవిద్యా, చంద్రమండలమధ్యగా ।
చారురూపా, చారుహాసా, చారుచంద్ర కళాధరా ॥ 59 ॥🍀

🌻238. 'మనువిద్యా' 🌻

మనువిద్యా స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. మనువుల యందు భాసించు విద్య శ్రీదేవియే. సర్వ విద్యలు ఆమె నుండియే భాసించును. ప్రత్యేకముగ మనువిద్యా స్వరూపిణి యనుటలో మనువు ప్రాధాన్యత తెలియనగును. మను తత్త్వము పదునాలుగు విధములుగ, పదునాలుగు మనువులుగ తెలియవలెను. పదునాలుగు మనువుల తత్త్వమే పదునాలుగు తిథులుగ తెలియ వలెను.

పౌర్ణమి పూర్ణ స్థితి; అమావాస్య శూన్య స్థితి. ఈ రెంటి నడుమ పదునాలుగు తిథులున్నవి. పదునాలుగు తిథులకు, పదు నాలుగు మనువులకు, పదునాలుగు మన్వంతరములకు సామ్యము తెలియవలెను. శుక్ల, కృష్ణ పక్షములుగ ఆరోహణ, అవరోహణ క్రమము లున్నవి. ఈ తిథులకు వెలుగు నీడ లున్నవి. ఇందు అష్టమి తిథి ఒక ప్రశస్థమైన తిథి, ఈ తిథి యోగసిద్ధిని కలిగించ గలదు.

ఈ తిథి యందు వెలుగు నీడలు సమభావము పొందును. ఈ తిధి అర్ధనారీశ్వర యోగ తత్త్వమును ప్రకటింపజేయును. శ్రీదుర్గ, శ్రీకృష్ణుడు అష్టమి యందు పుట్టుటలో గల రహస్యార్థ మిదియే. వారియందు వెలుగు నీడలు సమభావము చెందును. జ్ఞానము, అజ్ఞానము, దేవతలు, అసురులు, ఉత్తమము, అథమము, మంచి, చెడు అన్నిటిని వారు తమయందు లయము చేసుకొనగలరు. అందరికిని తగు విధమగు ఉర్దారణము కల్పింపగలరు.

కృష్ణ పక్షమున మొదటి ఏడు తిథులలో వెలుగు పెరుగుచు నుండును. అష్టమి నాటికి వెలుగు, నీడ సమ మగును. ఈ ఏడు తిథులును పౌర్ణమి తరువాతి ఏడు తిథులతో సామ్యము చెందును.

ఈ సామ్యము విలోమానుసారము తెలియవచ్చును. అట్లే శుక్ల పక్షపు నవమి నుండి పౌర్ణమి వఱకు కల ఏడు తిథులు పౌర్ణమి నుండి తరువాత కలుగు ఏడు తిథులలో విలోమానుసారము సామ్యము చెందును.

ఉదాహరణకు శుక్ల చతుర్దశి యందు ఎంత వెలుగు వుండునో కృష్ణ పాడ్యమి నందు అంతే వెలుగు వుండును. బుద్ధి మంతులు దీనిని గ్రహింపగలరు. ఇట్లు సామ్యమును గూర్చినచో ఏడు తిథులే పదునాలుగుగ గోచరించును. అందువలన నిజమునకు మనువు లేడుగురే. మిగిలిన వారిని సావర్ణి మనువు లందురు.

వీని ననుసరించియే వారమునకు దినము లేడుగను, రెండు వారములొక పక్షముగను, రెండు పక్షములొక మాసముగను, నాలుగు పక్షములు ఒక ఋతువుగను, ఆరు పక్షము లొక సంవత్సర పాదముగను, 12 పక్షములు ఒక అయనముగను, 24 పక్షములు ఒక సంవత్సరముగను వర్తించు చున్నది.

మనువిద్యా రహస్యములు అత్యంత గంభీరములు. జీవుల అవతరణము, ఉద్గారణము మన్వంతర కథలుగ వివరింపబడినవి. ఇది ఒక విస్తారమగు విద్య. ప్రతి మాసమునందు మనలను స్పృశించు మను స్పర్శను ప్రథమముగ పొందినచో మనువిద్యా ప్రాథమిక విద్యాలయమున ప్రవేశము కలుగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 238 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🌻 Manu-vidyā मनु-विद्या (238) 🌻

Vidya means Śrī Vidya, the ritual worship of Śrī Cakra. The base of Śrī Vidya worship is Pañcadaśī mantra. There are twelve types of Pañcadaśī mantra introduced by Manu, Kubera (the god of wealth), Chandra (moon), Lopāmudrā (wife of sage Agastya), Agastya, Manmatha (the god of love), Agni (the fire god), Surya (sun), Indra (chief of gods), Skanda (Lord Kārttikeya, son of Śiva and Pārvatī, also known as Subrahmaṇya), Śiva (Her consort) and Durvāsa.

The basic mantra in all the twelve remains the same. In this Sahasranāma all these names are referred and the first of such reference is this nāma. This nāma refers to the worship done by Manu.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2021

No comments:

Post a Comment