✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 40. కర్మ స్వరూపము 🌻
సత్సంకల్పములు కలిగినప్పటికిని అవి కార్యరూపము దాల్చుట అరుదు. కార్యరూపము దాల్చినను పరిపూర్తియగుట ఇంకను అరుదు. దానికి కారణము సంకల్పమున శ్రద్ధ ఒకటికాగ, రెండవది వ్యక్తిగత స్వభావము. వ్యక్తిగత స్వభావమును ఎప్పటికప్పుడు పరిశీలించు కొనుచుండ వలెను. పూర్వకర్మ కారణముగ స్వభావము శుభ, అశుభ మిశ్రమమై యుండును.
శుభ వాసనలను పెంచుకొను చుండుటచే అశుభ వాసనలు బలహీనపడి నశించును. ఇదియే సత్సాధన! కర్మ వ్యక్తిగతమే కాక సామూహికము కూడ. కుటుంబ కర్మ, కులకర్మ, ప్రాంతీయ కర్మ, దేశీయ కర్మ, జాతికర్మ మరియు భౌగోళిక కర్మగా యుండును. అందుచే బద్ధజీవనము కొంత తప్పదు.
కాని సాధకునకు తన వ్యక్తిగత కర్మను సరిచేసుకొనుట ఒక్కటియే కర్తవ్యము. పై విధముగ వ్యక్తిగత కర్మనుండి విముక్తుడు కావలెనన్నచో నిష్కామ కర్మ యోగమే మార్గము. వేరొక మార్గము లేదు. ఈ యోగ మార్గమునకు త్యాగమును జోడించినచో త్వరితగతిని గమ్యమును చేరగలడు. ప్రస్తుత మెప్పుడును కాలగర్భములోనికి కలిసిపోవు చుండును గనుక పై సూత్రముల నాశ్రయించి భవిష్యత్తును తీర్చిదిద్దు కొనుము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
19 Mar 2021
No comments:
Post a Comment