✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. నువ్వు జీవితం పట్ల ప్రేమతో వుంటే జీవితమన్నది నీ సమస్త అస్తిత్వమవుతుంది. 🍀
మతమన్నది యిప్పుడు యదార్ధం కావాలి. జరిగిందేదో జరిగిపోయింది. మనం చాలాకాలం నుంచీ అవాస్తవంతో సహజీవనం చేశాం. జీవితం వాస్తవం, ప్రేమ వాస్తవం. నువ్వు జీవితం పట్ల ప్రేమతో వుంటే జీవితమన్నది నీ సమస్త అస్తిత్వమవుతుంది. జీవితాన్ని ఆరాధించే ఏకైక మార్గం జీవితాన్ని గానం చెయ్యాలి. నాట్యం చెయ్యాలి, వికసింపచేయాలి, సృజనాత్మకం చేయాలి.
ఉత్సవానికి ఏదో కొంత అదనంగా అందించాలి. పండుగకు ఏదయిన పరిమళాల్ని జత చెయ్యాలి. ఈ జీవితమనే ఉత్సవం ఉత్సాహభరితంగా నిరంతరం కొనసాగించాలి. నక్షత్రాలు నాట్యం చేస్తున్నాయి, వృక్షాలు నాట్యం చేస్తున్నాయి. సముద్రం నాట్యం చేస్తోంది.
నా 'సన్యాసులు' సముద్రంలో భాగం కావాలి. వృక్షాలలో, మేఘాలలో, నక్షత్రాల్లో భాగాలు కావాలి. ఇది నా ఆలయం. నేను మరే యితర ఆలయాల్ని నమ్మను. నేను ఎట్లాంటి దేవుణ్ణి విశ్వసించను. ఇది నా అనుభవం. నేను దీన్ని నా వాళ్ళతో పంచుకోవాలనుకుంటున్నాను. సన్యాసిగా వుండడమంటే యిపుడు మీరు ఉత్సవం వేపు సాగడమే. ఇది వసంతానికి ఆహ్వానం. ఇది వసంతానికి ఆరంభం.
🌹 🌹 🌹 🌹 🌹
04 May 2021
No comments:
Post a Comment