వివేక చూడామణి - 69 / Viveka Chudamani - 69


🌹. వివేక చూడామణి - 69 / Viveka Chudamani - 69 🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 9 🍀


246. సూక్ష్మము విస్తారమైన ఈ విశ్వము కేవలము ఊహ మాత్రమే. అది నిజము కాదు. పూర్తిగా ఈ వస్తు ప్రపంచమును తొలగించినపుడు (అందుకు విచక్షణతో కూడిన జ్ఞానము పొందాలి). జీవేశ్వర భేదము తొలగి రెండు ఒక్కటే అను భావము స్థిరపడుతుంది.

247. అందువలన ఈశ్వరుడు, జీవుడు అను మాటలను సందర్భాను సారముగా వర్తింపచేయాలి. అపుడే వాటి భావమును అర్థము చేసుకొనగలము. కేవలము పూర్తిగా తిరస్కరించుట, లేక పూర్తిగా అంగీకరించుట సరికాదు. వాటి నిజమైన స్థితులను సకారణముగా విచారించి తెలుసుకోవాలి.

248, 249. ‘ఇదే ఆ దేవ దత్తుడు’ అనే వాక్యములో రెండింటి ఏకత్వము చెప్పబడింది. అందులోని వేరు భావనలు తొలగింపబడినవి. ఈ వాక్యము ‘అదే నీవు’ అనే వాక్యానికి సరిపోతుంది.

ఇందులో రెండింటి భేదము తొలగిపోయి జీవేశ్వరులు ఒక్కటే అని చెప్పబడినది. రెండింటిని గూర్చిన పూర్తి అవగాహన, చిత్ అనేది పరమాత్మకు చెందిన జ్ఞానమని తెలియబడుతుంది. ఈ విధముగా వందల కొలది గ్రంధములలో జీవ బ్రహ్మల ఏకత్వమును గూర్చి చెప్పబడినది.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 69 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 19. Brahman - 9 🌻


246. Neither this gross nor this subtle universe (is the Atman). Being imagined, they are not real – like the snake seen in the rope, and like dreams. Perfectly eliminating the objective world in this way by means of reasoning, one should next realise the oneness that underlies Ishwara and the Jiva.

247. Hence those two terms (Ishwara and Jiva) must be carefully considered through their implied meanings, so that their absolute identity may be established. Neither the method of total rejection nor that of complete retention will do. One must reason out through the process which combines the two.

248-249. Just as in the sentence, "This is that Devadatta", the identity is spoken of, eliminating the contradictory portions, so in the sentence "Thou art That", the wise man must give up the contradictory elements on both sides and recognise the identity of Ishwara and Jiva, noticing carefully the essence of both, which is Chit, Knowledge Absolute. Thus hundreds of scriptural texts inculcate the oneness and identity of Brahman and Jiva.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


04 May 2021

No comments:

Post a Comment