శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 265 / Sri Lalitha Chaitanya Vijnanam - 265


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 265 / Sri Lalitha Chaitanya Vijnanam - 265 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 63. సుప్తా, ప్రాజ్ఞాత్మికా, తుర్యా, సర్వావస్థా వివర్జితా ।
సృష్టికర్త్రీ, బ్రహ్మరూపా, గోప్త్రీ, గోవిందరూపిణీ ॥ 63 ॥ 🍀

🌻265. 'బ్రహ్మరూపా'🌻


బ్రహ్మ రూపమున వెలుగొందునది శ్రీమాత అని అర్థము. సృష్టి అంతయూ చతుర్ముఖ బ్రహ్మ నుండియే వెలువడును. అతడు గోచరించు సృష్టికర్త. నిజమునకు శ్రీమాతయే అతని రూపముగ వెలసి అతని యందు తానే సృష్టి నిర్మాణ చైతన్యముగ నిలచి, సృష్టి గావించుచున్నది.

బ్రహ్మ విష్ణు రుద్రులు అను రూపములు ఆమె తన వాహికలుగ నేర్పరచుకున్న రూపములు. ఆయా రూపముల నేర్పరచి వాని నుండి తానే కర్తవ్యమును నిర్వర్తించును. చతుర్ముఖ

బ్రహ్మచతుర్వ్యూహములను నిర్మించును. చతుర్వ్యూహములలోనికి పరదేవతయైన శ్రీమాత వాసుదేవ సంకర్షణ వ్యూహములుగ దిగి వచ్చును.

నాలుగు వ్యూహములు, నాలుగు వేదములు, నాలుగు విధములుగ వాక్కు నాలుగు పాదములుగ ధర్మము, నాలుగు సంస్కారములుగ వర్ణములు, నాలుగు ఆశ్రమములు, నాలుగు యుగములు, నలుగురు కుమారులుగ చతుర్ముఖ బ్రహ్మ నుండి శ్రీదేవియే సృష్టి నిర్మాణము గావించుచున్నది.

ఈ నాలుగే మూడు గుంపులుగను, ఆరు గుంపులుగను, పది గుంపులుగను ఏర్పడును. ఇది యొక ప్రత్యేక సృష్టి జ్ఞానము.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 265 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🌻Brahma-rūpā ब्रह्म-रूपा (265) 🌻


She is in the form of the God of creation Brahma. Brahma has four heads. The four heads could mean the components of antaḥkaraṇa mind, intellect, consciousness and ego. Without these four, creation is not possible. There are many stories about Brahma’s four heads. He had five heads, possibly meaning the five elements or five prāṇa-s (prāṇa, apāna, vyāna, samāna and udāna) that are needed for creation.

The fifth head was cut off by Śiva for having shown disrespect to Him. There is yet another story, which says that Brahma had split his body horizontally into two, a male and a female form (different from ardhanārīśvara form of Śiva where Śiva’s body is dissevered vertically, the other half occupied by Śaktī). Brahma is said to be the great-grandfather, Viṣṇu the grandfather and Śiva the father of this universe.

(Further reading on the process of creation (in brief): The soul, which is also known as puruṣa can manifest only if interacts with prakṛti, which is also known as Nature, the creative self-unfoldment. When the soul gets associated with prakṛti, the latter unfolds first into subtle non-materialistic form and later into gross form. When gross form is formed, it gives rise to three types of bodies called gross (sthūla), subtle (sūkṣma) and cause (kāraṇa). Gross is the outer body, subtle and cause are the inner bodies.

Until a soul is liberated, subtle and cause bodies continue their association with the soul. Only the gross body is perishable. The imperceptible impressions of many lives become embedded in these bodies, thereby causing predominance of certain qualities in the mind in each rebirth. They are the seeds of karmas that are embedded in a soul.}

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2021

No comments:

Post a Comment