వివేక చూడామణి - 74 / Viveka Chudamani - 74


🌹. వివేక చూడామణి - 74 / Viveka Chudamani - 74🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 19. బ్రహ్మము - 14 🍀


261. ద్వంద్వాలకు అతీతమైనది ఏదో, ఏది శాశ్వతమో, ఏది నాశనం కాదో, విశ్వానికన్నా ప్రత్యేకమైనది, మాయ కానిది అయిన అత్యున్నతమైన, శాశ్వతమైన అంతము లేని ఆనందాన్ని ఏది ఇస్తుందో, కళంకము లేనిదేదో అదే నీవు. అట్టి బ్రహ్మమును నీవు నీ మనస్సులో ధ్యానించుము.

262. మాయ వలన సత్యమైన, ఏకమైన బ్రహ్మము అనేకముగా కనిపిస్తూ, వేరువేరు పేర్లతో, ఆకారములతో, భావనలతో, మార్పులతో ఉంటుందో అది నిజానికి మార్పు లేనిది. ఎలానంటే బంగారము వివిధ వస్తువులుగా మారు నప్పటికి అది బంగారమే. అట్టి బ్రహ్మానివే నీవు. నీవు నీ మనస్సుతో ఆ బ్రహ్మాన్ని ధ్యానించుము.

263. అది కాక వేరేమి లేదో, అది మాయకు అతీతముగా ప్రకాశిస్తూ, మాయ యొక్క ప్రభావమునకు లోనుకాదో, అన్నింటికి ఆత్మ అయినదేదో అది అన్ని మార్పులకు అతీతమై నిజమైన ఆత్మగా జ్ఞానానుభవంతో బ్రహ్మానంద స్థితిలో శాశ్వతమైన మార్పులేని బ్రహ్మానివే నీవు. అట్టి నీవు నీ మనస్సులో బ్రహ్మాన్ని ధ్యానింపుము.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 74 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 19. Brahman - 14 🌻


261. That which is free from duality; which is infinite and indestructible; distinct from the universe and Maya, supreme, eternal; which is undying Bliss; taintless – that Brahman art thou, meditate on this in thy mind.

262. That Reality which (though One) appears variously owing to delusion, taking on names and forms, attributes and changes, Itself always unchanged, like gold in its modifications – that Brahman art thou, meditate on this in thy mind.

263. That beyond which there is nothing; which shines even above Maya, which again is superior to its effect, the universe; the inmost Self of all, free from differentiation; the Real Self, the Existence-Knowledge-Bliss Absolute; infinite and immutable – that Brahman art thou, meditate on this in thy mind.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


15 May 2021

No comments:

Post a Comment