నిర్మల ధ్యానాలు - ఓషో - 36


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 36 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఆమోదం తెలిపే హృదయంతో దైవాన్ని సమీపించేది ప్రార్ధన. అది అస్తిత్వానికి దగ్గరి దారి 🍀


ప్రార్ధన అంటే దేవుణ్ణి కీర్తించేది. సందేహం, విమర్శ, వ్యతిరేకత లేని హృదయంతో, ఆమోదం తెలిపే హృదయంతో దైవాన్ని సమీపించేది ప్రార్ధన. ఈ అనంత సౌందర్యానికి ఆశ్చర్యంతో హృదయం చేసే నాట్యం పాడే పాట ప్రార్థన.

ఈ ప్రపంచం దైవం మనకిచ్చిన అపూర్వమయిన బహుమానం. దానికి మనం అర్హులం కాము. దానికి మనం ప్రతిఫలం యివ్వలేం. ఫలితంగా మనం చెయ్యగలిగిందల్లా ప్రార్థన. అపుడు ప్రతిదీ సాధ్యమే. అపుడు అసాధ్యం కూడా సాధ్యమే. కాబట్టి ప్రార్థన మార్గంగా వుడనీ. వీలయినన్ని మార్గాల్లో కీర్తించు. ఎట్లాంటి ఆరోపణలూ చెయ్యకు. ఎప్పుడూ ఆరోపణలు చేసే మనసును వదిలి పెట్టు.

ఇక్కడ నిర్ణయమన్నది ప్రాముఖ్యం వహిస్తుంది. ఆరోపించే పాత అలవాటును వదులుకుంటే సమస్త శక్తి ప్రార్థన గుండా సాగుతుంది. ప్రార్థన ఆశీర్వాదాల్ని తెస్తుంది. వీలయినన్ని మార్గాల్లో ప్రార్థించు. సూర్యోదయాన్ని ప్రార్థించు, మేఘాల్ని ప్రార్థించు, వృక్షాన్ని ప్రార్థించు, సూర్యాస్తమయాన్ని ప్రార్థించు, పక్షుల్ని, ప్రజల్ని ప్రార్థించు.

ప్రార్థనలో సంకుచితంగా వుండకు, లోభిగా వుండకు. హృదయపూర్వకంగా ప్రార్థించు. వీలయినంత సమగ్రంగా వుండు. అపుడు అస్తిత్వానికి మరింత, మరింత సన్నిహితంగా వెళతావు. అది వంతెనలా మారుతుంది. అది అస్తిత్వానికి దగ్గరి దారి. ధ్యానమన్నది దూరమయిన దారి. ప్రార్థన అన్నది దగ్గరి దారి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jun 2021

No comments:

Post a Comment