శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 283 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 283 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 283 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 283 - 1 🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 66. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళిః ।
సహస్రశీర్షవదనా, సహస్రాక్షీ, సహస్రపాత్ ॥ 66 ॥ 🍀

🌻 283. 'సహస్రాక్షీ' - 1 🌻


వెయ్యి కన్నులు కలది శ్రీమాత అని అర్ధము. అక్ష మనగా కేంద్రమునుండి పరిధికి చేరు రేఖ. వేయి అక్షములుగ కేంద్రము నుండి పరిధికి వ్యాపించునది అని అర్థము. కేంద్రము నుండి పరిధికి 360 కోణములు కలవు. మూడు లోకముల యందు కేంద్రమునుండి పరిధికి వ్యాపించునది శ్రీమాత అని అర్థము.

ప్రధానముగ ప్రతిబింబించు మూడు లోకములు ముందు నామమున తెలుపబడినవి. ఈ లోకము లన్నియూ ఏర్పరచుటకు శ్రీమాత తానే కేంద్రము నుండి పరిధికి వ్యాపించినది. సృష్టియందు ఏ వస్తువున కైనను అణువున కైననూ కేంద్రము శుద్ధ చైతన్యము. ఆ చైతన్య మాధారముగనే ఆయా అణువులు, అణువుల సముదాయములు రూపము గట్టుకొను చుండును. కేంద్రమాధారముగ త్రిగుణ మేర్పడి, త్రిగుణ స్వభావము ననుసరించి రూపమేర్పడుచు నుండును.

పరమాణువు నుండి బ్రహ్మాండము వఱకు ఇట్లే వ్యాప్తి చెందుచూ రూపములు కట్టుకొనుచుండును. పరమాణువు, పరాశక్తి పరమశివుని సమ్మేళనము. అటు నుండి వ్యాపించిన దంతయు త్రిగుణాత్మకమగు శక్తి చైతన్యమే. వ్యాపించిన సమస్తము నందు పరమ శివతత్త్వము నివాసముండును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 283 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 unmeṣa-nimiṣotpanna-vipanna-bhuvanāvalī |
sahasra-śīrṣavadanā sahasrākṣī sahasrapāt || 66 || 🍀

🌻 Sahasrākṣī सहस्राक्षी (283)🌻

She has thousands of eyes. Viṣṇu Sahasranāma 226 also conveys the same meaning.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


26 Jun 2021

No comments:

Post a Comment