మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 46
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 46 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మజ్ఞానము - యోగాభ్యాసము (కపిల మహర్షి బోధనలు) 🌻
ఈశ్వరుడు జీవుని రూపమునను, తన చుట్టునున్న జీవుల రూపమునను ప్రవేశించి యుండును.
జీవుని స్వరూపమున ఈశ్వరుడే ఉండును గనుక తనలో గాని, ఇతరులలో గాని ఈశ్వరుని దర్శించు సంకల్పము స్వరూప జ్ఞానమును కలిగించును.
( నాటకమున రాక్షసుని వేషము ధరించి ఒకడు అద్దములో చూచుకొని హఠాత్తుగా ఉలిక్కి పడును. నిదానించి నవ్వుకొనును. అట్లే జీవుడు నిదానించి ఆత్మజ్ఞానము పొందును. అద్దములో రాక్షసుని చూచునది క్షణకాలము, మరల స్వరూపము గ్రహించినది స్థిరమైన కాలము. )
అట్లే జీవుడు తనలో గాని, ఎదుటివారిలో గాని వ్యక్తులను చూచుట తాత్కాలికము. దైవమును చూచుట నిత్యము.
సాటివారిని దైవ విగ్రహములుగా ధ్యానించుట శీఘ్రముగా ఆత్మజ్ఞానమును కలిగించును. ఈ ప్రయత్నమున యోగాభ్యాసము చేసినను , భక్తి మార్గమున ఉపాసించినను పరమాత్మను పొందును.
🌹 🌹 🌹 🌹 🌹
27 Jun 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment