మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 47


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 47 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : పద్మావతి దేవి
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. స్థితి భేదము - కర్మబంధము (కుబేరుని బోధలు) 🌻


ఒకే పాత్ర యందు పోసిన జలమొకటిగనే యుండును. రెండు జలములుండుట సాధ్యము కాదు. కాని ఆ జలమే మంచుగడ్డలుగా కట్టినపుడు ఒకే పాత్రయందు రెండు గాని ఎక్కువ గాని మంచుగడ్డలుండుట సాధ్యము.

అవి ఒకదాని నుండి ఒకటి వేరుగా నుండును. ఒకదాని స్పర్శ ఇంకొకదానికి కలుగును. ఒక దానితో ఇంకొక దానిని కొట్టినచో బ్రద్దలగుట, శబ్దము వచ్చుట మున్నగు క్రొత్త చేష్టలు పుట్టుచున్నవి. నీరు మంచుగడ్డలుగా స్థితి భేదము చెందుటయే దీనికి కారణము.

అట్టి స్థితి భేదముతోనే అంతర్యామి యందు పంచభూతాదులు కట్టుకొని వేరువేరు దేహము లేర్పడును. అంతర్యామి తానను తెలివి మాటుపడి దేహము తానను భ్రాంతి కలుగును.

ఆచరింపబడిన పనుల వలన సుఖదుఃఖములు అను ఫలితములేర్పడును. ఇదియే కర్మబంధము.

🌹 🌹 🌹 🌹 🌹


29 Jun 2021

No comments:

Post a Comment