మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 49






🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 49 🌹



✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనం : వేణుమాధవ్

📖. సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. లోకోద్ధరణము- లోక కల్యాణము - 2 🌻


లోకమంతా విష్ణుమయం. లోకంలోని వ్యక్తుల స్వభావాలనే అలల ఆటు, పోటుల వెనుక నేపథ్యంగా ఉన్నది అంతర్యామి చైతన్యమనే మహా సాగరము. ఇది అవ్యక్తము‌. ఈ సాగరమే వాసుదేవుడు.

ఈ సాగరాన్ని దర్శించి, జీవుల రూపంలోని వాసుదేవుని సేవకై కడంగి ఆనందించుటే మన కర్తవ్యము.

దీన్ని ఆచరించే వాని మనస్సులో వాసుదేవుడు అను ముద్ర ఒకటే ఉంటుంది. ఇదియే ప్రభుముద్ర. ఆంజనేయుని వలె ఈ ముద్ర ధరించినవారు సంసార సముద్రాన్ని తరిస్తారు.

జీవుల స్వభావాలను గూర్చి వీరికి ఎట్టి ముద్ర ఉండదు. ఆయా వ్యక్తుల కష్టాలు, ఆపదలు, రోగాలు వీరికి గుర్తుంటాయి. జీవుల ఆనందానికి, శాంతికి, ఆరోగ్యానికి తమ వంతు సేవ చేస్తారు. లోకకళ్యాణము కొరకు తమ వంతు కర్తవ్యాన్ని అనుష్ఠిస్తారు.

నిజానికి లోకంలో కాలధర్మం రాజ్యమేలుతుంటుంది. భూమిపై జీవుల ప్రజ్ఞలను అధిష్ఠించే భూమికి కూడ ప్రజ్ఞ ఉంటుంది. ఆ ప్రజ్ఞా పరిణామంలో భాగంగానే, ఆయాకాలాల్లో జీవుల ప్రవర్తనల్లోని కొన్ని సాధారణ సన్నివేశాలు జరుగుతాయి.

కృతయుగంలోను అసుర ధర్మావలంబులున్నారు. కలియుగంలోను దైవధర్మావలంబులున్నారు. కలి అనేది పరస్పరాభిప్రాయ ముద్రలతో ఘర్షణను పుట్టించే ప్రభావం కల ఒక ఇంద్రజాలం. అంతేకాని ఒక యుగం మాత్రమే కాదు.

కలి జీవుల ఉద్ధరణకై ప్రయత్నం సాగించేవారు ఈ ఇంద్రజాలానికి వశులై, కలిధర్మ ప్రభావాన్నే పెంచుకుంటూ పోతూ కలికి ఉపకరణాలవుతారు.

అలాకాక, జీవుల ప్రవర్తనలు, సమాజగతిలో సన్నివేశాలు మున్నగు అలల వెనుక అనంతకాలమనే సాగరాన్ని దర్శించి, లోక కల్యాణమునకై దీక్ష వహించేవారు విష్ణుధర్మాన్ని అవలంబించి, ధన్యులవుతారు....

సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


03 Jul 2021

No comments:

Post a Comment