శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 303-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 303 -1



🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 303-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 303 -1🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀

🌻 303-1.'హృద్యా' 🌻


హృదయము లందు నివసించునది శ్రీలలిత అని అర్థము. శ్రీమాత హ్రీంకారిగ, హ్రీమతిగ హృదయమున నివసించును. అనగ బంగారు కాంతిగ గోచరించును. హృదయము బుద్ధిలోకమునకు కేంద్రము. మనో లోకమున జీవించు మానవులు బుద్ధిలోకము నందు ప్రవేశించుటకు, బుద్ధిలోకము నందు ప్రవేశించిన వారికి ప్రేమానందము కలిగించుటకు హిరణ్యవర్ణములో అచ్చట నివసించు చుండును.

రమణీయమగు దృశ్యములు చూచినప్పుడు, ఆనందము కలుగు సన్నివేశము లేర్పడినపుడు మానవుడు పొందు స్ఫూర్తి హృదయము నందే పొందును. హృదయము చేరినవారికి ఆనందమనగ నేమో తెలియును. అచ్చట స్థిరబడినవారు ఎప్పుడునూ ఆనందముగనే వుందురు. వారు మనస్సు, ఇంద్రియములు, భాషణము ఆధారముగ బాహ్యములోనికి చనుట కిచ్చగింపరు. కేవలము కర్తవ్యకర్మలు మాత్రమే నిర్వర్తించుచు హృదయమున చేరి హిరణ్యవర్ణమున సుఖింతురు.

మునులనగ యిట్టివారే. వారు సహజముగ హిరణ్య ప్రాకారములో నుందురు. కర్తవ్యము మేరకు బాహ్యములోనికి వ్యక్తమగు చుందురు. వీరి హృదయ మందు సతతముండునది శ్రీదేవి. హృదయము హృద్యమమైన విషయము. అనగా నిశ్చలమగు ప్రీతి నందించు స్థానము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 303 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀

🌻 303. Hṛdyā हृद्या (303) 🌻


She resides in the heart. Soul is said to be in the centre of the heart. Heart also stands for compassion and love. Since She is the Divine Mother, these qualities are in built in Her. Or it could also mean that She is loved by everybody.

Katha Upaniṣad (II.i.13) says, “The thumb sized puruṣaḥ (soul) is seen as smokeless flame rests in the centre of the body.”


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


22 Aug 2021

No comments:

Post a Comment