నిర్మల ధ్యానాలు - ఓషో - 62


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 62 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. పరమానందంగా వున్న మనిషి అపకారం చెయ్యడానికి అసమర్థుడు, పరమానందమే ధర్మము. పరమానందంగా వుండండి. అప్పుడు మీరేం చేసినా అది సరయిందే అవుతుంది. 🍀


పరమానందంగా వున్న మనిషి దేనికీ అపకారం తలపెట్టడు. తనకూ హాని తలపెట్టడు. యితరులకూ హాని తలపెట్టడు. అతను అపకారం చెయ్యడానికి అసమర్థుడు. బాధపడే మనిషి తప్పు చెయ్యడానికి సమర్థుడు. అతను తను మంచి చెయ్యాలని ప్రయత్నిస్తున్నట్లను కుంటాడు. అతను మంచి చెయ్యలేడు. అతని వుద్దేశం మంచిదయినా ఫలితం మంచిగా వుండదు.

అతను ప్రజల్ని ప్రేమిస్తున్నానను కుంటాడు. కానీ ప్రేమ పేరుతో అధికారం చెలాయిస్తాడు. అతను ప్రజలకు గొప్ప సేవకుడనుకుంటాడు. అతను కేవలం రాజకీయవాది. సేవద్వారా అధికారం చెలాయిస్తాడు. దురవస్థలో వున్న మనిషి మంచి చెయ్యడానికి అసమర్థుడు.

అందువల్ల నా మేరకు ధర్మమన్నది పరమానందం. పాపం అన్నది ఒక్క మాటలో చెప్పాలంటే దు:ఖం, బాధ. పరమానందమే ధర్మం. ఉత్సాహంగా వుండండి, పరమానందంగా వుండండి. నాట్యం చేయండి, గానం చేయండి. అప్పుడు మీరేం చేసినా అది సరయిందే అవుతుంది.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


22 Aug 2021

No comments:

Post a Comment