శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 306 / Sri Lalitha Chaitanya Vijnanam - 306


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 306 / Sri Lalitha Chaitanya Vijnanam - 306🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀

🌻 306. 'రాజీ'🌻

రాజ రాజేశ్వరుని పట్టపురాణి శ్రీమాత అని అర్థము. శివుడు రాజ రాజేశ్వరుడు. శ్రీమాత రాజ రాజేశ్వరి. అతడు సత్యము. ఆమె చైతన్యము. సృష్టి కావల గాని సృష్టియందుగాని వారిరువురును అవినాభావ స్థితి యందుందురు. సమాధి స్థితియందు ఒకరికొక రున్ముఖులై యుందురు. సృష్టి సంకల్పమున సత్య మాధారముగ చైతన్యము స్థితి భేదములను కల్పించి సత్యలోకము నుండి భూలోకము వరకు అటుపైన పాతాళ లోకముల వరకు సృష్టి నిర్మాణము చేయును. అవరోహణ క్రమమున చైతన్యము మహా చైతన్యమై సమస్త కార్యములను నిర్వర్తించును. సత్యము సహకరించును. సమస్త లోక లయందు తాను వశించగ, చైతన్యము సృష్టి అల్లిక చేయును.

సత్యము అన్నిటియందు వశించి యుండుట చేతనే వస్తువు లేర్పడు చున్నవి. వస్తువనగా సత్యమాధారముగ యేర్పడినదని అర్థము. సత్య మాధారముగ చైతన్యము చేయు అల్లికయే వస్తువు. అల్లిక లేని సృష్టి లేదు. సత్యము లేని అల్లిక లేదు. కావున సృష్టియందు సత్యము, చైతన్యము రెండునూ సరిసమానమైన బాధ్యత వహించి యున్నవి. సత్యమునకు స్థితిభేదము లేదు. చైతన్యము స్థితి భేదము చెందును. సూక్ష్మ, స్థూల లోకముల నేర్పరచును. ఇరువురిలో ఒకరు లేని స్థితి లేదు. సత్యము, చైతన్యము రెంటినీ కలిపి 'తత్' అనిరి. దీని అవగాహననే తత్త్వమనిరి. అన్నియూ తత్త్వ రూపములే.

“తత్-త్వం” అది నీవే అని కూడ అర్థము. ప్రతి వస్తువు, ప్రతి ఒక్కరూ సత్, చిత్ రూపములే. కావున సత్యము గొప్పదా? చైతన్యము గొప్పదా? శివము గొప్పదా? శక్తి గొప్పదా? అను విషయమును పరిశోధించిన ఋషులు రెండునూ సరిసమానమగు గొప్పదనము గలవని తేల్చిరి. రెండునూ శాశ్వతమై యున్నవని, ఒకటిని వీడి రెండవది లేదని తేల్చిరి. కనుకనే అతడు రాజ రాజు. ఆమె రాజై. బుద్ధిమంతులు చైతన్యమును, సత్యమును సరిసమానముగ ఆరాధింతురు. అప్పుడే ఆనందము లభించగలదు. వేదమున గల వేలాది సూక్తములలో రెండు సూక్త రాజము లున్నవి. అవి శ్రీ సూక్తము, పురుష సూక్తము. రెంటినీ ప్రతిదినము పఠించు వారికి సత్ చిత్ ఆనందము కలుగును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 306 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj


🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀

🌻 306. Rājñī राज्ञी (306) 🌻

The queen. This is in line with the previous nāma. Being Śiva’s (Rājarāja or king of kings) wife, She becomes the queen for the kingdom of this universe. The universe is ruled by Śiva and Śaktī. Possibly this could also be a reason for calling Her as the universal Mother or in the shortened form as Mā. When one calls Her as Mā, he will have a feeling that She belongs to you and closer to you.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


31 Aug 2021

No comments:

Post a Comment