నిర్మల ధ్యానాలు - ఓషో - 66


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 66 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సాహసం, పరమానందం ఈ రెండు లక్షణాలతో వ్యక్తి నిండిపోతే దైవం నీలోకి దిగడానికి, పూర్వరంగం ఏర్పడుతుంది. దైవం అజ్ఞాతం. నువ్వు యింత వరకు దేవుడి గురించి విన్నదంతా నువ్వు దేవుణ్ణి చూసినపుడు భిన్నంగా మారుతుంది. 🍀


సాహసంగా, పరమానందంగా వుంటే ఈ రెండు లక్షణాలతో వ్యక్తి నిండిపోతే దైవం నీలోకి దిగడానికి, నీలో అడుగుపెట్టడానికి పూర్వరంగం ఏర్పడిందన్న మాట. నువ్వు సాహసంతో వుండాలి. కారణం దైవం అజ్ఞాతం. నువ్వు యింతవరకు దేవుడి గురించి విన్నదంతా నువ్వు దేవుణ్ణి చూసినపుడు భిన్నంగా మారుతుంది. నువ్వు దిగ్భ్రమకి లోనవుతావు. నీ వూహాలు తలకిందులవుతాయి. అప్పటి దాకా దేవుడి గురించి నువ్వు విన్నదంతా అర్థరహితం అని తెలుస్తుంది.

దైవం అవ్యక్తం, అనిర్వచనీయం. అజ్ఞాతం. అంతే కాదు అంతవరకూ దైవానుభవాన్ని పొందిన వారెవ్వరూ కూడా తమ అనుభవాన్ని వ్యక్తపరచ లేదు. నిశ్శబ్దంగా, మౌనంగా వుండిపోతారు. ఇంగ్లీషు పదం 'మిస్టెక్' అన్నది అధ్భుతమయిన పదం. దాని యదార్థమయిన అర్థం. సత్యాన్ని అర్థం చేసుకున్న వాడు దాన్ని రహస్యమంటాడు. మార్మికమంటాడు. అది రహస్యం. అదేమీ చెప్పదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


31 Aug 2021

No comments:

Post a Comment