🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 61 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ఏదీ నీకు పరమానందాన్ని తెచ్చినా అది ఆత్మ పంచిన అనందమే. మనం రాత్రింబవళ్ళ చక్రాల, జీవన్మరణాలు గుండా సాగుతాం. మనమవేమీ కాదని గుర్తిస్తే పరమానందం పరిమళిస్తుంది. విశ్వంతోనూ శాంతిగా వుంటాడు. ఆ సమశృతియే పరమానందం. 🍀
ఏదీ నీకు పరమానందాన్ని తెచ్చినా అది ఆత్మ పంచిన అనందమే. మనుషుల శరీరాలు కాదు ఆత్మలు ఆకలితో అల్లాడుతున్నాయి. జాగ్రత్తగా వుండు. వీలయినంత వరకు పరవశాన్ని ఎన్నుకో. దు:ఖాన్ని దూరంగా వుంచు. నీ చుట్టూ వున్న బాధకి వీలయినంత మేర దూరంగా వుండు మేఘాలు కమ్ముకుంటాయి. మరుసటి రోజు సూర్యకాంతి నిండు కుంటుంది. సూర్యుణ్ణి చూడు. మేఘాల్ని చూడు. నువ్వు రెంటికీ వేరన్న సంగతి గుర్తించు. చీకటి క్షణాలు వస్తాయి. కాంతి ఘడియలు వస్తాయి.
మనం రాత్రింబవళ్ళ చక్రాల గుండా సాగుతాం. జీవన్మరణాలు, వేడి, చలి, అన్నిటి గుండా సాగుతాం. మనమవేమీ కాదని గుర్తిస్తే పరమానందం పరిమళిస్తుంది. అప్పుడు హఠాత్తుగా వ్యక్తి తనలో తాను శాంతిగా వుంటాడు. విశ్వంతోనూ శాంతిగా వుంటాడు. అదే పరమానందం. ఆ సమశృతి పరమానందం. ఒకసారి నువ్వు పరమానందంగా వుండడం నేర్చుకుంటే నీ ఆత్మ ఎదగడం మొదలు పెడుతుంది. లేని పక్షంలో అది బీజంగా మిగిలిపోతుంది. బీజం చెట్టుగా ఎదగని పక్షంలో చెట్టు వికసించని పక్షంలో, పూలు పూయని పక్షంలో, పళ్ళు కాయని పక్షంలో అంతా వ్యర్థం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
20 Aug 2021
No comments:
Post a Comment