శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 302-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 302 -2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 302-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 302 -2🌹

సహస్ర నామముల తత్వ విచారణ

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

మూల మంత్రము :

🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 70. నారాయణీ, నాదరూపా, నామరూప వివర్జితా ।
హ్రీంకారీ, హ్రీమతీ, హృద్యా, హేయోపాదేయ వర్జితా ॥ 70 ॥ 🍀

🌻 302-2. 'హ్రీమతి' 🌻


శ్రీనాథ మహాకవి మహా బుద్ధిశాలి, అయిననూ అప్పుడప్పుడు అహంకారము సోకి భంగపడెను. అపుడు శ్రీనాథుడు అమ్మ నుద్దేశించి యిట్లు పలికెను : "తల్లీ నీవు కలవాడు, కలవాడు! నీవు లేనివాడు, లేనివాడే! మనయందు నిక్షిప్తమైన బుద్ధి మనది కాదని తెలియవలెను. అది దైవ సంబంధితము.

దైవమే బుద్ధి రూపమున మిత్రుడై జీవున కందుబాటులో నుండును. బుద్ధి ననుసరించినచో జీవనము సుగమ మగును. అతిక్రమించినచో దుర్గమమగును. బుద్ధి ననుసరించి స్వభావ ముండుట శ్రేయస్కరము. అది భక్తి వలన మాత్రమే కలుగును. తన రథమును పగ్గములు పట్టి తన జీవితమునకు సారథ్యము వహించుమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించుట వలన అర్జునుడు విజయుడై నిలచినాడు. మనయందు బుద్ధిగా అవతరించి మనలను నడిపించుమని కోరుటకే ఋషులు గాయత్రీ మహామంత్రము నిచ్చిరి.

అహంకార పురుషుడగు జీవుడు బుద్ధికి లోబడి యుండ వలెనన్నచో దైవారాధనమే శరణ్యము. తనకు తానుగ మంచిచెడ్డలు నిర్ణయించుచూ జీవించుట కన్న తనయందు బుద్ధిగా అవతరించి నడిపింపుమని దైవమును ప్రార్థించుట శ్రేయస్కరము. ఎట్టి పరిస్థితి యందు "తన బుద్ధి” అన్న భావము కలుగరాదు. అమ్మ వెలుగు తనయందు బుద్ధిగ యున్నదని, అది తన వశమున నుండక అమ్మవశమున నుండునని, తన వశమున నున్నట్లు భ్రమ గొలుపునని కూడ తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 302 🌹

1000 Names of Sri Lalitha Devi

✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj

🍀 70. nārāyaṇī nādarūpā nāmarūpa-vivarjitā |
hrīṁkārī hrīmatī hṛdyā heyopādeya-varjitā || 70 || 🍀

🌻 302. Hrīmatī ह्रीमती (302) 🌻


Hrī means modesty. Veda-s describe Her as endowment of modesty, mind, satisfaction, desire and nourishment. All these indicate māyā. Her māyā or illusory form is described in this nāma. It is also said that Her modesty prevents Her in participating in the rituals performed with pomp and vanity.

She is ashamed of participating in such rituals. The worship of Śaktī should always be secretive in nature. She has a liking for such secretive worships and these worships are performed only internally. By worshipping Her internally, one realizes Her subtle forms viz. kāmakalā and kuṇḍalinī forms. Realization through internal worship is much faster than by performing external rituals.

Continues...

🌹 🌹 🌹 🌹 🌹


20 Aug 2021

No comments:

Post a Comment