21-AUGUST-2021 MESSAGES

1) 🌹. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 243 🌹  
2) 🌹. శివ మహా పురాణము - 442🌹 
3) 🌹 వివేక చూడామణి - 119 / Viveka Chudamani - 119🌹
4)🌹. మాస్టర్ ఇ.కె సందేశాలు -71🌹  
5) 🌹 Osho Daily Meditations - 60🌹
6) 🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 119🌹

*🌹. శుభ శనివారం మిత్రులందరికీ 🌹 *
*ప్రసాద్ భరద్వాజ* 

Join and Share ALL
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹 
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, WA, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://chat.whatsapp.com/BzCAiTrm6X9K1NsjyGWzlg

Join and Share
విష్ణు సహస్రనామ స్తోత్రము / Vishnu Sahasranama group. 
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/

Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://pyramidbook.in/dailywisdom

Join and Share 
🌹. వివేకచూడామణి Viveka Chudamani 🌹
www.facebook.com/groups/vivekachudamani/
https://pyramidbook.in/vivekachudamani

Join and Share
భారతీయ మహర్షుల బోధనలు MAHARSHULA WISDOM
www.facebook.com/groups/maharshiwisdom/
https://pyramidbook.in/maharshiwisdom

Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

Join and share
Meher Baba అవతార్‌ మెహర్‌ బాబా
www.facebook.com/groups/avataarmeherbaba/

Join and Share
Thosophical Teachings దివ్యజ్ఞాన సందేశములు
www.facebook.com/groups/theosophywisdom/

Join and Share
🌹. శ్రీ దత్త చైతన్యం - Sri Datta Chaitanyam 🌹
www.facebook.com/groups/dattachaitanyam/

Join and Share
🌷. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు 🌷 
www.facebook.com/groups/masterek/
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
http://www.facebook.com/groups/oshoteachings/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. గీతోపనిషత్తు -243 🌹*
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
*📚. 8వ అధ్యాయము - అక్షర పరబ్రహ్మ యోగము 📚*
శ్లోకము 22-2
 
*🍀 21-2. 'ఓం సత్యం పరం ధీమహి' - ఈ మొత్తము సృష్టికి మూలము సత్యము. అదియే పరము. దానిని ధ్యానించుట అనగా, అన్నిటి యందు దానిని దర్శించు చుండుటయే. సమస్తమునకు మూలమైన దానిని దర్శించెదను. సమస్తమునకు పరమై నిలబడిన సత్యమును దర్శించెదను. మూడు గుణములు, ఐదు భూతములుగ వ్యక్తమగు మూల ప్రకృతికి మూలమైన దానిని దర్శించెదను. ఇంతకు మించిన సర్వోత్తమ ధ్యానము లేదు. “ఓం సత్యం పరం ధీమహి" అనునది మూలమంత్రము. 🍀*

పురుషః స పరః పార్థ భక్త్యా లభ్య వ్యనన్యయా |
యస్యాన్తః స్థాని భూతాని యేన సర్వ మిదం తతమ్ || 22

తాత్పర్యము : పరము, సత్యము అగు తత్త్యమే విరాట్ పురుషునిగ, పరమ పురుషునిగ ఈ సమస్త జగత్తును వ్యాపించి యున్నది. అతనిని నిత్యము దర్శించు యత్నము సిద్ధించిననాడు అతనిని పొందవచ్చును. 

వివరణము : ఈ మొత్తము సృష్టికి మూలము సత్యము. అదియే పరము. దానిని ధ్యానించుట అనగా, అన్నిటి యందు దానిని దర్శించు చుండుటయే. సమస్తమునకు మూలమైన దానిని దర్శించెదను. సమస్తమునకు పరమై నిలబడిన సత్యమును దర్శించెదను. మూడు గుణములు, ఐదు భూతములుగ వ్యక్తమగు మూల ప్రకృతికి మూలమైన దానిని దర్శించెదను. ఇంతకు మించిన సర్వోత్తమ ధ్యానము లేదు. “ఓం సత్యం పరం ధీమహి" అనునది మూలమంత్రము. 

ప్రణవము ఆధారముగ పరమగు సత్యమును ధ్యానింతుము అనునది మత్స్య పురాణమున ఈయబడిన అష్టాక్షరీ మంత్రము. అనగా గాయత్రీ మంత్రము. దీనిని మనస్సున కనులు మూసుకొని స్మరించుటకన్న పరిసరములయందు చూచుట నిజమగు సాధన. సూటియగు సాధన. కనబడుచున్నది ఆవరణలతో కూడిన సత్యమే అయి యున్నపుడు దానిని దర్శించుటమాని, కనులు మూసుకొని ఊహించుట మాయ.  

పరమే పరమ పురుషుడగు చున్నాడు. అనగా ప్రకృతి నిర్మించు సృష్టియందు ప్రవేశించి వ్యాపించి యున్నది. ఈ సృష్టి యంతయు అతని పురమే. పుర మేర్పడుటకు మూలమైనవాడు పురమందు పరిపూర్ణముగ వ్యాపించి యుండును. పురము నతిక్రమించి కూడ యుండును. పురము పురుషుని పట్టలేదు. పురుషుడు పురమందు వ్యాపించియున్నను, అంతకు మించి ఎంతయున్నదో ఎవ్వరికిని తెలియదు. అట్టి తత్త్వము అనన్యముగ దర్శించుటయే నిజమగు భక్తియని అర్జునునకు కృష్ణుడు బోధించు చున్నాడు. ఇతర మార్గము లన్నియు ఈ మార్గమును పట్టించినచో వానికి సార్థకత యుండును. లేనిచో చిల్లర మార్గములై తికమక పెట్టుచుండును. 

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 442🌹* 
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴* 
అధ్యాయము - 28

*🌻. శివుని సాక్షాత్కారము - 5 🌻*

శివుడిట్లు పలికెను-

నన్ను విడిచి నీవు ఎచటకు పోయెదవు? నున్ను నేను రెండవసారి విడిచిపెట్టను. నేను ప్రసన్నుడనైతిని. వరమును కోరుకొనుము. నీకు ఈయదగని వరము లేదు (43). ఈ ఆనాటి నుండి నేను నీ దాసుడను. నేను నీతపస్సులచే కొనివేయబడితిని. నీ సౌందర్యముచే కొనివేయబడితిని. నీవు లేని క్షణము యుగమువలె నున్నది (44). 

నీవు సిగ్గును విడువుము. నీవు నా సనాతన ధర్మపత్నివి. ఓ గిరిజా!మహేశ్వరీ!నీవు సద్బుద్ధితో విచారించుము (45). దృఢమగు చిత్తము గలదానా! నేను నిన్ను పరిపరివిధముల పరీక్షించితిని. లోకలీలను అనుసరించే నా ఈ అపరాధమును మన్నించుము (46).

నీవంటి ప్రేమమూర్తి ముల్లోకములలో కానరాదు. నేను అన్ని విధములా నీకు అధీనుడనై యున్నాను. ఓ శివా! నీ కోర్కె నెరవేరుగాక! (47) ఓ ప్రియురాలా! నా వద్దకు రమ్ము. నీవు నాకు పత్నివి. నేను నీ వరుడను. నా నివాసమగు ఉత్తమకైలాసమునకు నేను నిన్ను దోడ్కొని తొందరలో వెళ్లగలను (48). 

బ్రహ్మ ఇట్లు పలికెను-

దేవదేవుడు ఇట్లు పలుకగా ఆ పార్వతి చాల సంతసించెను. అంతవరకు ఆమె తపస్సును చేయుటలో పడిన క్లేశము మటుమాయమయ్యెను (49). ఓ మునిశ్రేష్ఠా! పార్వతీ దేవి యొక్క శ్రమ అంతయూ తొలగిపోయెను. మానవులకు చేసిన కష్టమునకు ఫలము లభించినప్పుడు అంతవరకు పడిన శ్రమ మటుమాయమగును (50).

శ్రీ శివ మహాపురాణములోని రుద్ర సంహితయందు పార్వతీ ఖండలో పార్వతికి శివుడు దర్శనమిచ్చుట అనే ఇరవై ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28). 

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. వివేక చూడామణి - 119 / Viveka Chudamani - 119🌹*
✍️ రచన : *పేర్నేటి గంగాధర రావు*
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🍀. 26. ఆత్మ మార్పులేనిది - 6 🍀*

395. ముందు అహంకారము వలన ఏర్పడిన ఈ స్థూల, సూక్ష్మ ప్రపంచ భావనలను నాశనం చేసి, అపుడు బలవంతముగా గాలి వంటి పదార్థముతో ఏర్పడిన ఈ స్థూల శరీరమును కూడా నాశనం చేసి బ్రహ్మాన్ని గుర్తెరిగి దివ్యానందమును పొందుము. ఆ బ్రహ్మము యొక్క ఔనత్యమును శాస్త్రాలు పొగిడినాయి. ఆ బ్రహ్మము నీ ఆత్మ ఒక్కటే అని బ్రహ్మముతో జీవించమని పలికినారు. 

396. ఎముకల ప్రోగువంటిది, అపవిత్రమైన ఈ భౌతిక శరీరముపై ఏ మాత్రమైన గౌరవమున్నా, ఈ శరీరమునకు శత్రువులైన పుట్టుక, చావు, రోగాల నుండి విముక్తి పొందాలనుకున్నా; అట్టి వ్యక్తి తాను నిజముగా స్వచ్ఛమైన, పవిత్రమైన, భగవంతుని యొక్క సారమని గ్రహించి, పైవాటన్నింటి నుండి స్వేచ్ఛను పొందవలయును అని సృతులు పల్కుచున్నవి. 

397. అహంకారము, బాహ్య వస్తువులపై కోరికలు ముందుగా తొలగించుకొని అవన్నీ ఆత్మకు అంటబెట్టినవిగా భావించి, ఉన్నతమైన బ్రహ్మమునందు దృష్టి పెట్టి, అది ఏకము, రెండవది లేనిదిగా తెలుసుకొని దాని వలె మారవలెను. 

 సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 VIVEKA CHUDAMANI - 119 🌹*
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj

*🌻 26. Self is Unchangeable - 6 🌻*

395. (First) destroy the hopes raised by egoism in this filthy gross body, then do the same forcibly with the air-like subtle body; and realising Brahman, the embodiment of eternal Bliss – whose glories the Scriptures proclaim – as thy own Self, live as Brahman.

396. So long as man has any regard for this corpse-like body, he is impure, and suffers from his enemies as also from birth, death and disease; but when he thinks of himself as pure, as the essence of good and immovable, he assuredly becomes free from them; the Shrutis also say this.

397. By the elimination of all apparent existences superimposed on the soul, the supreme Brahman, Infinite, the One without a second and beyond action, remains as Itself.

Continues.... 
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 71 🌹*
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు 
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

*🌻. ఆనందసూక్తము - 3 🌻*

మనస్సు తనను పరిపోషించే స్వీయ యాంత్రిక వ్యవస్థను, అవగాహనలను, భావనలను కలిగి ఉంటుంది. ఇంద్రియములు-వాని అవయవములు-మనస్సు, ఇచ్ఛ‌ ఉన్నవి. ఇన్నీ దేహంలో చక్కగా అమర్చబడి ఉన్నాయి. వానితో మనము పుట్టినాము.

కాని ప్రతి పరికరమునకు వ్యక్తిగత విషయము అనే శూన్యదోషము (Zero Error) ఉంటూనే ఉంటుంది. అనగా సత్యము కేవలము వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది. 

అటువంటి సందర్భాలలో సత్యమనే గాజు పాత్ర మేధావులచే ముక్కలయినదని ఒక ప్రాచీన సంస్కృత కవి వచనము. 

లోకంలో స్వంత సిద్ధాంతమను పేర సత్యము యొక్క ఒక పగిలిన ముక్కను ఒక్కొక్కడు మోసుకుపోతూ ఉంటాడు. తన దగ్గర సత్యము యొక్క పగిలిన ముక్క ఉన్నదన్న సంగతి ఏ ఒక్కరూ కాదనలేరు. 

కా‌ని ఏ ఒక్క ముక్కకూ పాత్ర యొక్క ప్రయోజనము నెరవేర్చే సామర్థ్యము లేదు. ఇంతకూ చెప్పవచ్చిన దేమంటే, ప్రతివాని దగ్గర సత్యము యొక్క పగిలిన ముక్క మాత్రమే ఉన్నది. 

లోకపు తీరు ఎట్లాంటిదంటే, పలు సిద్ధాంతాలను ఒకదానితో ఒకటి సరిపోల్చుకుంటూ ఏది సరియైనది ఏది కాదు అని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నిస్తూ, ఆలోచిస్తూ మరణించే వరకూ అట్లా తర్కంలోనే ఉంటాడు. తన భావన వ్యక్తిగతమైన కారణం. దానికి శూన్యదోషము అంటక మానదు. ఎప్పటికీ ఒక నిర్ణయానికి రాలేని అశక్తుడవవుతాడు. 

అందుచేత భావనా‌పరిధిని అధిగమించి ఆనందస్థితి చేరువరకు, ఆనందాన్ని గూర్చిన భావన అపవాదము కాదు. ఆనందమును గూర్చిన మన భావన వసుధైక కుటుంబ భావనను చేరేదాకా, విశ్వజనీనమగువరకు మనము దానిని ఆనందమని చెప్పజాలము. 

అనగా నీ చెంతనున్న ఎవడైనా ఆనందంగా ఉండటం, మరో విధంగా లేకపోవడం, నీతో ఎవరైనా మాట్లాడినపుడు జ్ఞానముతోడి ఆనందము‌ పొందుట- అప్పటి వరకూ నీవు దానిని ఆనందమని అనలేవు. ఇదే భగవద్గీత, మరెన్నో పవిత్ర గ్రంథాలు చెబుతున్నది.

.....✍️ *మాస్టర్ ఇ.కె.*🌹
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Osho Daily Meditations - 60 🌹*
📚. Prasad Bharadwaj

*🍀 60. FREEDOM 🍀*

*🕉 Life is insecure-that means life is free. if there is security, then there will be bondage; if everything is certain, then there will be no freedom. 🕉*

If tomorrow is fixed, then there can be security, but you have no freedom. Then you are just like a robot. You have to fulfill certain things that are already predestined. But tomorrow is beautiful, because tomorrow is total freedom. Nobody knows what is going to happen. Whether you will be breathing, whether you will be alive at all, nobody knows. Hence there is beauty, because everything is in a chaos, everything is a challenge, and everything exists as a possibility. Don't ask for consolations. If you go on asking, you will remain insecure. 

Accept insecurity, and insecurity will disappear. This is not a paradox, it is a simple truth-paradoxical, but absolutely true. Up to now you have existed, so why be worried about tomorrow? If you could exist today, if you could exist yesterday, tomorrow will take care of itself too. Don't think of the morrow, and move freely. A chaos at ease -- that's how a person should be. When you carry a revolution within you, every moment brings a new world, a new life ... every moment becomes a new birth.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా సహస్ర నామములు - 119 / Sri Lalita Sahasranamavali - Meaning - 119 🌹*
🌻. మంత్రము - అర్ధం 🌻
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀 119. కటాక్షకింకరీ భూత కమలా కోటిసేవితా |*
*శిరఃస్థితా, చంద్రనిభా, ఫాలస్థేంద్ర ధనుఃప్రభా ‖ 119 ‖ 🍀*

🍀 590. కటాక్షకింకరీ భూతకమలాకోటిసేవితా - 
అనుగ్రహ వీక్షణ మాత్రముచే భృత్యులుగా చేయబడిన శ్రీసతుల సమూహముచేత సేవింపబడునది.

🍀 591. శిరఃస్థితా - 
తలమిద పెట్టుకోవలసినది.

🍀 592. చంద్రనిభా - 
చంద్రుని కాంతితో సమానమైన కాంతిని కూడు యుండినది.

🍀 593. ఫాలస్థా - 
ఫాల భాగమునందు ఉండునది.

🍀 594. ఇంద్రధనుఃప్రభా - 
ఇంద్రధనుస్సు లోని రంగుల కాంతులతో సమానమగు కాంతులతో వెలుగొందునది.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹. Sri Lalita Sahasranamavali - Meaning - 119 🌹*
📚. Prasad Bharadwaj 

*🌻 119. kaṭākṣa-kiṅkarī-bhūta-kamalā-koṭi-sevitā |*
*śiraḥsthitā candranibhā bhālasthendra-dhanuḥprabhā || 119|| 🌻*

🌻 590 ) Kataksha kimkari bhootha kamala koti sevitha -   
She who is attended by crores of Lakshmis who yearn for her simple glance

🌻 591 ) Shira sthitha -   
She who is in the head

🌻 592 ) Chandra nibha -  
 She who is like the full moon

🌻 593 ) Bhalastha -   
She who is in the forehead

🌻 594 ) Indra Dhanu Prabha -   
She who is like the rain bow

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment