వివేక చూడామణి - 119 / Viveka Chudamani - 119
🌹. వివేక చూడామణి - 119 / Viveka Chudamani - 119🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 26. ఆత్మ మార్పులేనిది - 6 🍀
395. ముందు అహంకారము వలన ఏర్పడిన ఈ స్థూల, సూక్ష్మ ప్రపంచ భావనలను నాశనం చేసి, అపుడు బలవంతముగా గాలి వంటి పదార్థముతో ఏర్పడిన ఈ స్థూల శరీరమును కూడా నాశనం చేసి బ్రహ్మాన్ని గుర్తెరిగి దివ్యానందమును పొందుము. ఆ బ్రహ్మము యొక్క ఔనత్యమును శాస్త్రాలు పొగిడినాయి. ఆ బ్రహ్మము నీ ఆత్మ ఒక్కటే అని బ్రహ్మముతో జీవించమని పలికినారు.
396. ఎముకల ప్రోగువంటిది, అపవిత్రమైన ఈ భౌతిక శరీరముపై ఏ మాత్రమైన గౌరవమున్నా, ఈ శరీరమునకు శత్రువులైన పుట్టుక, చావు, రోగాల నుండి విముక్తి పొందాలనుకున్నా; అట్టి వ్యక్తి తాను నిజముగా స్వచ్ఛమైన, పవిత్రమైన, భగవంతుని యొక్క సారమని గ్రహించి, పైవాటన్నింటి నుండి స్వేచ్ఛను పొందవలయును అని సృతులు పల్కుచున్నవి.
397. అహంకారము, బాహ్య వస్తువులపై కోరికలు ముందుగా తొలగించుకొని అవన్నీ ఆత్మకు అంటబెట్టినవిగా భావించి, ఉన్నతమైన బ్రహ్మమునందు దృష్టి పెట్టి, అది ఏకము, రెండవది లేనిదిగా తెలుసుకొని దాని వలె మారవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 119 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 26. Self is Unchangeable - 6 🌻
395. (First) destroy the hopes raised by egoism in this filthy gross body, then do the same forcibly with the air-like subtle body; and realising Brahman, the embodiment of eternal Bliss – whose glories the Scriptures proclaim – as thy own Self, live as Brahman.
396. So long as man has any regard for this corpse-like body, he is impure, and suffers from his enemies as also from birth, death and disease; but when he thinks of himself as pure, as the essence of good and immovable, he assuredly becomes free from them; the Shrutis also say this.
397. By the elimination of all apparent existences superimposed on the soul, the supreme Brahman, Infinite, the One without a second and beyond action, remains as Itself.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
21 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment