నిర్మల ధ్యానాలు - ఓషో - 72
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 72 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. స్వప్నాల్ని, కోరికల్ని, ఆలోచనల్ని పరిశీలిస్తూ వుంటే క్రమంగా మెల్ల మెల్లగా నువ్వొక పరిశీలకుడిగా మారుతావు. క్రమంగా నువ్వు పరిశీలిస్తున్న వాటి నుండి వేరవుతావు. సాక్షిగా మారుతావు. ఆ సాక్షీభూతంగా మారడమే అంతిమ యదార్థం. 🍀
నువ్వు ఆలోచించే వాటి పట్ల, నీ సమస్త కోరికల పట్ల, వూహల పట్ల, స్వప్నాల పట్ల మరింత మరింత స్పృహతో వుండు. నడిస్తే - చైతన్యంతో నడువు. తింటే స్పృహతో తిను. ఆలోచిస్తే మనసులో సాగే ఆలోచనల్ని పరిశీలించు. యిట్లా చేసే ఒక రోజు ఆశ్చర్యపోతావు. ఒక రోజు నువ్వు నీ చైతన్యాన్ని చూస్తే అది నిద్రలోనూ మేలుకొని వుండడం చూస్తావు. నీ కలల్ని నువ్వు చూస్తావు. ఎట్లాంటి కలలో పరిశీలిస్తావు. అట్లాంటి రోజు, వ్యక్తి తన కలల్ని పరిశీలించగలిగిన రోజు ఆ రోజు వ్యక్తి గొప్ప పరివర్తన చెందిన రోజు. రూపాంతరం చెందిన రోజు.
ఆ రోజు మొదలు నువ్వొక కొత్త వ్యక్తి వవుతావు. అపుడు నువ్వు వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెడతావు. స్వప్నాల్ని, కోరికల్ని, ఆలోచనల్ని పరిశీలిస్తూ వుంటే క్రమంగా మెల్ల మెల్లగా నువ్వొక పరిశీలకుడిగా మారుతావు. క్రమంగా నువ్వు పరిశీలిస్తున్న వాటి నుండి వేరవుతావు. సాక్షిగా మారుతావు. ఆ సాక్షీభూతంగా మారడమే అంతిమ యదార్థం.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
15 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment