శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 309-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 309-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 309-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 309-2🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🌻 309-2 'రంజనీ, 🌻
తాటిజీవులను సుఖ పెట్టుట, ఆనందింపజేయుట, ఉల్లాసముగ నుంచుట- స్వభావముగ గలవారి యందు శ్రీమాత రంజని లక్షణము మేల్కొనును. అట్టి సత్పురుషుల దర్శనము, స్పర్శనము, సంభాషణము, ఇతర జీవులు కోరుచు నుందురు. కారణము వారి హృదయములు అతడు కారణముగ రంజించుట. ఇతరులను రంజింపజేయు లక్షణముగ శ్రీమాతయే సత్పురుషుల హృదయమున నున్నది.
అట్లే జీవుల యందలి రంజన లక్షణము దేవతలను, దైవమును కూడ మెప్పించుటకు ప్రాతి పదికయై యున్నది. అటు దైవమును, ఇటు జీవులను రంజింపజేయు శక్తి శ్రీమాతయే. జీవులు దైవమును చేరుటకు చేయు ఆరాధనము లిందు తోడ్పాటు కూడ గావించును. ఆమెను రంజింపజేసిన భక్తులు, ఆమె సహాయ సహకారములతో శివుని ఉన్ముఖత్వము కూడ పొందగలరు.
శివునిపై ఆమెకు అట్టి అధికారము ప్రేమపూర్వకముగ శివుడే ఒసగెను. స్ఫటికము వద్ద వున్న ఎర్రనిపువ్వు కాంతి స్ఫటికమును ఎర్ర వర్ణము గల దానినిగ జేయును కదా! అట్లే శుద్ధ స్ఫటిక సంకాశుడగు శివుని వద్ద వున్న శ్రీమాత అతనియందు తనను ప్రతిబింబింప జేయును. తనయం దతనిని ప్రతిబింబింప చేయును. శ్రీమాత రంజనీ లక్షణము అద్భుతము. మన యందు శివుని ప్రతిబింబింప జేయగలదు. అపుడు మనకు శివునిపై రుచి కలుగును. శివుని యందు మనలను ప్రతిబింబింప జేయగలదు. అపుడు శివునికి మనపై అనుగ్రహము కలుగును. ఇట్లు జీవుల యందు భక్తి బీజములు మొలకెత్తించుటకును, జీవులయందు దేవునికి అనుగ్రహము కలుగునట్లు చేయుటకును శ్రీమాతయే ఆధారము. ఆమె నిజమగు మధ్యవర్తి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 309-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀
🌻 309-2. Rañjanī रञ्जनी (309) 🌻
She gives happiness to Her devotees during this birth and also in the Heavens, possibly meaning no-rebirth. The appropriate interpretation of this nāma would be: Rañjana means the act of colouring and also pleasing, charming, rejoicing, delighting, befriending, etc. From this point of view, everything associated with Her is red. Śiva is beyond colour and is pellucid like crystal. When She sits with Him, Śiva’s complexion also turns into red. His crystal complexion becomes radiant with the red complexion of the Supreme Mā. Saundarya Laharī (verse 92) explains this scenario in a different way. “Śiva with His clear lustre has transformed Himself into an apparent bed-cover reddened by your reflected lustre, as the embodied erotic sentiment and yields joy to your eyes.”
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
15 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment