మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 87 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. చేయవలసినది- చేయదలచినది - 3 🌻
ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు. ఇదే ఆరాధన విశేషం అంటే. అది ఈ దేశంలోనే మొట్టమొదట పుట్టింది.
నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి అని అడిగే దరిద్రం ఉన్నన్నాళ్ళు మంచి రోజులు ఏ ఒక్కడికి కూడా రావు. ప్రపంచానికి మనం ఏం చేయగలం? ప్రపంచ శాంతి జరగాలంటే మన కృషి కూడా ఎంత చేయాల్సి ఉన్నది? అని ఆలోచించిన రోజున మనకు రోగాలు తగ్గుతాయి దారిద్ర్యం పోతుంది. దృష్టి అటు మారినపుడు సమస్తము మనలను వరిస్తుంది. మనకు మంచిరోజులు ఎప్పుడు వస్తాయి? అని దృష్టి ఉన్నంతసేపూ ఏనాడూ మంచిరోజులు రాలేదు.
బ్రహ్మవిద్యను అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు, క్రమశిక్షణ పొందుతున్న వాళ్ళు చేస్తున్నవి చూస్తే మనకు తెలుస్తుంది. ఇంట్లో ఒక పవిత్రమైన మందిరం ఒకటి పెట్టుకొన్న పాశ్చాత్యులు కొన్ని వేల మంది అనుష్ఠానం చేస్తూ ఉన్నారు. రోజూ ఓంకారం, వేదాధ్యయనములు కూడా వినపడుతున్నవి. ఉదయం 6 నుండి 6.15 వరకు అనేకాశ్రమములలో "ఓం నమో భగవతే రామకృష్ణాయ" అను మంత్రం ఉచ్చరింపబడుతున్నది.
రామకృష్ణ పరమహంస పేరు మనము ఎడాదికొక మాటన్నా, ఎప్పుడన్నా తలచుకొంటున్నామో తలచుకోమో తెలియదు. ప్రతినిత్యము మనం గమనించి చూచినట్లయితే వాళ్ళ ఆశ్రమాల్లో మనకు (వేదాధ్యయనాదులు) వినిపిస్తుంటాయి. స్వామి శివానంద ఆశ్రమములు, స్వామి సచ్చిదానంద ఆశ్రమములు, రామకృష్ణ మఠములు ఒక్క బ్రస్సెల్స్ నగరంలోనే సుమారు 700 ఆశ్రమాలు ఉన్నాయి. లండన్ లోను, ప్యారిస్ లోను, కొన్ని వందల ఆశ్రమాలు కలవు.
ఇన్నింటిలోను ఉదయం 6 గంటలకు ఓంకారనాదం వినిపిస్తుంటుంది. భారత దేశంలోని ఎన్ని దేవాలయాల్లో మనం ఓంకార నాదం విపిస్తున్నాం? తప్పనిసరిగా సుప్రభాతాలు చేయాలి అనే దేవాలయాల్లో కూడా సుప్రభాతం టేప్ రికార్డింగ్ చేసి వినిపిస్తున్నాము శనివారాల్లో రేడియోలో సుప్రభాతం వినిపిస్తుంటుంది. మనం ఇళ్ళలో ఎంతమందిమి చేసికొంటున్నాము. మళ్ళీ క్రమశిక్షణ మనం స్థాపనం చేసుకోవాలి. దాని కొరకు మనం ఒక Time పెట్టుకోవాలి. దీని కోసం మన సంస్థవారు యువకులంతా కలిసి మాస్టరు సి.వి.వి. గారు చెప్పిన ప్రకారం ఒక కాలమును నిర్ణయించుకున్నారు..
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
28 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment