మైత్రేయ మహర్షి బోధనలు - 9
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 9 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 7. కృషి - 1 🌻
తనకుగ నిర్ణయించుకున్న గమ్యమును చేరుటకు అత్యంత ప్రాముఖ్యమైన సద్గుణము కృషి, కృషికి చెలికాడు శ్రద్ధ, శ్రద్ధతో ఒక పద్ధతిగా కృషి సలిపిన వారికి గమ్యము చేరువగును. ఇందు ఏ ఒక్కటి మరచినను, మార్గమున అవరోధము ఏర్పడును.
దైనందిన జీవితమున ఓర్పుతో, కాలమును వ్యర్థము చేయక శ్రద్ధాభక్తులతో కృషిసలుపు వానికి దుర్లభములు కూడ సులభమగును. కృషి సలుపుటను చిన్నతనమునుండే అభ్యాసము చేయించుట అత్యుత్తమము. కృషిసలుపువానికి శ్రద్ధాభక్తులను గరపవలెను.
కృషి యందు శ్రద్ధ, సోమరితనము, నిద్ర అనునవి అవరోధములు కాగలవు. దైనందినముగ ఆత్మపరిశీలనము కావించుకొనుచు ఈ అవరోధము లను నిర్మూలించు కొనవలెను. జీవనమార్గమున గమ్యమున పయనించు జీవునకు వాక్కు ఎంత ఉపయోగకరమో, అంత అనర్థము కూడ. ఒక విషయమును గుర్తుంచుకొనుడు. అసూయతో పలికిన ఒక వాక్యము మార్గమును కష్టతరము చేయగలదు. దానికి ద్వేషము తోడైన మార్గము అదృశ్య మగును. మార్గమున పయనించుచున్నానను భ్రమ మాత్రమే మిగులును.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
24 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment