శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 311-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 311-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 311-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 311-2🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 71. రాజరాజార్చితా, రాజ్ఞీ, రమ్యా, రాజీవలోచనా ।
రంజనీ, రమణీ, రస్యా, రణత్కింకిణి మేఖలా ॥ 71 ॥ 🍀
🌻 311-2. 'రస్యా' 🌻
అద్వైత స్థితియందు రెండునూ ఒకటి యగును. అనగా ఆస్వాదించు వాడు తన్మయత్వము చెంది తనను తాను మరచును. కాన రసస్వరూపు డగును. అనగా దైవముతో ఏకత్వము చెందును. తా నుండడు, దైవమే వుండును. మరల తానేర్పడును. దైవమునే కోరును. ఇతరము లేవియూ కోరడు. అన్నిటి యందు దైవమునే చూచును, దైవమునే వినును, దైవమునే రుచి చూచు చుండును. తనయందు, సమస్తము నందు దైవమునే దర్శించుచు విశిష్టమగు అద్వైతమున నుండును. దైవమునందే యుండును గాని తా నున్నాడను మెఱమెటు కూడ నుండును. అది లేనిచో ఆస్వాదించుట యుండదు కదా! పాయసము తినుచున్నప్పుడు ఆనందముండును. పాయసమే తానైనచో ఆనంద ముండదు. సూది మొనంత తారతమ్యత నిలుపుకొని ఆనందించును.
దేవుడు జీవుడు మధ్య సూది మొనయంత అంతరముండి, పెద్ద అగాధ మగు అంతరము వరకు ఏర్పరచునది శ్రీమాత. రసస్వరూపుడైన దైవమునకు, దాని నాస్వాదింపగోరు జీవునకు సంధానము కలిగించునది శ్రీమాత. ఆమెయే రసమధ్య. ఆస్వాదించు ప్రక్రియ కూడ ఆమెయే. యోగ్యత కలిగించునది ఆమెయే. సకల అనుభూతులకు కారణ మామెయే. పరతత్వమునకు వుండుటయేగాని వేరొక అనుభూతి లేదు. రసానుభూతి నుండి దుఃఖానుభూతి వరకు పొందు అనుభూతులు శ్రీమాతయే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 311-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🍀 71. rājarājārcitā rājñī ramyā rājīvalocanā |
rañjanī ramaṇī rasyā raṇatkiṅkiṇi-mekhalā || 71 || 🍀
🌻 311-2. Rasyā रस्या (311) 🌻
She is in the form of essence of Ātman. The meaning of rasa (essence) can be understood from Taittirīya Upaniṣad (II.vii) which says raso vai saḥ. The meaning is “That is to be identified with sweetness.” It further says that “anyone who has this sweetness is happy” and the source of sweetness comes from the Self.
Happiness is bliss and it says that bliss can be attained only if individual Self is realized. ‘That’ means the Supreme Self. The nāma says that She is in the form of That Supreme Self. The Supreme Self is the condensed form of the universe realized as the empirical Self.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Sep 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment