✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚
శ్లోకము 3-2
🍀 3-2. చక్రవ్యూహము - ధర్మము తెలియుటకు ప్రధానముగ శ్రద్ధ అవసరము. శ్రద్ధలేని వానికి కనీసమగు వివేకము కూడ యుండదు. శ్రద్ధ కలుగుటకు కర్తవ్యము ప్రధానమగు సాధనము. తానిపుడు ఏమి చేయవలెను? అను ప్రశ్న మనసున ఎపుడును ధరించి యుండవలెను. అట్లు కాక తనకేమి కావలయును అని మనసున ప్రధానముగ ధరించి నచో కాముకుడగును. తనకేమి కావలయును అనునది పతనము నకు దారి. తానేమి చేయవలెను అనునది పురోగమనమునకు దారి. కర్తవ్య మున్నచోట శ్రద్ధ యుండును. శ్రద్ధ యున్నచోట ధర్మము స్ఫురించును. 🍀
అశ్రద్ధధానా: పురుషా ధర్మ ప్యాస్య పరంతప |
అప్రాప్య మాం నివర్తంతే మృత్యుసంసారవర్మని || 3
తాత్పర్యము : ధర్మమునందు శ్రద్ధలేని పురుషులు నన్ను పొందలేరు. అట్టివారు మృత్యువే పర్యవసానమగు సంసారము నందు వర్తించుచు నుందురు.
వివరణము : తన ధర్మము తనకు తెలియనివారే మనుజుల యందు మెండు. ధర్మము తెలియుటకు ప్రధానముగ శ్రద్ధ అవసరము. శ్రద్ధలేని వానికి కనీసమగు వివేకము కూడ యుండదు. శ్రద్ధ కలుగుటకు కర్తవ్యము ప్రధానమగు సాధనము. తానిపుడు ఏమి చేయవలెను? అను ప్రశ్న మనసున ఎపుడును ధరించి యుండవలెను. అట్లు కాక తనకేమి కావలయును అని మనసున ప్రధానముగ ధరించి నచో కాముకుడగును. తనకేమి కావలయును అనునది పతనము నకు దారి. తానేమి చేయవలెను అనునది పురోగమనమునకు దారి.
తనకామె (సీత) కావలయును అని తెలిసినవాడు రావణుడు. తన కర్తవ్యము తెలిసినవాడు రాముడు. కర్తవ్య మున్నచోట శ్రద్ధ యుండును. శ్రద్ధ యున్నచోట ధర్మము స్ఫురించును. రామునికి ధర్మము స్పృజించినట్లు సమకాలికముగ మరెవ్వరికిని ధర్మము స్పృజించలేదు. కర్తవ్యము నశ్రద్ధ చేసినచో లక్ష్యము గతి తప్పును. లక్ష్యము గతి తప్పినచో సంసార చక్రమున బంధింపబడును. ఆ చక్రమున జనన మరణ ములు అశేషముగ నుండును. అట్టివారు “నన్ను" అనగా సత్యమును పొందలేరు అనుటలో ఆశ్చర్య మేమున్నది!
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
25 Sep 2021
No comments:
Post a Comment