వివేక చూడామణి - 134 / Viveka Chudamani - 134



🌹. వివేక చూడామణి - 134 / Viveka Chudamani - 134🌹

✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍀. 27. విముక్తి - 7 🍀

440. ఎవడు ఈ శరీరము యొక్క సుఖాలకు, దుఃఖాలకు, మంచి చెడులకు సమానముగా ఉంటాడో అతడు విముక్తిని పొందినవాడు.

441. సన్యాసులు తమకు ఎవరైన లౌకిక వస్తువులను సమకూర్చిన వాటిని సముద్రము నదులను తనలో కలుపుకొన్నట్లు ఆ వస్తువులను చూస్తారు. అనగా పట్టించుకోరు. ఎందువలనంటే వారు తాను బ్రహ్మముతో సమానులుగా భావించి, వాటిని పట్టించుకోరు. వారే విముక్తి పొందినవారు.

442. ఎవడైతే సత్యాన్ని గ్రహిస్తాడో, తానే బ్రహ్మమని భావిస్తాడో వాడు భౌతిక వస్తువులతో ఎట్టి బంధములు పెంచుకోడు వాడే విముక్తుడు. అట్టి బంధమున్నచో అతడు బ్రహ్మమును తెలుసుకొన్నవాడు కాదు. అట్టి వారు తన ఇంద్రియాలను బయటకు మళ్ళించినవాడవుతాడు. వాడు విముక్తుడు కాదు.

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


🌹 VIVEKA CHUDAMANI - 134 🌹

✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda

📚 Prasad Bharadwaj

🌻 27. Redemption - 7 🌻


440. He who feels just the same when his body is either worshipped by the good or tormented by the wicked, is known as a man liberated-in-life.

441. The Sannyasin in whom the sense-objects directed by others are engulfed like flowing rivers in the sea and produce no change, owing to his identity with the Existence Absolute, is indeed liberated.

442. For one who has realised the Truth of Brahman, there is no more attachment to the sense-objects as before: If there is, that man has not realised his identity with Brahman, but is one whose senses are outgoing in their tendency.

Continues....

🌹 🌹 🌹 🌹 🌹


25 Sep 2021

No comments:

Post a Comment