రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 32
🌻. సప్తర్షుల రాక - 1 🌻
బ్రహ్మిట్లు పలికెను (1).
బ్రాహ్మణుని మాటలను వినిన మేన శోకముచే ఎర్రబడిన కన్నులు గలదై దుఃఖించు చున్న హృదయముతో హిమవంతుని ఉద్దేశించి ఇట్లు పలికెను (1).
మేన ఇట్లు పలికెను-
ఓ పర్వతరాజా! పరిణామమునందు సుఖమును కలిగించే నా మాటను వినుము. శివభక్తులనందరినీ అడిగి తెలుసుకొనుము. ఈ బ్రాహ్మణుడు చెప్పినది ఏమి? (2) ఈ వైష్ణవ బ్రాహ్మణుడు శివుని నిందించినాడు. ఓ పర్వత రాజా! ఆ నిందను విన్న నా మనస్సు మిక్కిలి నిరాశను పొందియున్నది (3). ఓ శైలరాజా! నేను మంచి లక్షణములతో గూడియున్న నా కుమార్తెను చెడు రూపము, శీలము గల ఆ రుద్రునకు ఈయను (4). నీవు నా మాటను విననిచో నేను నిస్సందేహముగా మరణించెదను. వెంటనే ఇంటిని విడిచి పెట్టెదను. లేదా, విషమును మ్రింగెదను (5).
అమ్మాయిని త్రాటితో మెడకు కట్టుకొని దట్టమైన అడవికిపోయెదను. లేదా మహాసముద్రములో ముంచెదను. కాని అమ్మాయిని వానికి ఈయను (6). ఇట్లు పలికి మేన వెంటనే దుఃఖముతో కోప గృహమునకు వెళ్లి ఆభరణములను వీడి ఏడుస్తూ నేలపై పరుండెను (7). ఓ కుమారా! ఇంతలో విరహముచే దుఃఖితమైన మనస్సు గల శంభుడు వెంటనే సప్తర్షులను స్మరించెను (8). శంభుడు స్మరించినంతనే అపర కల్ప వృక్షముల వంటి ఆ ఋషులందరూ మరుక్షణంలో అచటకు స్వయముగా విచ్చేసిరి (9).
మరియు అపరసిద్ధివలె నున్న అరుంధతి కూడ వచ్చెను. సూర్యునివలె విరాజిల్లుచున్న వారిని చూచి శివుడు తన జపమును ఆపెను (10). ఓ మహర్షీ! తపశ్శాలురగు ఆ ఋషులుశ్రేష్ఠుడగు శివుని యెదుల నిలబడి ఆయనకు నమస్కరించి స్తుతించి కృతార్థులమైతిమని భావించిరి (11). పిమ్మట ఆశ్చర్యచకితులైన ఆ ఋషులు లోకవందితుడగు శివుని మరల నమస్కరించిచేతులు జోడించి ఇట్లు పలికిరి (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
25 Sep 2021
No comments:
Post a Comment