మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 86



🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 86 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
సంకలనము : వేణుమాధవ్

📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. చేయవలసినది- చేయదలచినది - 2 🌻


ఇతర దేశాలలో వేదాధ్యయనం చేస్తూన్న వారు కొన్ని లక్షల మంది ఉన్నారు‌ ఏదో ఒక రకంగా ప్రొద్దున్నే రోజూ కాస్సేపు గుణగుణలాడి దేవుని దగ్గర సణిగినట్లుగా చేసి ఆఫీసుకి పోయినట్లుగా కాక వారు చాలా నిష్ఠగా చేస్తూ ఉన్నారు‌. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం గాయత్రి మంత్రం ప్రపంచ శాంతికై చేస్తూన్న వాళ్ళు ఉన్నారు.

ప్రపంచ శాంతికై, ఒక దేశానికి మరొక దేశానికి మధ్య యుద్ధం రాకుండా ఉండటం కొరకు, ప్రపంచంలోని మానవజాతి శాంతిగా ఉండాలి, పరస్పరం ఒకరికొకరు సమన్వయంతో ఉండాలి అనే దృష్టితో అహోరాత్రాలు నమకచమకాలు చేస్తూన్నవారు, ప్యారిస్ లో, లండను లో, కొన్ని వేల మంది ఇప్పటికి 6 సంవత్సరాల నుండి చేస్తున్నారు‌ (1980-82 నాటికి) అఖండమైన నామజపం కూడా ఇప్పుడు చెప్పిన దేశాలలోను మరియు న్యూయార్కులోను కొన్ని వేల మంది ఉన్నారు. ఈ విధంగా అఖండ నామజపం కూడా (24 గంటలు) 6 సంవత్సరాల నుండి నడుస్తున్నది.

ఇదంతా దేనికండీ అనగా ప్రపంచశాంతికై ఈ మహా యజ్ఞ నిర్వహణ జరుగుతోంది. అయితే ఇంతగా మనం భారతదేశంలో మనం చేస్తున్నమా? మనం మళ్ళీ వాళ్ళను (పాశ్చాత్యులను) చూసి నేర్చుకొనే రోజులు వస్తున్నాయి.

Masters బ్రహ్మ విద్య అందరికీ అర్థమయ్యేటట్లు చేయటం కోసం, Madam Blavetsky అనే ఆమె ద్వారా "గుప్త విద్య" (Secret Doctrine) అను దానిని సరహస్యంగా ప్రయోగోపసంహార పూర్వకంగా ఇచ్చారు.

అటుపైన 20వ శతాబ్దిలో 1934-35 సంవత్సరాల నుండి అఖండంగా ఒక 35 సంవత్సరాలు ఏలిస్ ఏ బెయిలీ అను ఆమె ద్వారా 24 సంపుటాలుగా బ్రహ్మవిద్య మళ్ళీ ప్రసాదింపబడినది‌.

ఇతర దేశాలను ఈ విషయమున గమనించినచో, ఈ గ్రంథముల అధ్యయనము అఖండ బ్రహ్మ విద్యా పారీణత తత్వపరిషత్తులు, గోష్ఠులు మొదలయినవి ఇంగ్లండ్, ఫ్రాన్స్, బెల్జియం, స్విట్జర్లాండ్, హాలండ్, నెదర్లాండ్స్ లోని ఇతర దేశాలలో మనకు చక్కగా కనిపిస్తాయి.

ఏ దేశానికి వెళ్లినా, బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తున్న వాళ్ళు భగవద్గీతను పారాయణం చేస్తూన్న వాళ్ళు, వేదం ఉపనిషత్తులు అనుష్ఠానం చేస్తున్న వాళ్ళు కనిపిస్తారు...


....✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


25 Sep 2021

No comments:

Post a Comment