మైత్రేయ మహర్షి బోధనలు - 14


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 14 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 9. సౌకర్యము - సంస్కారము - 2 🌻


సంస్కారమును పెంచుట సంఘమున విద్యావేత్తల బాధ్యత. విద్యకు, అధ్యాపకులకు గుర్తింపు, రాణింపు లేని సంఘమున సంస్కార ములు పెరుగవు. సంస్కరించునదే విద్య. సంస్కారములు పెరుగక కేవలము చదువు పెంచు కున్నచో దానవ సృష్టి జరుగును. గత వంద సంవత్సరములుగ ఈ విషయమున చాల అశ్రద్ధ జరిగినది. ప్రస్తుతపు చదువులు, సౌకర్యములు మానవుని బాధ్యతా రహితుని చేయుటకే తోడ్పడుచున్నవి. అంతరాత్మ ప్రబోధమును అంతకంతకు అడుగంటించు చున్నది. బాధ్యతపడుట దైవ సామ్రాజ్యమున మొదటి మెట్టు. బాధ్యతా రహితత్వము దానవ సామ్రాజ్యమునకు ముఖద్వారము.

ఒకరికన్న ఒకరు వేగమును, ఒకరికన్న మరియొకరు దూరముగను, ఎత్తుగను, ప్రయాణములు చేయుటకు పోటీపడు మనస్తత్వము హాస్యాస్పదము. ఇవి కుస్తీపట్ల వంటివి. ఒకరి యందు ఒకరికి గల బాధ్యతలను మరపింప గలవు. విద్యా విధానమును చక్కగ సంస్కరించు కొన్నచో, పరస్పర సహకారమును పెంపొందించు కొన్నచో, బాధ్యత యందు మానవ సంఘములు మేల్కాంచినచో ఈ అధునాతన సౌకర్యములు జాతి కంతయు మేలు చేయగలవు. నిరుపేద దేశములను, దురదృష్ట ప్రాంతములను, అపాయమునకు గురి కాబడిన జన సమూహములను తృటి కాలములో రక్షించుటకు ఈ సౌకర్యములు చాల ఉపయోగ పడగలవు. సత్సంకల్పమే ప్రధాన కారణముగ ఆధునీకరణము జరుగుచుండ వలెను.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


18 Oct 2021

No comments:

Post a Comment