నిర్మల ధ్యానాలు - ఓషో - 81


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 81 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. ఈ క్షణం నించీ నీ దృక్పథమిది కావాలి. నువ్వు దైవాంశవి. అందువల్లే సమస్త విశ్వానివి. ఆ దర్శనం నించీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వీలవుతుంది. పైకి వెళ్ళే వీలు లేకుంటే మనిషి పరివర్తనని విస్మరిస్తాడు. పరిణామాన్ని మరచిపోతాడు. 🍀


సైన్సు జనాలకు చెబుతూ పోతుంది. మనం జంతువులం మినహా మరేం కాము. మనం జంతువుల్లో ఒక రకాలం! మూడు వందల ఏళ్ళ నించీ వాళ్ళు ఈ అభిప్రాయాన్ని ప్రచారం చేస్తున్నారు. ఆ అభిప్రాయం మన రక్తమాంసాల్లోకి, ఎముకల్లోకి బాగా ఎక్కిపోయింది. మనం జంతువులం కాము. నిజానికి జంతువులు కూడా జంతువులు కావు. మనం దైవికమయిన వాళ్ళం. అట్లాగే జంతువులయినా, యిట్లా మనిషి దైవికమయిన వాడని మతం చెబుతుంది.

మనమీ విశ్వానికి సంబంధించిన వాళ్ళం. సైన్సు ప్రతిదాన్ని కిందకు లాగింది. అల్పస్థాయికి దిగజార్చింది. ఒక తామరపువ్వును నువ్వు సైంటిస్టు కిస్తే అది బురద మట్టి మినహా మరేం కాదు. ఎందుకంటే అది బురద నించీ పుట్టింది అంటాడు. అదే నువ్వు ఒక మార్మికుడి దగ్గరికి బురద మట్టిని తీసుకెళితే అతను ఆందోళన పడకు. దీన్లో వేల పద్మాలు దాగున్నాయి. కారణం పద్మాలు బురద మట్టి నించీ వస్తాయి అంటాడు.

మతం ఉన్నతోన్నత స్థానంలోకి చూసి నిర్ణయాలు చేస్తుంది. సైన్సు అత్యల్ప స్థాయిలోకి చూసి నిర్ణయాలు చేస్తుంది. ఈ క్షణం నించీ నీ దృక్పథమిది కావాలి. నువ్వు దైవాంశవి. అందువల్లే సమస్త విశ్వానివి. ఆ దర్శనం నించీ నువ్వు అత్యున్నత స్థాయికి వెళ్ళడం వీలవుతుంది. అట్లా అత్యున్నత దశ లేకుంటే, పైకి వెళ్ళే వీలు లేకుంటే మనిషి పరివర్తనని విస్మరిస్తాడు. పరిణామాన్ని మరచిపోతాడు. అక్కడ ఎదుగుదలకు అవకాశం వుంది. దానికి బుద్ధులే వుదాహరణలు. తగిన దృష్టాంతాలు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


18 Oct 2021

No comments:

Post a Comment