శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 313-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 313-2🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀
🌻 313. 'రమా' -2🌻
శ్రీకృష్ణుడు “సానపట్టిన భోగి, రాజయోగి”, అని అన్నమాచార్యుడు కీర్తించినాడు. యోగమునకు భోగము అడ్డురాదు. రాజయోగమున భోగ మనుమతింపబడినది. యోగము నివృత్తి మార్గము కాదు గనుక సౌకర్యము లుండవచ్చునని మాస్టరు సి.వి.వి. గారు బోధించినారు. జనకాది రాజర్షులందరూ కూడ వారి జీవితమున దివ్యభోగము ననుభ వించిన వారే. తెనాలి రామకృష్ణుడు, శ్రీనాథ మహాకవి, శ్రీకృష్ణదేవ రాయలు ఇటీవలి కాలమున విద్యా సంపదలను పరిపూర్ణముగ అనుభవించి దివ్యపథమున నిలచినారు. ఇట్టి జీవితము లన్నియూ కూడ లక్ష్మీ సరస్వతుల సంయోగమే. (గృహము నందు అత్తాకోడలు అన్యోన్య భావము కలిగియున్నచో ఆ గృహము స్వర్గమే కదా!)
విద్యావంతులకు సంపదను గూర్చి హీనభావ ముండుట తగని పని. అట్లని సంపదల వెంట బడుట కూడ తగని పనియే. జీవుల హృదయములను రంజింపజేయుచు విద్య ఆధారముగ యోగముగ యోగమున నిలచిన వారికి సంపదలు కూడ దరి చేరును. యోగ శాస్త్రమున సత్సంపద చేరుటకు ఒక నుపాయము తెలుపబడినది. దొంగబుద్ధి, లేకితనము లేనివాని వద్దకు సంపదలు నడచి వచ్చునని పతంజలి మహర్షి నిర్ధారించినాడు. రమ పథము ఆనందదాయకము. దైవ యోగముతోపాటు, ధనకీర్తి యోగ ముండుట అమ్మ వైభవమే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 313-2 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻
🌻 313. Ramā रमा (313)-2 🌻
Ramā means Lakṣmī, (consort of Viṣṇu) the goddess of wealth. She is in the form of Lakṣmī and bestows wealth on Her devotees. The wealth indicates both materialistic wealth and spiritual wealth. Nāma-s 313, 314 and 315 together form kāmakalā bīja ‘ īm ’ (ईँ). This nāma gives the alphabet ‘Ī’ (ई).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
18 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment