మైత్రేయ మహర్షి బోధనలు - 18
🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 18 🌹
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 11. ధర్మము - దైవము - 1 🌻
ధర్మసూత్రముల ననుసరించుచు కార్యముల నొనర్చుట ప్రస్తుత కాలమున కష్టతరమని భావించుట కొంచెపు బుద్ధి. ధర్మము యందు విశ్వాసము, ప్రీతి, గౌరవము కలిగియున్న వానిపై కాలము తన ప్రభావమును అంతగా చూపదు. కాలానుసారముగా నడుచువాడు సాధకుడు. ధర్మము దేశ కాలములను బట్టి మారునది కాదు. ధర్మము నాశ్రయించిన వాడు దైవము నాశ్రయించినట్లే. కాలము అతనికి సహకరించును కాని, నశింపచేయదు. ఇట్లునడుచు వానికి జీవితమున కష్టములు నష్టములు ఉండునని మేము చెప్పుటలేదు.
ధర్మము నాశ్రయించుట వలన ఏర్పడిన ఠీవితో నతడు సన్నివేశములకు తలవంచక ముందుకు సాగిపోగలడు. ఒడిదుడుకులు కాలము నుద్భవించు సన్నివేశమునకేకాని తనకు కాదని క్రమశః తెలుసు కొనును. ధర్మమనెడు గుంజకు కట్టుబడినవాడు గాలికి, వానకు, వరదకు కొట్టకొనిపోడు. అతడే సాధకుడు. ఇతరులు కాలక్రమమున నశింతురు. వరద, వాన, గాలి వారిని పీడించగలవు. అధర్మమునే ధర్మమని భావించుచు కొనసాగినచో పురోగతి యుండదు. 'ధర్మము వలన లాభముండదు. పనులు సాగవు' అని భావించుట పిల్ల బుద్ధి.
సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
26 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment