నిర్మల ధ్యానాలు - ఓషో - 85
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 85 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. ప్రతి మనిషీ ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తే. అదే దైవత్వం. విశ్వం ప్రదర్శించిన దయ అది. అదే వ్యక్తిని అసాధారుణ్ణి చేసింది. ధ్యానమన్నది ఉపరితలానికి కేంద్రానికి మధ్య వారధి. 🍀
ధ్యానమన్నది నీ స్వీయకేంద్రంలో అడుగు మోపే కళ. మనం ఉపరితలంలో వుంటాం. ఉపరితలం నించీ కేంద్రంలోకి దూకడమెట్లా ? అదే సమస్త కళ. నేను దాన్ని సైన్సు అనడం కన్నా కళ అంటాను. సైన్సు లెక్కలకు సంబంధించింది. కల అన్నది కళాత్మకమైంది. మరింత కవితాత్మకమైంది. సైన్సులో అంచనాలుంటాయి. అది విశ్వజనీన సూత్రాల్ని అనుసరిస్తుంది. కళ్లకు కూడా అంచనాలుంటాయి. ప్రతి మనిషికి తనకే ప్రత్యేకమైన కేంద్రాన్ని చేరుతాడు.
ప్రతి మనిషీ ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తే. అదే దైవత్వం, విశ్వం ప్రదర్శించిన దయ అది. అదే వ్యక్తిని అసాధారుణ్ణి చేసింది. ధ్యానమన్నది ఉపరితలానికి కేంద్రానికి మధ్య వారధి. బాహ్యనికి, అంతరంగానికి మధ్య వారధి, మనసుకు, మనసులేనితనానికి, పదార్థానికి చైతన్యానికి మధ్య వారధి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
26 Oct 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment