26-OCTOBER-2021 MESSAGES

1) 🌹. నిత్య పంచాంగము Daily Panchangam 25 మంగళవారం, ఆక్టోబర్ 2021 🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 104 / Bhagavad-Gita - 104- 2-57🌹*
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 501 / Vishnu Sahasranama Contemplation - 501🌹
4) 🌹 DAILY WISDOM - 179🌹 
5) 🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 18🌹
6) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 84🌹
7) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-3 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-3 🌹
8) 🌹. పంచభూతాల ప్రాణశక్తి... 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శుభ మంగళవారం మిత్రులందరికీ 🌹*
*26, అక్టోబర్‌ 2021*
*మీకు ఈ రోజు అంతా కాలం అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*

*🍀. ఆంజనేయ శ్లోకాలు - 4 🍀*

అంజనానందం వీరం
జానకీ శోక నాశనం|
కపీషమక్ష హంతారం
వందే లంకాభయంకరం||

భావము:- అంజనాదేవి కుమార,జానకీ మాతా శోకాన్ని పోగొట్టినవాడా,వానరమూక రాజా, లంక రాజుకు భయం పుట్టించిన వాడా, రావణుని రెండవ కుమారుడైన అక్షను సం హరించిన ఆంజనేయ నీకు వందనాలు.

🌻 🌻 🌻 🌻 🌻

విక్రమ సంవత్సరం: 2078 ఆనంద
శఖ సంవత్సరం: 1943 ప్లవ, 
దక్షిణాయణం, శరద్‌ ఋతువు, అశ్వీజ మాసం
తిథి: కృష్ణ పంచమి 08:25:48 వరకు తదుపరి కృష్ణ షష్టి
పక్షం: కృష్ణ-పక్ష
నక్షత్రం: ఆర్ద్ర 31:09:21 వరకు తదుపరి పునర్వసు
యోగం: శివ 25:31:32 వరకు తదుపరి సిధ్ధ
 కరణం: తైతిల 08:23:48 వరకు
వర్జ్యం: 13:37:18 - 15:25:10
దుర్ముహూర్తం: 08:31:18 - 09:17:39
రాహు కాలం: 14:53:42 - 16:20:37
గుళిక కాలం: 11:59:53 - 13:26:48
యమ గండం: 09:06:04 - 10:32:58
అభిజిత్ ముహూర్తం: 11:36 - 12:22
అమృత కాలం: 19:54:50 - 21:42:42
పండుగలు :
సూర్యోదయం: 06:12:14, సూర్యాస్తమయం: 17:47:32
వైదిక సూర్యోదయం: 06:15:52
వైదిక సూర్యాస్తమయం: 17:43:53
చంద్రోదయం: 22:02:47
చంద్రాస్తమయం: 10:50:07
సూర్య రాశి: తుల, చంద్ర రాశి: జెమిని
ఆనందాదియోగం: చర యోగం - దుర్వార్త శ్రవణం 31:09:21 
వరకు తదుపరి స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ
నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా
యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా
తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం
తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ 
విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.
🌹🌹🌹🌹🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీమద్భగవద్గీత -104 / Bhagavad-Gita - 104 🌹*
✍️. స్వామి భక్తి వేదాంత శ్రీ ప్రభుపాద
📚. ప్రసాద్ భరద్వాజ

*🌴. ద్వితీయ అధ్యాయము - సాంఖ్య యోగము - 57 🌴*

57. య: సర్వత్రానభి స్నేహస్తత్తత్ప్రాప్య శుభాశుభమ్ |
నాభినన్దతి న ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్టితా ||

🌷. తాత్పర్యం :
*భౌతిక జగము నందు ప్రాప్తించిన మంచి, చెడులను ప్రశంసించుట గాని, ద్వేషించుట గాని చేయక వాటిచే ప్రభావితుడు కాని వాడు సంపూర్ణజ్ఞానము నందు స్థిరుడై నిలుచును.*

🌷. భాష్యము :
భౌతికజగమునందు సదా మంచి, చెడులలో ఏదియోనొకటి కలుగుచునే యుండును. అట్టి ఒడుదుడుకులచే కలతనొందక మంచిచెడులచే ప్రభావితుడు కానివాడు కృష్ణభక్తిరసభావనలో స్థిరుడైనవాడిని అవగతము చేసికొనవచ్చును. లోకము ద్వంద్వభరితము కావున భౌతికజగమున ఉన్నంతకాలము మంచి, చెడులలో ఏదియో నొకటి కలుగుచునే ఉండును.

కాని కృష్ణభక్తిభావన యందు స్థిరుడైనట్టివాడు నిర్గుణుడైన కృష్ణుని గుర్చియే సదా చింతించుచుండుట వలన అట్టి మంచి, చెడులచే ప్రభావితుడు కాడు. అట్టి కృష్ణభక్తిరసభావనయే సమాధి యని పిలువబడు సంపూర్ణ ఆధ్యాత్మికస్థితి యందు మనుజుని నెలకొల్పగలదు.
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹 Bhagavad-Gita as It is - 104 🌹*
✍️ Swami Bhakthi Vedantha Sri Prabhupada
📚 Prasad Bharadwaj

*🌴 Chapter 2 - Sankhya Yoga - 57 🌴*

57. yaḥ sarvatrāna bhisnehas tat tat prāpya śubhāśubham
nābhinandati na dveṣṭi tasya prajñā pratiṣṭhitā

🌷Translation :
*In the material world, one who is unaffected by whatever good or evil he may obtain, neither praising it nor despising it, is firmly fixed in perfect knowledge.*

🌷 Purport :
There is always some upheaval in the material world which may be good or evil. One who is not agitated by such material upheavals, who is unaffected by good and evil, is to be understood to be fixed in Kṛṣṇa consciousness. As long as one is in the material world there is always the possibility of good and evil because this world is full of duality. 

But one who is fixed in Kṛṣṇa consciousness is not affected by good and evil, because he is simply concerned with Kṛṣṇa, who is all-good absolute. Such consciousness in Kṛṣṇa situates one in a perfect transcendental position called, technically, samādhi.
🌹 🌹 🌹 🌹 🌹
#భగవద్గీత #BhagavadGita #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. భగవద్గీత BhagavadGita Telegram, FB Groups 🌹
https://t.me/bhagavadgeethaa/
www.facebook.com/groups/bhagavadgeethaa/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 501 / Vishnu Sahasranama Contemplation - 501🌹*
📚. ప్రసాద్ భరద్వాజ

*🌻 501. కపీంద్రః, कपींद्रः, Kapīndraḥ 🌻*

*ఓం కపీన్ద్రాయ నమః | ॐ कपीन्द्राय नमः | OM Kapīndrāya namaḥ*

కపీంద్రః, कपींद्रः, Kapīndraḥ

కపిర్వరాహ ఇంద్రశ్చ వారాహం వపురాస్థితః ।
కపీనాం వానరాణాం సుకపింద్రో రాఘవోఽపి వా ॥

ఈతడు కపియును ఇంద్రుడును. కపి అనగా వరాహము. వరాహ రూపము ధరించిన భగవానుడు 'కపీంద్రుడు' అనబడును. లేదా వానరులకు ఇంద్రుడు అనగా శ్రీరాముడు అనికూడా చెప్పదగును.

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 501🌹*
📚. Prasad Bharadwaj

*🌻501. Kapīndraḥ🌻*

*OM Kapīndrāya namaḥ*

कपिर्वराह इंद्रश्च वाराहं वपुरास्थितः ।
कपीनां वानराणां सुकपिंद्रो राघवोऽपि वा ॥

Kapirvarāha iṃdraśca vārāhaṃ vapurāsthitaḥ,
Kapīnāṃ vānarāṇāṃ sukapiṃdro rāghavo’pi vā.

Kapi means varāha or wild boar. Indra means superior. Kapīndraḥ is the great varāha; an incarnation of Lord Viṣṇu. Or Kapi can also mean a primate. Kapīndra, hence, can be interpreted as lord of the monkeys or Lord Śrī Rāma.

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्यः पुरातनः ।
शरीरभूतभृद् भोक्ता कपीन्द्रो भूरिदक्षिणः ॥ ५३ ॥

ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః ।
శరీరభూతభృద్ భోక్తా కపీన్ద్రో భూరిదక్షిణః ॥ 53 ॥

Uttaro gopatirgoptā jñānagamyaḥ purātanaḥ,
Śarīrabhūtabhr‌d bhoktā kapīndro bhūridakṣiṇaḥ ॥ 53 ॥

 Continues....
🌹 🌹 🌹 🌹🌹
#విష్ణుసహస్రనామతత్వవిచారణ #VishnuSahasranamacontemplation #విష్ణుసహస్రనామములు #VishnuSahasranama #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/vishnusahasranaam
www.facebook.com/groups/vishnusahasranaam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹 DAILY WISDOM - 179 🌹*
*🍀 📖 In the Light of Wisdom 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 27. The Wonder Yet Remains 🌻*

How many stars and how many planets are in the heavens? We cannot count them, and how is it that they are all so systematically and mathematically arranged with relative pull upon one another? The wonder remains as to how all this system could have been conceived, if at all there were a mind which could have originally set these bodies in such a harmonious relationship with one another. If there is anyone who could have done this, there could then be no greater wonder than the mind of that person. 

Well, to come to the point, it was discovered that the heavenly bodies are not scattered as children might imagine. There is an unknown power connecting these bodies, and this power is the explanation for the movements of the stars in the universe. But our explanation is not complete here. The wonder yet remains. What is this gravitational pull, and what have we to do with it? How are we to explain the universe for our purposes, and how are we going to understand nature? Unless there is a thorough understanding, there will be no satisfaction.

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#DailyWisdom #SwamiKrishnananda
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. Daily satsang Wisdom 🌹 
www.facebook.com/groups/dailysatsangwisdom/
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
www.facebook.com/groups/chaitanyavijnanam/ 
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 18 🌹* 
✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
 సేకరణ : ప్రసాద్ భరద్వాజ 

*🌻 11. ధర్మము - దైవము - 1 🌻*

ధర్మసూత్రముల ననుసరించుచు కార్యముల నొనర్చుట ప్రస్తుత కాలమున కష్టతరమని భావించుట కొంచెపు బుద్ధి. ధర్మము యందు విశ్వాసము, ప్రీతి, గౌరవము కలిగియున్న వానిపై కాలము తన ప్రభావమును అంతగా చూపదు. కాలానుసారముగా నడుచువాడు సాధకుడు. ధర్మము దేశ కాలములను బట్టి మారునది కాదు. ధర్మము నాశ్రయించిన వాడు దైవము నాశ్రయించినట్లే. కాలము అతనికి సహకరించును కాని, నశింపచేయదు. ఇట్లునడుచు వానికి జీవితమున కష్టములు నష్టములు ఉండునని మేము చెప్పుటలేదు. 

ధర్మము నాశ్రయించుట వలన ఏర్పడిన ఠీవితో నతడు సన్నివేశములకు తలవంచక ముందుకు సాగిపోగలడు. ఒడిదుడుకులు కాలము నుద్భవించు సన్నివేశమునకేకాని తనకు కాదని క్రమశః తెలుసు కొనును. ధర్మమనెడు గుంజకు కట్టుబడినవాడు గాలికి, వానకు, వరదకు కొట్టకొనిపోడు. అతడే సాధకుడు. ఇతరులు కాలక్రమమున నశింతురు. వరద, వాన, గాలి వారిని పీడించగలవు. అధర్మమునే ధర్మమని భావించుచు కొనసాగినచో పురోగతి యుండదు. 'ధర్మము వలన లాభముండదు. పనులు సాగవు' అని భావించుట పిల్ల బుద్ధి. 

సశేషం.....
🌹 🌹 🌹 🌹 🌹
#మైత్రేయమహర్షిబోధనలు #MaitreyaMaharshi #సద్గురుపార్వతీకుమార్ #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share
భారతీయ మహర్షుల బోధనలు Maharshula Wisdom 
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 85 🌹*
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

*🍀. ప్రతి మనిషీ ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తే. అదే దైవత్వం. విశ్వం ప్రదర్శించిన దయ అది. అదే వ్యక్తిని అసాధారుణ్ణి చేసింది. ధ్యానమన్నది ఉపరితలానికి కేంద్రానికి మధ్య వారధి. 🍀*

ధ్యానమన్నది నీ స్వీయకేంద్రంలో అడుగు మోపే కళ. మనం ఉపరితలంలో వుంటాం. ఉపరితలం నించీ కేంద్రంలోకి దూకడమెట్లా ? అదే సమస్త కళ. నేను దాన్ని సైన్సు అనడం కన్నా కళ అంటాను. సైన్సు లెక్కలకు సంబంధించింది. కల అన్నది కళాత్మకమైంది. మరింత కవితాత్మకమైంది. సైన్సులో అంచనాలుంటాయి. అది విశ్వజనీన సూత్రాల్ని అనుసరిస్తుంది. కళ్లకు కూడా అంచనాలుంటాయి. ప్రతి మనిషికి తనకే ప్రత్యేకమైన కేంద్రాన్ని చేరుతాడు. 

ప్రతి మనిషీ ఎవరికి వారు ప్రత్యేకమైన వ్యక్తే. అదే దైవత్వం, విశ్వం ప్రదర్శించిన దయ అది. అదే వ్యక్తిని అసాధారుణ్ణి చేసింది. ధ్యానమన్నది ఉపరితలానికి కేంద్రానికి మధ్య వారధి. బాహ్యనికి, అంతరంగానికి మధ్య వారధి, మనసుకు, మనసులేనితనానికి, పదార్థానికి చైతన్యానికి మధ్య వారధి.

సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోబోధనలు #OshoDiscourse #OshoDailyMeditations #ఓషోనిర్మలధ్యానములు #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹 ఓషో బోధనలు - Osho Teachings 🌹
https://t.me/ChaitanyaVijnanam 
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://pyramidbook.in/Chaitanyavijnanam

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 314-4 / Sri Lalitha Chaitanya Vijnanam - 314-4 🌹*
*సహస్ర నామముల తత్వ విచారణ*
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్ 
సేకరణ : ప్రసాద్ భరద్వాజ 
మూల మంత్రము : 
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*

*🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।*
*రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀*

*🌻 314-4. 'రాకేందువదనా' 🌻* 

చూచువాడు తా నున్నాను అని భావించుటకు ప్రాతిపదికయే శ్రీమాత యైనపుడు ప్రకృతి రహితమగు దానినేట్లు చూడగలడు? చూచువానియందు ప్రకృతి పురుషు లున్నారు. చూడగోరిన తత్త్వమునందు కూడ వారిరువురును ఏకమై యున్నారు. అంతయూ ప్రకృతియే అని భావించువారు ఎంత అజ్ఞానులో, ప్రకృతి కతీతమగు తత్త్వమును చేరెదనను వాడు కూడ అంత అజ్ఞానియే. సంకల్పమే ప్రకృతి యైనపుడు తత్త్వము చేరెద నను సంకల్పము ప్రకృతి కాదా! 

అట్లనుకొనుట అందలి రహస్య మేమనగ పదార్థమయమగు ప్రకృతి నుండి పరమార్థ మయమగు మూల ప్రకృతిని చేరెద ననుటయే బహిరావరణముల నుండి ప్రకృతి యొక్క దివ్యము, అమృతము అగు అంతరావరణలోనికి ప్రవేశించి మూలప్రకృతియై పరమేశ్వరుని అంటి యుండవచ్చును. 

ఇట్లు తిరోధానమున ఆత్మ మూలమును చేరుటకు రతి ప్రధానము. భక్తి ప్రాథమికమగు రతియే. దైవమునం దనురక్తిగ భక్తి మారినపుడు దివ్యరతి కలుగును. అపుడు అహర్నిశలు కలసి యుండుటకే ప్రయత్నము జరుగును. నిజమునకు కలసియే యున్నాడు. కావున కలిసియే వున్నాడని తెలియును. రాధాకృష్ణ తత్త్వమిదియే. అర్ధనారీశ్వర రూప మిదియే.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 314 🌹*
*1000 Names of Sri Lalitha Devi* 
✍️. Ravi Sarma 
📚. Prasad Bharadwaj

*🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya*
*Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻*

*🌻 314. Rākenduvadanā राकेन्दुवदना (314)-1 🌻*

Her face is compared to the full moon. Full moon is without blemishes. The full moon represents the dot (bindu) above the letter ‘Ī’ which gives rise to the bīja īṁ (ईं). At this stage the letter Ī (ई) has only a dot above it making it as īṁ (ईं), which is yet to transform as kāmakalā. 

Continues...
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
Join and Share 
🌹. శ్రీ లలితా దేవి చైతన్యము Sri Lalitha Devi Chatanyam 🌹
https://t.me/srilalithachaitanyavijnanam
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

🌹. పంచభూతాల ప్రాణశక్తి... 🌹
📚. ప్రసాద్ భరద్వాజ 

ఆయురారోగ్యాలు ఉంటేనే మనిషి జీవితాన్ని సఫలం చేసుకోగలడు. సిరిసంపదలు, పదవీ వైభవాలు, ఎన్ని ఉన్నా, వాటిని అనుభవించాలంటే మనిషికి ఆయువు ఉండాలి, ఆరోగ్యవంతుడయ్యీ ఉండాలి. ఈ దేహమనే యంత్రం దృఢంగా పదికాలాలపాటు సక్రమంగా పనిచేయాలంటే దేహాన్ని నడిపేది ప్రాణమని గ్రహించి, దాన్ని భద్రంగా కాపాడుకోవాలి. విద్యుత్తు ప్రసరణపైనే యంత్రం పనితీరు ఆధారపడినట్లు, ప్రాణంపైనే దేహం పనితీరు ఆధారపడి ఉంటుంది.

మనలోని చూపు, మాట, శ్వాస, వినికిడి, రక్తప్రసరణ వంటి అన్ని శారీరక కార్యకలాపాలకు కావలసిన శక్తి ప్రాణంనుంచే లభిస్తుంది. మనిషి నిద్రపోయినా ప్రాణం మెలకువగానే ఉండి, జీర్ణ శ్వాసక్రియలకు శక్తినిస్తుంది. మనసును కలల ప్రపంచంలోకి తీసుకుపోతుంది.

ఇంతటి దివ్యశక్తి కలిగిన ప్రాణం మనిషిలో ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది.. హృదయగుహలో పురీతత్‌ అనే నాడీమండలంలో ఆత్మనీడగా, ఆత్మను అనుసరించి, మనసుతో అనుసంధానమై, జ్యోతిరూపంగా ప్రాణం ఉంటుందంటాయి ఉపనిషత్తులు. సృష్టిలో అది రెండు మహాకార్యాలు నిర్వహిస్తుందంటుంది శాస్త్రం. సృష్టికి ఆధారమైన ఆకాశ, పృథివి, వాయువు, అగ్ని, జలం వంటి స్థూల పంచభూతాలను సూక్ష్మాంశాలైన ఇంద్రియ మనోబుద్ధులను సమైక్యపరచి, జీవసృష్టి చేయడం; వాటి మనుగడకు కావలసిన శక్తిని అందించడం. ఈ రెండు పనుల్లో భాగంగానే ప్రాణం శరీరధారణ, శ్వాసధారణ చేస్తుంది.

శరీరాన్ని అంటిపెట్టుకున్న ప్రాణం ఆ శరీరాన్ని కాపాడేందుకు విశ్వమంతా నిండిఉన్న మహాప్రాణంతో అనుక్షణం అనుసంధానమవుతుంది. ప్రకృతిలో సమృద్ధిగా దొరికే ప్రాణవాయువును శ్వాసరూపంలో గ్రహిస్తుంది. సూర్యుడి ప్రాణశక్తితో ఉత్పత్తి అయిన ఆహారాన్ని జీర్ణంచేసి, దేహాన్ని పరిపుష్టీకరిస్తుంది. ఈ ప్రక్రియలన్నీ సజావుగా సాగేందుకు వీలుగా ప్రాణం తనను తాను అయిదు విభాగాలు చేసుకుంటుంది. ఏ రంగూ లేని సూర్యకిరణం పట్టకంలో ప్రవేశించి వివిధ వర్ణాలుగా వెలువడినట్లు ప్రాణం శరీరాన్ని దాలిస్తే, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన అనే పంచవాయువులుగా మారుతుంది. వీటినే వాయుపంచకమని, పంచప్రాణాలని అంటారు.

వాయుపంచకంలో మొదటిదైన మూలప్రాణాన్ని ఊపిరిగా చెబుతారు. అది మనిషి హృదయస్థానంలో ఉండి చూపు, మాట, శ్వాస, వినికిడి పనులకు సహకరిస్తుంది. అపానవాయువు శరీరంలోని అధోభాగంలో సంచరిస్తూ, మలమూత్రవీర్య విసర్జనక్రియలు సాఫీగా జరిగేలా చూస్తుంది. శారీరక సమతౌల్యాన్ని కాపాడుతుంది. వ్యానవాయువు వేలకొద్దీ నాడుల్లో సంచరిస్తూ, ప్రాణశక్తిని శరీరమంతా నింపుతుంది. ఉదానవాయువు కంఠస్థానంలో ఉండి, మనసును గాఢనిద్రలోకి దించి, సేదదీర్చి శాంతిని అందిస్తుంది. సమానవాయువు నాభిస్థానంలో ఉండి, జీర్ణక్రియకు జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి, అన్నసారాన్ని శరీరానికి అందిస్తుంది.

శరీరంలో ప్రాణశక్తి సమంగా ప్రసరిస్తేనే ఆరోగ్యం, లేకపోతే అనారోగ్యం. ప్రాణశక్తి క్షీణిస్తే మరణం తప్పదు. దీర్ఘకాలం మనిషి ఆయురారోగ్యాలతో ఉండాలంటే, ప్రాణశక్తిని పెంచుకోవాలి. ప్రాణచలనాన్ని నిరోధిస్తేనే ఇది సాధ్యం. శ్వాసను నియంత్రిస్తేనే ప్రాణచలనాన్ని నిరోధించగలం. ఈ క్రియను బోధించేదే ప్రాణాయామం. దీర్ఘశ్వాసను తీసుకోవడం, దాన్ని బంధించడం, తిరిగి నెమ్మదిగా వదలడం అనే ప్రక్రియనే ప్రాణాయామమంటారు. పూజలు యజ్ఞయాగాదుల ఆరంభంలోను, ధ్యానయోగ ప్రక్రియల్లోను దీన్ని తప్పక ఆచరిస్తారు. మనిషికి ప్రాణాయామం మూడు మహోపకారాలు చేస్తుంది. దీర్ఘాయువును ఆరోగ్యాన్ని ప్రసాదించడంతో పాటు, చిత్తచాంచల్యాన్ని నిరోధిస్తుంది. తపస్సు, ధ్యానాన్ని సిద్ధింపజేస్తుంది...

|| ఓం నమః శివాయ

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹 

No comments:

Post a Comment