వివేక చూడామణి - 153 / Viveka Chudamani - 153
🌹. వివేక చూడామణి - 153 / Viveka Chudamani - 153🌹
✍️ రచన : పేర్నేటి గంగాధర రావు
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍀. 31. ఆత్మ దర్శనం -8 🍀
502. నేను ఎల్లప్పుడు అలానే ఉంటాను. ఏ భాగములు లేవు. పనిలో ఉండుట, లేకుండుట అనేది ఏదీ లేదు. అది ఒకే విధముగా మార్పు లేకుండా స్థిరముగా ఆకాశము వలె శాశ్వతముగా ఎపుడు అలానే ఉంటాను.
503. నాకు మంచి చెడులు ఎలా ఉంటాయి? నాకు శరీర భాగాలు లేవు. మనస్సు లేదు. మార్పు లేదు. ఆకారము లేదు. నేను స్వయం బ్రహ్మానంద స్థితిలో ఎల్లపుడు ఉంటూ దేనికి అంటని వాడను.
504. వేడి కాని, చల్లదనము కాని, నన్ను తాకినప్పటికి, నా శరీరము యొక్క నీడ పై ఎట్టి ప్రభావము చూపదు. అది నీడ కంటే వేరుగా ఉంటుంది.
505. వస్తువు యొక్క గుణ గణాలను గమనించినపుడు, ఆ గమనించిన వానిపై ఆ గుణాల ప్రభావము అంటదు. అది మార్పు చెందనిది. అన్నింటికి వేరుగా ఉంటుంది. ఎలానంటే గది యొక్క లక్షణములు, గదిలోని దీపమునకు అంటవు. కాని దీపము యొక్క కాంతి వస్తువులను ప్రతిఫలింపజేస్తుంది.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 VIVEKA CHUDAMANI - 153 🌹
✍️ Sri Adi Shankaracharya
Swami Madhavananda
📚 Prasad Bharadwaj
🌻 31. Soul Realisation - 8 🌻
502. How can there be merits and demerits for me, who am without organs, without mind, changeless, and formless – who am the realisation of Bliss Absolute ? The Shruti also mentions this in the passage "Not touched", etc.
503. If heat or cold, or good or evil, happens to touch the shadow of a man’s body, it affects not in the least the man himself, who is distinct from the shadow.
504. The properties of things observed do not affect the Witness, which is distinct from the, changeless and indifferent – as the properties of a room (do not affect) the lamp (that illumines it).
505. As the sun is a mere witness of men’s actions, as fire burns everything without distinction, and as the rope is related to a thing superimposed on it, so am I, the unchangeable Self, the Intelligence Absolute.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
17 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment