గీతోపనిషత్తు -277


🌹. గీతోపనిషత్తు -277 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము 📚

శ్లోకము 13-1

🍀 13-1. ఈశ్వర తత్వము - ఆశామోహములను దరిరానీయకుండ కోరికల వెంటపడి, పతనము కాకుండ కర్తవ్య కర్మలను నిర్వర్తించు మానవులు క్రమముగ సత్వగుణమున స్థిరపడుదురు. ఆశా మోహములకు గురియైన వారు రజస్తమస్సులలో చిక్కుకొని, అజ్ఞాన వశమున అసురులగు చున్నారు. కర్తవ్య కర్మను నిర్వర్తించు వారు సత్వము నందే స్థిరపడుట వలన సృష్టి ధర్మమును గ్రహించి, అహింస-సత్యము-బ్రహ్మచర్యము-ధర్మాచరణము వంటి సత్వ గుణముల ద్వారా సద్గుణోపేతులై మహాత్ములగుచున్నారు. అట్టి మహాత్ములకు అంతటను నిండియున్న ఈశ్వర దర్శనము క్రమముగ సాధ్యపడును. సద్గుణోపాసనము వలన మానవ ప్రజ్ఞకు గల మలినము లన్నియు తొలగింపబడి, సమస్తమునకు మూల కారణమగు ఈశ్వరుని దర్శింప వీలగును. 🍀

మహాత్మానసు మాం పార్థ దైవీం ప్రకృతి మాశ్రితాః |
భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాది మవ్యయమ్ || 13

తాత్పర్యము : దైవీ ప్రకృతి నాశ్రయించి మహాత్ములు సమస్త ప్రాణికోటికి ఆదికారణునిగను, నాశ రహితునిగను నన్నెరిగి ఇతర చింతన లేక నన్నే సేవించు చున్నారు.

వివరణము : ముందు శ్లోకమున ఆశ, మోహముల కారణముగ విచేతస్సులై జీవులు అజ్ఞాన వశమున ఆసురీ ప్రకృతి యందు ఎట్లు వ్యక్తకర్మలను నిర్వర్తించుచుందురో భగవంతుడు

తెలిపి యున్నాడు. ఆశామోహములను దరిరానీయకుండ కోరికల వెంటపడి, పతనము కాకుండ కర్తవ్య కర్మలను నిర్వర్తించు మానవులు క్రమముగ సత్వగుణమున స్థిరపడుదురు. ఆశా మోహములకు గురియైన వారు రజస్తమస్సులలో చిక్కుకొని, అజ్ఞాన వశమున అసురులగు చున్నారు.

కర్తవ్య కర్మను నిర్వర్తించు వారు సత్వమునందే స్థిరపడుట వలన సృష్టి ధర్మమును గ్రహించి, అహింస-సత్యము-బ్రహ్మచర్యము-ధర్మాచరణము వంటి సత్వ గుణముల ద్వారా సద్గుణోపేతులై మహాత్ములగుచున్నారు. అట్టి మహాత్ములకు అంతటను నిండియున్న ఈశ్వర దర్శనము క్రమముగ సాధ్యపడును. వారు సమస్త ప్రాణికోటికిని ఆధారముగ నున్నఈశ్వరుని ఎరిగి, అంతట ఈశ్వరునే దర్శించుచు అన్యము లేని మనసు గలవారై, అవ్యయుడగు తననే (ఈశ్వరునే) దర్శించుచు నున్నారు. సద్గుణోపాసనము వలన మానవ ప్రజ్ఞకు గల మలినము లన్నియు తొలగింపబడి, సమస్తమునకు మూల కారణమగు ఈశ్వరుని దర్శింప వీలగును.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


17 Nov 2021

No comments:

Post a Comment