మైత్రేయ మహర్షి బోధనలు - 25


🌹. మైత్రేయ మహర్షి బోధనలు - 25 🌹

✍️. రచన : సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 16. సమాన ధర్మము -1 🌻


సోదరత్వమున స్వతంత్రత, సమాన్వతము భాసించు చుండును. ఈ రెండు గుణములను సదవగాహన చేసుకొనుట అరుదు. దైవము మానవ రూపమున దిగివచ్చినపుడెల్ల తోటి జీవులతో సమానముగ కలిసి జీవించెను. వారి స్వతంత్రతకు తానడ్డుపడలేదు. దైవము యొక్క విశేషమైన సోదరభావము. అట్లు దైవము మానుష రూపములో ప్రవర్తించినపుడెల్ల సమాన ధర్మమును ఆచరించి చూపెను. సమకాలికులైన జనులు దాని విలువను తెలియక దైవముతో ప్రవర్తించిరి.

శ్రీకృష్ణుడు జీవితమును తరచి చూచి నప్పుడు సమకాలికులు సమాన ధర్మములు అవగాహన చేసుకొన లేకపోయిరి. జీవులలో ఇప్పటికిని 99 శాతము అధికారమును గౌరవించినట్లుగ, సోదరభావమును గౌరవింపలేదు. అధికారమునకు అణకువతో ప్రతిస్పందింతురు. సోదరత్వము అంతకుమించిన గుణము కనుక అణకువతో కూడిన ప్రేమతో ప్రతిస్పందించవలెను. అట్లుకాక దైవముతో మేమును సమానమే అని స్వతంత్రించి సమకాలికులు నష్ట పోయిరి.


సశేషం.....

🌹 🌹 🌹 🌹 🌹


10 Nov 2021

No comments:

Post a Comment