నిర్మల ధ్యానాలు - ఓషో - 92


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 92 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. మనం బీజాలం కానీ మనం బీజాలుగానే మరణించడం దురదృష్టం. మనం పూలుగా మారాలి. పరిమళాలు వెదజల్లాలి. మీరు హిమాలయాల అంత ఎత్తు, సముద్రమంత లోతు వున్నారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే మీరు కృతజ్ఞతతో నిండుతారు. 🍀

మనం బీజాలం కానీ మనం బీజాలుగానే మరణించడం దురదృష్టం. మనం పూలుగా మారాలి. పరిమళాలు వెదజల్లాలి. అపుడే సంతృప్తికి అవకాశముంది. వృక్షం పూలతో నిండినపుడే సంపూర్తి చెందినట్లు. వసంతంలో చెట్టు చిగురించి దాని హృదయం నించి చిమ్మిన రంగులు పూలుగా, పరిమళంగా, ఆనందంగా బహిర్గతమవుతాయి. చెట్టు గాలిలో, సూర్యుని కింద, నాట్యం చేస్తే పరిపూర్ణత చెందుతుంది.

మీలోని అనంత శక్తిని బహిర్గతం చెయ్యడమే నా పని. మీరు హిమాలయాల అంత ఎత్తు, సముద్రమంత లోతు వున్నారు. ఈ సంగతి మీరు గుర్తిస్తే మీరు కృతజ్ఞతతో నిండుతారు. అస్తిత్వం మీకు అవసరానికి మించి యిచ్చింది. అస్తిత్వం మీలోకి సృజనాత్మకతని దింపింది. మిమ్మల్ని సంపన్నుల్ని చేసింది. దరిద్రంలో అల్లాడే మనల్ని ధనవంతుల్ని చేసింది. నా సన్యాసులు ఎంత మాత్రం బిచ్చగాళ్ళు కారు. వాళ్ళు చక్రవర్తులు. ఆ సంగతి బహిరంగంగా ప్రకటించాలి.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


10 Nov 2021

No comments:

Post a Comment