శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 319 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹
సహస్ర నామముల తత్వ విచారణ
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 72. రమా, రాకేందువదనా, రతిరూపా, రతిప్రియా ।
రక్షాకరీ, రాక్షసఘ్నీ, రామా, రమణలంపటా ॥ 72 ॥ 🍀
🌻 319-1. 'రామా' 🌻
రమించు లక్షణము కలది రామా. రమించుట, రమింపబడుట శ్రీదేవి లక్షణము అని అర్థము. ఈ లక్షణము ఆధారముగనే సమస్త సృష్టి, యోగము చెంది యున్నది. సూర్యమండలము నందలి సమస్త గోళములు పరస్పరము సమర్థించుకొనుచు చోటులో నిలచి యుండుటకు ఈ శక్తియే ఆధారము. అట్లే గోళమునందు జీవులు వుండుటకు, జీవుల యందలి సమస్త అంగములు పరస్పరత్వము కలిగి పనిచేయుటకు రామా శక్తియే ప్రధానము. ఏకత్వమున వివిధత్వము, వివిధత్వమున ఏకత్వము రామా వైభవము.
ఒక వ్యక్తియందు గాని, వస్తువునందు గాని, పరిసరముల యందు గానీ, సన్నివేశముల యందు గాని ఆసక్తి జనింపవలె నన్నచో ఈ శక్తియే కారణము. రామాశక్తి లేనివాడు దేని యందును రమించలేడు. భక్తులు భగవంతుని యందు రమించవలె నన్నచో యోగులు ధ్యానమున నిలువ వలెనన్నచో రామాశక్తి అవసరమై యున్నది. ఎవరు దేనియందు రమింతురో దాని యందు ఆసక్తి కలిగి దానిని చేరుటకు ప్రయత్నింతురు. ఈ గుణము సృష్టియందు ప్రధానమగు లక్షణము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 319-1 🌹
1000 Names of Sri Lalitha Devi
✍️. Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 72. Rama rakenduvadana ratirupa ratipriya
Rakshakari rakshasaghni rama ramanalanpata ॥ 72 ॥ 🌻
🌻 319-1. Rāmā रामा (319)🌻
She is the embodiment of women. Liṅga Purāṇa says that all men are Śaṃkara (Śiva) and all women are Śaktī. It is also said that women should be respected. If they are ill-treated, their lineage would be destroyed. Ram means to delight. It is agni bīja (रं).
Agni bīja is considered as a potent bīja and when combined with other bīja-s, it increases their potency. Bīja-s in right combination with agni bīja provides blessedness. Yogi-s enjoy when they are submerged in bliss, when Śaktī and Śiva unite at sahasrāra. They are delighted in the stage of bliss, hence she is known as Rāmā.
(Lord Rāmā is the delight of yogis; hence He is known as Rāmā.)
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
10 Nov 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment