నిర్మల ధ్యానాలు - ఓషో - 105


🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 105 🌹

✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ

🍀. సమశృతి లేకుంటే దేవుడు లేడు. వునికిలోని సమశృతి ప్రతిదాన్నీ కలిపి వుంచుతోంది. నువ్వు సమశృతిలో వుంటే నీలో సహజంగా ఉత్సాహం ఉప్పొంగుతూ వుంటుంది. సమశృతికి మించిన కారుణ్యం మరొకటి లేదు. 🍀

విలువైన ప్రతిదాని స్థితిలో సమశృతి వుంటుంది. సమశృతి లేకుంటే దేవుడు లేడు. వునికిలోని సమశృతి ప్రతిదాన్నీ కలిపి వుంచుతోంది. అక్కడ అజ్ఞాతమైనదుంది. సమశృతి లేనిదే ప్రేమ లేదు. అది కనిపించని దారం. ఎవరూ దాన్ని చూడలేరు. ప్రతి ఒక్కరూ దాన్ని అనుభూతి చెందుతారు. కనిపించినది మాత్రమే అంతా కాదని ప్రేమ మనకి తెలుపుతుంది.

మనం చూసిన దానికన్నా అక్కడ ఏదో ఎక్కువ వుంది. చూసిన దానితోనే వాస్తవం పూర్తి కాదు. అక్కడ అనుభూతికి చెందిన గాఢత లోలోతుల్లో వుంది. అది పునాది. సమశృతి లేనిదే ఆనందం లేదు. నువ్వు సమశృతిలో వుంటే నీలో సహజంగా ఉత్సాహం ఉప్పొంగుతూ వుంటుంది. సమశృతిలో వున్న వ్యక్తి ఉల్లాసంగా, సౌంధర్యభరితంగా వుంటాడు. అది అనివార్యం. ఎందుకంటే ఉల్లాసాన్ని మించిన అందం మరొకటి లేదు. సమశృతికి మించిన కారుణ్యం మరొకటి లేదు.


సశేషం ...

🌹 🌹 🌹 🌹 🌹


06 Dec 2021

No comments:

Post a Comment